ఇంటర్వ్యూ : ఆది – ప్రేమించడం తప్పు కాదు, పెళ్లి చేసుకోకపోవడం తప్పు.

ఇంటర్వ్యూ : ఆది – ప్రేమించడం తప్పు కాదు, పెళ్లి చేసుకోకపోవడం తప్పు.

Published on Nov 24, 2014 3:59 PM IST

aadi
యువ హీరో ఆది నటించిన తాజా యాక్షన్ ఎంటర్టైనర్ ‘రఫ్’. ఈ సినిమాలో 6 ప్యాక్ తో సందడి చేయనున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. అభిలాష్ మాధవరం నిర్మాణంలో సుబ్బారెడ్డి దర్శకత్వం వహించిన ‘రఫ్’ నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఓవైపు పెళ్లి పనుల్లో బిజీగా గడుపుతున్న ఆది, సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. సోమవారం నాడు సినిమా విశేషాలను తెలియజేయడానికి ఆది విలేకరులతో సమావేశం అయ్యారు. ఆ విశేషాలు మీకోసం.

ప్రశ్న) త్వరలో ఏడడుగులు వేయబోతున్నారు. మీ అభిమానుల కోసం కాస్త పెళ్లి కబుర్లు చెప్పండి..?

స) అందరూ భావిస్తున్నట్టు నాది లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్డ్ మ్యారేజ్. ఒక మంచి సంబంధం వచ్చింది. పెళ్లి చేసుకోవడానికి ఇదే సరైన సమయం అని భావించాను. నా కాబోయే అర్ధాంగి పేరు అరుణ, బిటెక్ చదివింది. తనది అర్ధం చేసుకునే మనస్తత్వం. మా ఇంట్లో వాళ్ళతో, ముఖ్యంగా అమ్మ, చెల్లితో బాగా కలసిపోయింది. డిసెంబర్ 13న హైదరాబద్లో పెళ్లి జరుగుతుంది. ఇంట్లో పెద్దవాళ్ళు పెళ్లి పిలుపులు ప్రారంభించారు. 28న సినిమా విడుదలైన తర్వాత రెండు రోజులు ప్రమోషన్ కార్యక్రమాలలో పోల్గొంటాను. తర్వాత నేను కూడా పూర్తిగా పెళ్లి పనులకు అంకితం అవుతాను.

ప్రశ్న) సినిమా విషయానికి వస్తే, రెండేళ్ళ తర్వాత ‘రఫ్’ సినిమా విడుదలవుతుంది. మీ ఫీలింగ్స్ ఏంటి..?

స) ఈ సినిమా షూటింగ్ ప్రారంభించిన తర్వాత నేను చేసిన మరో రెండు సినిమాలు విడుదలయ్యాయి. అయినా నా మనసు ఎప్పుడూ ‘రఫ్’ సినిమా వైపు ఉండేది. దర్శకనిర్మాతలతో రెగ్యులర్ గా టచ్ లో ఉండేవాడిని. సినిమా కథపై నాకు నమ్మకం ఉంది. ఈ నెల 28న సినిమా విడుదలవుతుంది. తప్పకుండా విజయం సాధిస్తుంది.

ప్రశ్న) సినిమాలో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి..?

స) నా క్యారెక్టర్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. ప్రేమించడం తప్పు కాదు, ప్రేమించిన అమ్మాయిని వదిలేయడం తప్పు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకపోవడం తప్పు. అనే కాన్సెప్ట్ తో ‘రఫ్’ సినిమా తెరకెక్కింది. ప్రేమ మీద డిఫరెంట్ ఒపీనియన్స్ కల ముగ్గురు వ్యక్తుల మధ్య ఈ కథ జరుగుతుంది. పాయింట్ చాలా హెవీగా ఉన్నా ఎంటర్టైనింగ్ గా తెరకెక్కించాం.

ప్రశ్న) 6 ప్యాక్ చేయాలనే ఆలోచన ఎవరిది..?

స) సినిమా ప్రారంభంలో 6 ప్యాక్ చేయాలని అనుకోలేదు. రామ్ – లక్ష్మన్ మాస్టర్స్ అద్బుతమైన భారి ఫైట్స్ కంపోజ్ చేశారు. యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలో హీరో కొడితే ప్రేక్షకులు నమ్మాలి. అప్పుడు నేను ఏం చేస్తే బాగుంటంది అని ఆలోచించినప్పుడు 6 ప్యాక్ ఐడియా వచ్చింది. 8 నెలలు కష్టపడి 6 ప్యాక్ చేశాను. ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్స్ చూసిన తర్వాత సంతోషంగా అనిపించింది.

ప్రశ్న) రకుల్ ప్రీత్ సింగ్ ఇమేజ్ సినిమాకి ఎంత వరకూ హెల్ప్ అవుతుందని భావిస్తున్నారు..?

స) ఆమె నటించిన సినిమాలు వరుసగా విజయాలు సాధించడంతో ‘రఫ్’కి పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. తన ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి ఆశ్చర్యపోయాను. రకుల్ ప్రీత్ సింగ్ ఇమేజ్ సినిమాకి మంచి ఓపెనింగ్స్ లో రాబట్టడంలో హెల్ప్ అవుతుంది. సినిమాలో రకుల్ మంచి క్యారెక్టర్ లో నటించింది. ముఖ్యంగా రెండు పాటల్లో డాన్స్ బాగా చేసింది.

ప్రశ్న) దర్శకుడు సుబ్బారెడ్డి మీకు చెప్పిన కథకు ఎంత వరకూ న్యాయం చేశాడు..?

స) ఒక మాస్ ఫిల్మ్ ను చాలా స్టైలిష్ గా తీశాడు. గతంలో తను చాలా పెద్ద పెద్ద దర్శకుల వద్ద పని చేశాడు. ఆ అనుభవం అంతా ‘రఫ్’ సినిమాలో కనిపిస్తుంది. ఒక పెద్ద సినిమా కిందా తెరకెక్కించాడు. డబ్బింగ్ చెప్పే సమయంలో నేను రషెస్ చూసి, చాలా స్టైలిష్ గా తీశావు అని సుబ్బారెడ్డితో చెప్పాను. అతనితో వర్క్ చేయడం చాలా హ్యాపీ.

ప్రశ్న) అభిలాష్ మాధవరం నిర్మాణ విలువలు ఎలా ఉన్నాయి..?

స) సినిమా విడుదల ఆలస్యం అయినా ఎక్కడా రాజీ(కాంప్రమైజ్) పడకుండా సినిమాను నిర్మించాడు. ‘రఫ్’ క్లైమాక్స్ లో వచ్చే సాంగ్ సినిమాకి హైలైట్ గా ఉంటుంది. చాలా కాస్ట్లీ సాంగ్ అది. లాస్ట్ షెడ్యూల్లో ఆ సాంగ్ షూట్ చేసినా ఎప్పుడూ డబ్బులు లేవు అని అనలేదు. మూడు భారి సెట్స్ వేయించాడు. ఫస్ట్ సినిమా అయినా అతని ప్రొడక్షన్ వాల్యూస్ గ్రాండ్ లెవెల్లో ఉంటాయి.

ప్రశ్న) సినిమాలో హైలైట్స్ ఏంటి..?

స) ఒక్క మాటలో చెప్పాలంటే… అవుట్ & అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ ‘రఫ్’. హీరో హీరోయిన్ల మధ్య చక్కని క్యూట్ లవ్ ట్రాక్, అక్కా తమ్ముళ్ళ సెంటిమెంట్, మణిశర్మ గారి పాటలు ప్రొడక్షన్ వాల్యూస్, గ్రాండ్ విజువల్స్, రామ్ – లక్ష్మణ్ ఫైట్స్ ఇలా సినిమాలో అన్ని కమర్షియల్ హంగులు పర్ఫెక్ట్ గా కుదిరాయి.

ప్రశ్న) సినిమాలో శ్రీహరి గారు నటించారు. కాని, ట్రైలర్ లో శ్రీహరి గారిని చూపించలేదు. ఎందుకని..?

స) ఈ సినిమాకి శ్రీహరి గారు ఒక ఆయుధం. హీరోయిన్ రకుల్ ప్రీత్ బ్రదర్ గా నటించారు. థియేటర్లో ప్రేక్షకులు ఆయన క్యారెక్టర్ చూసి థ్రిల్ ఫీల్ అవుతారు. అందుకే ట్రైలర్ లో శ్రీహరి గారిని చూపించలేదు. చాలా మంది శ్రీహరి గారి నటించిన చివరి సినిమాగా పబ్లిసిటీ చేయమని సలహా ఇచ్చారు. అది నాకు నచ్చలేదు. కాని, ఈ సినిమా శ్రీహరి గారికి ఘనమైన వీడ్కోలు (పర్ఫెక్ట్ ఫెయిర్ వెల్) అందించే సినిమా అవుతుంది.

ప్రశ్న) మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి..?

స) ‘గరం’ సినిమా చేస్తున్నాను. 20 రోజులు పాటు షూటింగ్ చేశాం, ఒక షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. పెళ్లి పనుల వల్ల కొంచం బ్రేక్ ఇచ్చాను. అంటూ ఇంటర్వ్యూను ముగించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు