పబ్లిసిటీ చేయడంలో రేణు దేశాయ్ తర్వాతే ఎవరైనా..!

పబ్లిసిటీ చేయడంలో రేణు దేశాయ్ తర్వాతే ఎవరైనా..!

Published on Oct 14, 2014 8:26 PM IST

Renu-Desai1
సినిమా తీయడం ఎంత ముఖ్యమో.. దానిని ప్రేక్షకులకు చేరువయ్యేలా చేయడం కూడా అంతే ముఖ్యం. ఈ విషయంలో రేణు దేశాయ్ ను చూసి కొందరు తెలుగు దర్శకనిర్మాతలు కొంతైనా నేర్చుకోవలసిన అవసరం ఉంది. ఒకప్పటి హీరోయిన్ గా, పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా తన ఇమేజ్ ను పూర్తిగా ఉపయోగించుకుంటూ ‘ఇష్క్ వాలా లవ్’కు ఫుల్ పబ్లిసిటీ చేసింది.

ఒక్క రోజులో 18 మీడియా ఛానల్ ప్రతినిధులకు ప్రత్యేక వీడియో ఇంటర్వ్యూలు ఇచ్చింది. ప్రముఖ దిన పత్రికలకు, వెబ్ మీడియాతో ప్రత్యేకంగా సంభాషించింది. ఎక్కడా అసహనం, కోపం ప్రదర్శించకుండా రేణు దేశాయ్ చాలా ఓపికగా నవ్వుతూ మాట్లాడడం ఆమె ప్రత్యేకత. ఇటివల కాలంలో కొందరు హీరోలు, దర్శకనిర్మాతలు పబ్లిసిటీ అంటే మొహం చాటేస్తున్నారు.

రేణు దేశాయ్ దర్శకురాలిగా పరిచయమైన మరాఠీ సినిమా ‘ఇష్క్ వాలా లవ్’. ఈ సినిమాను తెలుగులో డబ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 24న విడుదలవుతుంది. ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి ఒక రేంజ్ లో కష్టపడుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు