నాగార్జున, అల్లు అర్జున్ అతిధులుగా ‘సికందర్’ ఆడియో లాంచ్.

నాగార్జున, అల్లు అర్జున్ అతిధులుగా ‘సికందర్’ ఆడియో లాంచ్.

Published on Jul 17, 2014 1:42 PM IST

nagarjuna_surya_allu_arjun
‘సికందర్’ ఆడియో విడుదల కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా కింగ్ నాగార్జున, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హాజరుకానున్నారు. సూర్య, సమంత జంటగా లింగుస్వామి దర్శకత్వంలో నటించిన తమిళ చిత్రం ‘అంజాన్’. తెలుగులో ‘సికందర్’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ఆడియో జూలై 31న విడుదల చేస్తున్నారు. ‘సికందర్’ ఆడియో వేడుక నాగార్జున, అల్లు అర్జున్ ల సమక్షంలో అభిమానుల కోలాహలం మధ్య నిర్వహించనున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.

‘అంజాన్’ చిత్రం కోసం సూర్య తొలిసారిగా పాట పాడాడు. సూర్య పాడిన ఏక్.. దో.. తీన్.. పాట ఆడియోలో హైలైట్ గా నిలిస్తుందని చిత్రబృందం భావిస్తుంది. ‘అంజాన్’ తమిళ ఆడియోను ఈ నెల 23న డైరెక్ట్ గా మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. ఈ చిత్రాన్ని రామ్‌లక్ష్మి సినీ క్రియేషన్స్‌, తిరుపతి బ్రదర్స్‌ పతాకాలపై శిరీషా-శ్రీధర్‌, ఎన్‌. సుభాష్‌చంద్రబోస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 15న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సూర్య స్టైలిష్ లుక్, సమంత గ్లామ్‌ర్‌ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు