సమీక్ష : గాల్లో తేలినట్టుందే – అనుకున్న మెసేజ్ ఇవ్వలేకపోయారు.!

సమీక్ష : గాల్లో తేలినట్టుందే – అనుకున్న మెసేజ్ ఇవ్వలేకపోయారు.!

Published on Aug 1, 2014 12:00 PM IST
Gallo-Telinattunde-2 విడుదల తేదీ : Aug 01, 2014
123తెలుగు. కామ్ రేటింగ్ : 2.25/5
దర్శకత్వం : వెంకట్ సురేష్
నిర్మాత : వంశీ కృష్ణ, వెంకట్ రావు
సంగీతం : సాయి కార్తీక్
నటీనటులు : అజయ్, కౌసల్య

ఈ వారం విడుదల అయిన మరో చిన్న సినిమా ‘గాల్లో తేలినట్టుందే’. వెంకట్ సురేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్వారా అజయ్, కౌసల్యలు హీరో హీరోయిన్ లుగా పరిచయం అవుతున్నారు. ఈరోజు విడుదలైన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ:

రామ్ (అజయ్), సురేష్, లింగబాబు మరియు కుమార్, ఈ నలుగురు ఒక్కే కాలేజీలో చదివే మంచి మిత్రులు. అల్లరి చేస్తూ, కాలేజీలో అమ్మాయిలను ఆటపట్టిస్తూ తమ టీనేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. టైం పాస్ కోసం అమ్మాయిలతో స్నేహం చేద్దాం అని ఆలోచిస్తూ ఉంటారు. మరో వైపు, జాను(కౌసల్య), రామ్ కి చిన్ననాటి స్నేహితురాలు, ఇద్దరూ ఒకే కాలేజీలో చదువుతుంటారు. జానుకి రామ్ అంటే ఇష్టం, కానీ ఆ ఇష్టాన్ని తను రామ్ కి తెలుపదు.

అనుకోకుండా ఒక రోజు, ఈ నలుగురు స్నేహితులు ఒక కాల్ గర్ల్ ని రూంకి తీసుకువస్తారు. అప్పుడు అనుకోని ఒక సంఘటన ఎదురవుతుంది. ఎంటా సంఘటన, దాని నుండి ఎలా బయటపడుతారు, జాను తన ప్రేమని రామ్ కి తెలుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకాలంటే, సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

అజయ్, కౌసల్య, మునీశాతో పాటు ఇతర యువ నటినటులు కూడా మంచి నటనను కనబరిచారు. ఒక ప్రముఖ పాత్రలో నటించిన షాయాజీ షిండే, మంచి పెర్ఫార్మన్స్ ని ఇచ్చారు. ఈ సినిమాలో చిన్న చిన్న పాత్రలు పోషించిన పోసాని కృష్ణ మురళి, రఘుబాబు, కృష్ణ భగవాన్, పృథ్వీలు తమ పాత్రలకు న్యాయం చేసారు.

ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని డబల్ మీనింగ్ డైలాగులతో వచ్చే కామెడీ సన్నివేశాలు బాగున్నాయి. కొన్ని కాలేజీ ఎపిసోడ్స్, ఫ్రెండ్ షిప్ పై వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగా తీసారు.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమా మైనస్ లో మొదటగా చెప్పుకోవాల్సింది డోస్ కి మించి పోయిన వల్గారిటీ.. ఈ మధ్య కాలంలో చాలా మంది భూతు డైలాగులు, వల్గారిటీ సీన్స్ పెట్టేసి యువతని ఆకట్టుకొని నాలుగు కాసులు రాల్చుకోవాలని చూస్తుంటారు. ఇందులోనూ అదే జరిగింది. ఓవర్ డబుల్ మీనింగ్ డైలాగ్స్, అతిగా ఎక్స్ పోజింగ్ అలాంటి ఎక్స్ పోజింగ్ సీన్స్ కి సెన్సార్ వారి బ్లర్ మార్క్స్ ఇవన్నీ చూడలేక వినలేక ఆడియన్స్ కి పూర్తిగా చిరాకు వస్తుంది. అలాగే క్లైమాక్స్ కూడా ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్.

అంత భూతు చూపించినా ఈ సినిమా ద్వారా ఈ చిత్ర టీం ఒక మెసేజ్ ని ఇవ్వాలనుకున్నారు. కానీ ఎక్కువగా భూతు మీద దృష్టి పెట్టడం వలన చెప్పాలనుకున్నది చెప్పలేకపోయారు. కొంతవరకూ కామెడీ సీన్స్ కూడా బాగా రొటీన్ గా ఉన్నాయి. డైరెక్టర్ సెకండాఫ్ లో రివీల్ చేయాలనుకున్న ట్విస్ట్ ని ఆడియన్స్ ముందే గ్రహించేయగలరు.

సాంకేతిక విభాగం :

సాయి కార్తీక్ అందించిన సాంగ్స్ జస్ట్ ఓకే అనేలా ఉన్నాయి. అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతంతమాత్రంగానే ఉంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ముఖ్యంగా పాటల్ని చాలా బాగా షూట్ చేసారు. ఎడిటింగ్ చెప్పుకునేంత లేదు. చెప్పాలంటే అవసరం లేకపోయినా సినిమాలో పెట్టిన కొన్ని భూతు సీన్స్ ని కత్తిరించేసి ఉండాల్సింది.

స్క్రీన్ ప్లే అస్సలు బాలేదు. ఎందుకంటే ట్విస్ట్ ఊహించే విధంగా ఉంది, అలాగే చాలా చోట్ల ఆడియన్స్ ని బాగా కన్ఫ్యూజ్ చేసారు. ఇక డైరెక్టర్ సీన్స్ ని బాగానే రాసుకున్నప్పటికీ వాటిని సరిగా డీల్ చెయ్యలేకపోయాడు.

తీర్పు :

‘గాల్లో తేలినట్టుందే’ అనే సినిమా డబుల్ మీనింగ్ డైలాగ్స్ కి మరియు వల్గారిటీకి అడ్డా అని చెప్పుకోవాలి. ఈ సినిమాని ఫ్యామిలీ ఆడియన్స్ ఎంజాయ్ చెయ్యలేరు. కేవలం అడల్ట్ కామెడీని ఎంజాయ్ చెయ్యగలిగిన యువతకు మాత్రమే ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. మిగతా వారు చూడాలా వద్దా అన్నది మీరే నిర్ణయించుకోండి..

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు