సమీక్ష : మాయ – మిమ్మల్ని పూర్తి మాయలో పడేసేంత లేదు.!

సమీక్ష : మాయ – మిమ్మల్ని పూర్తి మాయలో పడేసేంత లేదు.!

Published on Aug 1, 2014 11:58 AM IST
maaya_movie విడుదల తేదీ : 01 ఆగష్టు 2014
123తెలుగు. కామ్ రేటింగ్ : 2.5/5
దర్శకత్వం : నీలకంఠ
నిర్మాత : మధుర శ్రీధర్ –  ఎమ్‌.వి.కె.రెడ్డి
సంగీతం : శేఖర్ చంద్ర
నటీనటులు : హర్షవర్ధన్ రాణే, అవంతిక, సుష్మ రాజ్, నందిని రాయ్..

నేషనల్ అవార్డ్ అందుకున్న నీలకంఠ ఈ మధ్య చేస్తున్నసినిమాలతో కమర్షియల్ గా హిట్స్ అందుకోలేకపోతున్నాడు. అందుకే ఆయన ఈ సారి ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ (జరగబోయేదాన్ని ముందే తెలుసుకోవడం) కాన్సెప్ట్ తో ఆడియన్స్ ని థ్రిల్ ఫీల్ చెయ్యడానికి చేసిన సినిమా ‘మాయ’. డైరెక్టర్ మధుర శ్రీధర్ – ఎంవికె రెడ్డి కలిసి నిర్మించిన ఈ సినిమాలో హర్షవర్ధన్ రాణే, అవంతిక, సుష్మ రాజ్, నందిని రాయ్ కీలక పాత్రలు పోషించారు. ఇలాంటి కొత్త పాయింట్ తో ట్రై చేసిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుందో లేదో ఇప్పుడు చూద్దాం..

కథ :

మేఘన(అవంతిక) ఒక టీవీ రిపోర్టర్. మేఘనకి అందరి కంటే కాస్త భిన్నంగా కొన్ని కొన్ని సార్లు (ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ వల్ల) జరగబోయేది ముందుగానే తెలుస్తూ ఉంటుంది. అలా తనకి చిన్నప్పుడు ఒక సారి జరుగుతుంది. ఆ తర్వాత చాలా కాలం అలాంటి సంఘటనలేవీ జరగవు. ఒక ప్రాజెక్ట్ పరంగా మేఘనకి ఇండియా ఫేమస్ ఫాషన్ డిజైనర్ అయిన సిద్దార్థ్ వర్మ(హర్షవర్ధన్ రాణే)తో కలిసి పనిచేస్తుంది. ఈ జర్నీలొ తనతో ప్రేమలో పడుతుంది.

అప్పటి నుంచే తనకి మళ్ళీ ముందు ముందు జరగబోయే కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఆ విషయాల వల్ల తను పలు చిక్కుల్లో పడుతుంది. అలా చిక్కుల్లో పడ్డ మేఘన చివరికి ఏమయ్యింది? తనకి జరగబోయేది ముందే తెలియడం వల్ల మేఘన లైఫ్ లోకి ఎవరెవరు వచ్చారు.? ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది? సిద్దార్థ్ వర్మ మేఘనకి సపోర్ట్ చేసాడా? లేదా అన్నది మీరు తెరపైనే చూడాలి.

ప్లస్ పాయింట్స్ :

నీలకంఠ ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకి కాస్త పరిచయం ఉన్న కాన్సెప్ట్ ని తీసుకొని కాస్త క్లియర్ గా చెప్పడానికి ట్రై చేసాడు. అందులో కొంతవరకూ సక్సెస్ అయ్యాడు కానీ పూర్తిగా కాలేదు. సినిమా మొదలు పెట్టడమే కథలోకి వెళ్ళిపోవడం వలన సినిమా స్టార్టింగ్ చాలా బాగుంటుంది. అలాగే ఇంటర్వెల్ బ్లాక్ తో పాటు సినిమాలో వచ్చే కొన్ని సస్పెన్స్ ఎలిమెంట్స్ బాగున్నాయి. క్లైమాక్స్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ని చాల అతక్కువ మంది మాత్రమే ఊహించగలరు కాబట్టి ఆ ట్విస్ట్ దాదాపు 90% అందరికీ కనెక్ట్ అవుతుంది.

నటీనటుల్లో లీడ్ రోల్ చేసిన హర్షవర్ధన్ రాణే పెర్ఫార్మన్స్ సినిమాకి ఒక హైలైట్. ఒక వైపు స్టైలిష్ అండ్ హాన్డ్సం గా కనిపిస్తూ మరోవైపు నెగటివ్ షేడ్స్ ని కూడా పర్ఫెక్ట్ గా పండించాడు. ఇక హీరోయిన్స్ లో లీడ్ రోల్ చేసిన అవంతిక పెర్ఫార్మన్స్ ఓకే. కానీ హావ భావాల విషయంలో ఇంకా ఇంప్రూవ్ కావాల్సి ఉంది. మిగిలిన హీరోయిన్స్ లో సుష్మ రాజ్ నెగటివ్ షేడ్స్ మాత్రం బాగా చేసింది. నాగబాబు, ఝాన్సీ, వేణులు తమ పాత్రల పరిధిమేర చేసారు. సినిమా నిడివి 2 గంటలే కావడం కూడా ఈ సినిమాకి చాలా ప్లస్ అయ్యింది.

మైనస్ పాయింట్స్ :

పైన చెప్పినట్టు డైరెక్టర్ అనుకున్న కాన్సెప్ట్ ని చెప్పడంలో కొంతవరకూ సక్సెస్ అయ్యాడు కానీ పూర్తిగా కాలేదు. దానికి కారణం రాసుకునేటప్పుడు లాజికల్ గా కొన్ని పాయింట్స్ మిస్ అవ్వడమే. ఉదాహరణకి.. ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ కాన్సెప్ట్ ప్రకారం జరగబోయేది తెలుస్తుంది కానీ ఇందులో ఎప్పుడో జరిగిపోయింది తెలియడం అనేది కాన్సెప్ట్ కి అస్సలు సంబంధం ఉండదు. ఈ సినిమా కాన్సెప్ట్ ని ఇంగ్లీష్ సినిమాల్లో చూసే ఉంటారు. ఉదాహరణకి ‘ఫైనల్ డెస్టినేషన్’, ‘ఐస్’, ‘డార్క్ టచ్’, ‘ది గిఫ్ట్’, ‘స్కానర్స్’ మొదలైన సినిమాలు అవి చూసిన వారికి ఈ సినిమా పెద్దగా అనిపించకపోవచ్చు.

సినిమా స్టార్టింగ్ ఆసక్తిగా మొదలైనా ఆ తర్వాత చాలా స్లోగా ఉంటుంది. మధ్య మధ్యలో వచ్చే కొన్ని థ్రిల్లింగ్ మోమెంట్స్ తప్ప మిగతా అన్నీ ఆడియన్స్ కి బోర్ కొడతాయి. డైరెక్టర్ ఆడియన్స్ లో కంటిన్యూ సస్పెన్స్, ఆసక్తిని కలిగించలేకపోయాడు. అందుకే ఫస్ట్ హాఫ్ మీద మరింత ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సింది. అలాగే పాటలు కూడా సినిమా ఫ్లోకి అడ్డం అనే చెప్పాలి. అలాగే హర్షవర్ధన్ – అవంతిక మధ్య లవ్ ట్రాక్ కాస్త సాగదీసినట్టు ఉంటుంది. మాస్, కామెడీ, ఫైట్స్ కోరుకునే ఆడియన్స్ కి ఈ సినిమా పెద్దగా కనెక్ట్ కాకపోవచ్చు.

సాంకేతిక విభాగం :

ఇలాంటి థ్రిల్లర్ సినిమాలకి సాంకేతిక విభాగంలో మూడు డిపార్ట్ మెంట్స్ కీ రోల్ ప్లే చేస్తాయి. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, గ్రిప్పింగ్ ఎడిటింగ్. అందులో ముందుగా మ్యూజిక్ – శేఖర్ చంద్ర అందించిన పాటలు ఓకే అనేలా ఉన్నా తను చేసిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సినిమాకి పెద్ద హెల్ప్ అయ్యింది. ఇది వరకూ చెప్పినట్టు స్లోగా ఉన్న సీన్స్ ని కూడా తన మ్యూజిక్ తో మేనేజ్ చెయ్యడానికి బాగా ట్రై చేసాడు. బాల రెడ్డి అందించిన సినిమాటోగ్రఫీ కూడా చాలా హెల్ప్ అయ్యింది. విజువల్స్ చాలా కలర్ఫుల్ గా, రిచ్ గా ఉండేలా జాగ్రత్తలు బాగా తీసుకున్నారు. ఇక ఎడిటర్ నవీన్ నూలి సినిమాని చాలా వరకూ గ్రిప్పింగ్ గా ఉండడానికి ట్రై చేసాడు కానీ డైరెక్టర్ కొన్ని సీన్స్ కావాలి అన్నట్టు ఉన్నాడు అందుకే అతనికి తెలియకుండానే కొన్ని చోట్ల సాగదీసేసాడు.

డైలాగ్స్ జస్ట్ ఓకే అనేలా ఉంటాయి. ఈ సినిమాకి కెప్టెన్ అయిన నీలకంఠ విషయానికి వస్తే.. ఇలాంటి కాన్సెప్ట్ ని తెలుగు ప్రేక్షకులకి చెప్పాలి అనుకున్నప్పుడు ఎక్కువగా కాన్సెప్ట్, స్క్రిప్ట్ మరియు స్క్రీన్ ప్లే మీద వర్క్ అవుట్ చెయ్యాలి. కానీ ఈ మూడింటిలో కాన్సెప్ట్, స్క్రిప్ట్ విషయాల్లో కొంతవరకూ సక్సెస్ అయ్యాడు కానీ స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం పూర్తిగా ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. గతంలో డైరెక్టర్ గా నటుల నుంచి బెస్ట్ పెర్ఫార్మన్స్ రాబట్టుకోవడంలో నీలకంఠకి మంచి పేరుంది. కానీ ఈ సినిమాలో ఒక్క హర్ష వర్ధన్ నుంచి తప్ప మిగతా ఎవ్వరి నుంచి పాత్రకి న్యాయం చేసే రేంజ్ లో పర్ఫెక్ట్ నటనని రాబట్టుకోలేకపోయాడు. మధుర శ్రీధర్ – ఎంవికె రెడ్డి నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ తో తెలుగు ప్రేక్సహ్కులను ఆకట్టుకోవాలని నీలకంఠ చేసిన ‘మాయ’ సినిమా ఆడియన్స్ ని పూర్తిగా తన మాయలో పడేసుకోలేకపోయింది. ఎందుకంటే నీలకంఠ తీసుకున్న కాన్సెప్ట్ ని ఆడియన్స్ సీట్ చివర కూర్చొని నెక్స్ట్ ఏం జరుగుతుందా అనేలా తీయాలి కానీ ఆ రేంజ్ లో నీలకంఠ తీయలేకపోయాడు. కానీ తీసినంత వరకూ మరీ చెడగొట్టకుండా డీసెంట్ గా డీల్ చేసినందుకు మెచ్చుకోవాలి. స్టార్టింగ్, క్లైమాక్స్, కొన్ని థ్రిల్లింగ్ మో మెంట్స్, హర్షవర్ధన్ రాణే పెర్ఫార్మన్స్ సినిమాకి హైలైట్ అయితే లాజికల్ గా మిస్టేక్స్ ఉండడం, బోరింగ్ నెరేషన్, కంటిన్యూగా ఆడియన్స్ లో ఆసక్తి కలిగించలేకపోవడం మేజర్ మైనస్ పాయింట్స్. ఓవరాల్ గా ఈ సినిమా మల్టీ ప్లెక్స్ , ఎ సెంటర్స్ లో దేసేంట్ ఓపెనింగ్స్ తెచ్చుకున్నా బి,సి లలో రిసీవింగ్ మాత్రం కాస్ట్ డిఫరెంట్ గా ఉండే అవకాశం ఉంది.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
 
123తెలుగు టీం

సంబంధిత సమాచారం

తాజా వార్తలు