సమీక్ష : దిక్కులు చూడకు రామయ్య – డిఫరెంట్ లవ్ స్టొరీ విత్ ఫ్యామిలీ ఎమోషన్స్.!

సమీక్ష : దిక్కులు చూడకు రామయ్య – డిఫరెంట్ లవ్ స్టొరీ విత్ ఫ్యామిలీ ఎమోషన్స్.!

Published on Oct 10, 2014 4:25 PM IST
Dikkulu-Chudaku-Ramayya_rev విడుదల తేదీ : 10 అక్టోబర్ 2014
123తెలుగు. కామ్ రేటింగ్ : 3.25/5
దర్శకత్వం : త్రికోటి
నిర్మాత : రజిని కొర్రపాటి
సంగీతం : ఎం.ఎం కీరవాణి
నటీనటులు : నాగ శౌర్య, సన మక్బూల్, అజయ్, ఇంద్రజ..


‘ఈగ’, ‘అందాల రాక్షసి’, ‘లెజెండ్’, ‘ఊహలు గుసగుసలాడే’ లాంటి హిట్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించి టేస్టున్న నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న నిర్మాత సాయి కొర్రపాటి. అదే వారాహి చలన చిత్రం బ్యానర్ లో ఎస్ఎస్ రాజమౌళి దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన త్రికోటిని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ చేసిన సినిమా ‘దిక్కులు చూడకు రామయ్య’. నాగ శౌర్య, సన మక్బూల్, అజయ్, ఇంద్రజ కీలక పాత్రలు పోషించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కి ఎంఎం కీరవాణి సంగీతం అందించాడు. ఇప్పటి వరకూ టాలీవుడ్ కి పరిచయం లేని కాన్సెప్ట్ తో వచ్చిన ఈ ‘దిక్కులు చూడకు రామయ్య’ తెలుగు ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పించిందో.? వారాహి బ్యానర్ కి మరో విజయాన్ని అందించిందా.?లేదా.? అనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

గోపాల కృష్ణ అలియాస్ క్రిష్ (అజయ్) తన భామ్మ వల్ల 15 ఏళ్ళ వయసులోనే భవాని(ఇంద్రజ)ని పెళ్లి చేసుకొని 24 ఏళ్ళకే ఇద్దరి పిల్లల తండ్రి అయిపోయి కుటుంబ బాధ్యతలు నెత్తిన వేసుకుంటాడు. దానివల్ల తను తన కుర్ర వయసులో చేయాలనుకున్న లవ్ అండ్ ఎంజాయ్మెంట్ ని మిస్ అవుతాడు. అందుకే లేటు వయసులో క్రిష్ కనిపించిన అమ్మాయికల్లా లైన్ వేస్తూ ఉంటాడు. అదే తరుణంలో గోపాల కృష్ణకి సమీత (సన మక్బూల్)తో పరిచయం అవుతుంది. అనుకున్నట్టుగానే క్రిష్ సమీత తో ప్రేమలో పడతాడు.

అదే సమయంలో పక్కన మరో ట్రాక్ నడుస్తుంటుంది. గోపాల కృష్ణ పెద్ద కొడుకు మధు(నాగ శౌర్య) కూడా సమీతతో ప్రేమలో పడతాడు. ఒకానొక సందర్భంలో మధుకి తను ప్రేమించే అమ్మాయినే తన తండ్రి క్రిష్ కూడా ప్రేమిస్తున్నాడని, తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని తెలుస్తుంది. అది తెలుసుకున్న మధు తన తండ్రి కోసం తన ప్రేమని వదులుకున్నాడా.? లేక మధు తన తండ్రిని సమీతకి దూరం చేసి తన తల్లికి దగ్గర చేయడానికి ట్రై చేసాడా.? లేటు వయసులో తన ప్రేమని దక్కించుకోవడానికి గోపాల కృష్ణ పడ్డ కష్టాలు ఏమిటి.? అనేది మీరు వెండితెరపైనే చూడాలి.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ లో చెప్పుకోవాల్సినవి మూడు ఉన్నాయి. అవేమిటంటే తెలుగు ప్రేక్షకులకు కొత్తగా అనిపించే కథ, క్లైమాక్స్ ఎపిసోడ్ మరియు ఎంఎం కీరవాణి మ్యూజిక్.

ఇక మిగతా ప్లస్ పాయింట్స్ గురించి మొదలు పెడితే.. ఈ సినిమా కోసం ఎంచుకున్న ప్రతి నటీనటులు వారి వారి పాత్రలకి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. ఈ సినిమాలో మెయిన్ లీడ్ రోల్ చేసింది అజయ్. అజయ్ ఆ పాత్రకి బాగా సూట్ అయ్యాడు. లేటు వయసు పాత్రలో కుర్రాడిగా కనిపించడానికి తను చేసే ప్రయత్నాలు బాగా నవ్వు తెప్పిస్తాయి. అజయ్ కి ఓ కొత్త ఇమేజ్ ఇచ్చే సినిమా ఇది. నాగ శౌర్య మొదటి సినిమా కంటే ఈ సినిమాలో ఇంకాస్త బెటర్ నటనని కనబరిచారు. లవ్ సీన్స్ లో బాగా చెయ్యగలడు అని గత సినిమాలో నిరూపించుకున్న శౌర్య ఈ సినిమాతో ఎమోషనల్ సీన్స్ కూడా బాగా చెయ్యగలనని నిరూపించుకున్నాడు. అంతే కాకుండా చాలా హాన్డ్సంగా కూడా ఉన్నాడు.

ఇక సన మక్బూల్ కి మొదటి సినిమా అయినా తన పాత్రకి బాగా డిమాండ్ ఉన్న పాత్రలో నటించే చాన్స్ కొట్టేయడమే కాకుండా తన నటనతో అందరిచేత మంచి మార్కులే కొట్టేస్తుంది. లుక్స్ పరంగా సనని చాలా బాగా చూపించారు. అలాగే అటు మోడ్రన్, ఇటు క్లాస్ డ్రెస్సెస్ లో కూడా సన బాగా సెట్ అయ్యింది. చాలా రోజుల తర్వాత తెరపై కనిపించిన ఇంద్రజ ఎమోషనల్ పాత్రలో మంచి పెర్ఫార్మన్స్ కనబరిచి ఉన్న నాలుగు సీన్స్ లో అందరినీ తనవైపు తిప్పుకుంది. ఇక బ్రహ్మాజీ ఫుల్ ఫన్నీ రోల్ చేసాడు. బ్రహ్మాజీ – అజయ్ కాంబినేషన్ లో వచ్చే ఐదారు సీన్స్ లో కామెడీ బాగా వర్కౌట్ అవ్వడంతో ఆడియన్స్ తెగ ఎంజాయ్ చేస్తారు. మిమ్మల్ని థియేటర్ లో బాగా నవ్వించేది బ్రహ్మాజీ మాత్రమే.

ఇలాంటి సినిమాలకి క్లైమాక్స్ లో అన్ని పాత్రలకి జస్టిఫై చెయ్యడం చాలా కష్టం కానీ డైరెక్టర్ త్రికోటి మాత్రం చాలా బాగా డీల్ చేసి జస్టిఫికేషన్ బాగా ఇవ్వడంతో అందరూ కనెక్ట్ అవుతారు. ఇక హైదరబాద్ లో చూపించిన అన్ని విజువల్స్ చాలా బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్స్ లో ముందుగా చెప్పాల్సింది స్లోగా సాగే స్క్రీన్ ప్లే మరియు రన్ టైం. ఫస్ట్ హాఫ్ మొదలైన 10 నిమిషాల తర్వాత నుంచి కథ ముందుకు సాగకుండా చాలా స్లోగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం స్లోగా సాగినా ఇంటర్వల్ లో అయినా సినిమాలో ఉన్న ట్విస్ట్ ని రివీల్ చేసి ఆడియన్స్ లో సస్పెన్స్ క్రియేట్ చెయ్యకుండా చాలా సింపుల్ గా ఇంటర్వల్ వేయడం వలన ఆడియన్స్ కి పెద్ద కిక్ ఉండదు. ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడన్నా నవ్వుకోవడానికి బ్రహ్మాజీ కామెడీ సీన్స్ ఉంటాయి కానీ సెకండాఫ్ లో ప్రీఎ కలిమాక్స్ వరకూ ఎక్కువగా ఎమోషనల్, సెంటిమెంట్ సీన్స్ పెట్టడం వలన ఆడియన్స్ బోర్ ఫీలవుతారు.

ఇక ఈ సినిమాలోని కొన్ని అనవసర సీన్స్ ని తగ్గించుకొని ఓవరాల్ గా 2 గంటల్లో సినిమా తీసి ఉంటే ఆడియన్స్ ఇంకా బెటర్ ఫీలయ్యేవారు. ఇక చెప్పుకోవాల్సింది స్క్రీన్ ప్లే.. డైరెక్టర్ తెలుగు ప్రేక్షకులకు కొత్తగా అనిపించే కథ రాసుకున్నాం కదా ఆడియన్స్ కి కనెక్ట్ అయిపోద్దిలే అనుకున్నట్టు ఉన్నారు, అందుకే స్క్రీన్ ప్లే మీద సరిగా శ్రద్ధ తీసుకోలేదు. ఇక రెగ్యులర్ ఆడియన్స్ కోరుకుంటే ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ ఇందులో తక్కువగానే ఉన్నాయి.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో అందరి పని ఒక ఎత్తైతే ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ మాత్రమే ఒక ఎత్తు. చెప్పాలంటే ఆయన లేకపోతే ఈ సినిమా 80% లేనట్టే.. ఎందుకు ఈ రేంజ్ లో చెబుతున్నాం అంటే.. కీరవాణి అందించిన అన్ని సాంగ్స్ సినిమాకి చాలా బాగా సెట్ అయ్యాయి అండ్ హిట్ అయ్యాయి. ఇకపోతే ఆయన ఇచ్చిన నేపధ్య సంగీతం సినిమాకి ప్రాణాన్ని ఇచ్చింది. డైరెక్టర్ తీసిన సీన్ బోరింగ్ గా ఉన్నా, ఎమోషనల్ గా ఉన్నా, కామెడీ గా ఉన్నా ఆయా సీన్స్ కి ఆయనిచ్చిన బ్యాక్ మ్యూజిక్ మాత్రం సింప్లీ సూపర్బ్. హ్యాట్సాఫ్ టు కీరవాణి. ఇక చెప్పుకోవాల్సింది రాజశేఖర్ సినిమాటోగ్రఫీ గురించి. తను షూట్ చేసింది హైదరబాద్ లోనే అయినా లోకేషన్స్ ని చాలా బాగా చూపించాడు. ముఖ్యంగా ఒక రూమ్ సెట్ లో తీసిన సాంగ్స్ విజువల్స్ చాలా బాగున్నాయి. తమ్మిరాజు ఎడిటింగ్ బిలో యావరేజ్ గా ఉంది. ఎందుకంటే ఆయన ఎడిటింగ్ లో ఎక్కడా స్పీడ్ కనిపించలేదు. రమేష్ – గోపి అందించిన డైలాగ్స్ చాలా డీసెంట్ గా ఉన్నాయి. కథకి సరిపోయాయి.

ఇక సినిమాకి కీలకమైన కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం డిపార్ట్ మెంట్స్ కి వస్తే… కథ – పివి గిరి రాసిన కథ పలు హాలీవుడ్ సినిమాకి స్పూర్తిగా అనిపించినప్పటికీ తెలుగు ప్రేక్షకులకి మాత్రం కొత్తగా ఉంది అనిపించే కథే.. స్క్రీన్ ప్లే – త్రికోటి స్క్రీన్ ప్లే విషయంలో బాగా ఫెయిల్ అయ్యాడు. దర్శకత్వం – ఈ విషయంలో మాత్రం త్రికోటి సక్సెస్ అయ్యాడు. నటీనటుల నుంచి రాబట్టుకోవడంలో, క్లైమాక్స్ ని ఆడియన్స్ కి కనెక్ట్ చెయ్యడంలో, ఎమోషనల్ సీన్స్ తీయడంలో బాగా సక్సెస్ అయ్యాడు. ఇకపోతే ఎప్పటిలానే కథని నమ్మి సినిమా తీసే వారాహి చలన చిత్రం సాయి కొర్రపాటి నిర్మాణ విలువలు బాగా రిచ్ గా ఉన్నాయి. ఎక్కడా కాంప్రమైజ్ లేదు, చూస్తున్నంత సేపూ భారీ బడ్జెట్ సినిమా తీస్తున్నామనే ఫీలింగ్ లోనే ఆడియన్స్ ఉంటారు.

తీర్పు :

ఓ డిఫరెంట్ కథతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘దిక్కులు చూడకు రామయ్య’ సినిమా వారాహి చలన చిత్రం బ్యానర్ నుంచి వచ్చిన మరో క్లాస్ రొమాంటిక్ ఎంటర్టైనర్. ప్రేమనేది ‘ఐ లవ్ యు’ అనే పదంలో కాదని, ఎదుటి వ్యక్తి చూపే ఆప్యాయత, అనురాగం, మనపట్ల చూపే జాగ్రత్తలోనే ప్రేమ ఉంటుందనే పాయింట్ ని బాగా చెప్పారు. నటీనటుల పెర్ఫార్మన్స్, బ్రహ్మాజీ కామెడీ, క్లైమాక్స్ ఎపిసోడ్ మరియు ఎంఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్స్ అయితే స్లోగా సాగే ఫస్ట్ హాఫ్, బోరింగ్ స్క్రీన్ ప్లే మరియు రన్ టైం చెప్పదగిన మైనస్ పాయింట్స్. ఓవరాల్ గా దిక్కులు చూడకు రామయ్య సినిమా ఆడియన్స్ కి కొత్త కథతో ఫ్రెష్ ఫీల్ ని ఇచ్చే సినిమా అవుతుంది.

123తెలుగు. కామ్ రేటింగ్ : 3.25/5

123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు