మొదటి సినిమా ‘అలా మొదలైంది’ తోనే తన నటనా చాతుర్యంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన హీరోయిన్ నిత్యా మీనన్. నిత్యా మీనన్ చేసే సినిమాలన్నిటిలోనూ నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలే చేస్తారు. అలాగే చేసే సినిమాలన్నీ బాక్స్ ఆఫీసు వద్ద హిట్ అవుతుంటాయి కూడా.. లేటెస్ట్ గా నిత్యా మీనన్ నటించిన ఓకే బంగారం సినిమా గత శుక్రవారం రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. అంతే కాకుండా S/O సత్యమూర్తి, తమిళ్ లో రిలీజ్ అయిన కాంచన 2 కూడా రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా నిత్యా మీనన్ తో కాసేపు ముచ్చటించి పలు విశేషాలు తెలుసుకున్నాం. ఆ విశేషాలు మీకోసం..
ప్రశ్న) S/O సత్యమూర్తి, ఓకే బంగారం, కాంచన 2(గంగ) సినిమాలు ఒకే టైంలో రిలీజ్ అయ్యి మంచి హిట్ అయ్యాయి. మీరెలా ఫీలవుతున్నారు.?
స) ఒకే టైంలో ఇన్ని సినిమాలు రిలీజ్ అయ్యి మంచి హిట్ అయ్యాయి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ మూడు సినిమాలు ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు. ప్రతి సినిమాలో డిఫరెంట్ రోల్ చేసాను. అన్నీ హిట్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది, అలాగే యాక్టర్ గా నేను చాలా సాటిస్ ఫై అయ్యాను.
ప్రశ్న) ‘S/O సత్యమూర్తి’లో మీ పాత్ర మరీ అంత ప్రాముఖ్యత ఉన్నది కాదు. అలాంటప్పుడు మీరెందుకు ఓకే చేసారు.?
స) నాకు త్రివిక్రమ్ గారి వర్క్ బాగా నచ్చింది. ఆయన అత్తారింటికి దారేది సినిమా నాకు బాగా నచ్చింది. ఆయన కమర్షియల్ స్పేస్ లో చాలా ఇంటెలిజెంట్ గా సినిమా చేస్తారు. కమర్షియల్ తో పాటు మంచి కంటెంట్ కూడా ఉంటుంది. కమర్షియల్ సినిమా ఎలా ఉంటుందనేది ట్రై చెయ్యడానికి ఈ సినిమా చేసాను.
ప్రశ్న) నిత్యా మీనన్ సినిమాలు చేస్తే అది కచ్చితంగా బాగుంటుంది అనే పేరు వచ్చేసింది. మీరు ఓకే చేసిన సినిమా బాగా రాకపోతే విచారించిన సందర్భాలేమన్నా ఉన్నాయా.?
స) అలాయెం లేదు.. ఎప్పుడూ విచారించలేదు. ఎవరిమీద రిగ్రెట్స్ లేవు. కొన్ని సార్లు అనుకున్నది అనుకున్నట్టు రావు. అవి అలా జరుగుతాయి, దానికి మనం ఏమీ చేయలేం.
ప్రశ్న) స్లో అండ్ స్టడీగా సినిమాలు చేసే నిత్యా మీనన్ ఈ సంవత్సరం సినిమాల జోరు పెంచడానికి గల కారణం ఏమిటి.?
స) జోరు అనేమీ లేదు.. గత సంవత్సరం ఒక సినిమా కూడా లేదు. నా వర్క్ మాత్రం లాస్ట్ ఇయర్ మొదలు పెట్టాను, ఆ వర్క్ ఈ ఏడాది వరుసగా వస్తున్నాయి అంతే. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, కాంచన 2 సినిమాల షూటింగ్ గత ఏడాది జరిగింది. సత్యమూర్తి, ఓకే బంగారం ఈ ఏడాది షూట్ చేసాం కానీ అన్నీ ఒకేసారి రిలీజ్ అవుతున్నాయి. అంతే కానీ ఎక్కువ సినిమాలు చేసెయ్యాలనిఏమీ కాదు.
ప్రశ్న) ఓకే బంగారంలో లివింగ్ టుగెదర్ రిలేషన్ చూపించారు. మరి బోల్డ్ కాన్సెప్ట్స్ చూపించడానికి, అలాంటి సినిమాలు చేయడానికి మీరు ఇష్టపడతారా.?
స) నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను. నేను అన్నీ చెయ్యగలగాలి, అలా చేయ్యలేదు అంటే నాకో ముద్ర పడిపోద్ది. నా పరంగా నేను అన్నీ భావాలను ఎక్స్ ప్రెస్ చేయడానికి ఇష్టపడతాను. ముఖ్యంగా లవ్ ని రకరకాలుగా మనం చెప్పచ్చు. ఎలాంటి బోల్డ్ కాన్సెప్ట్ తో వచ్చినా నేను ముందు డైరెక్టర్ దీన్నెలా చూపిస్తాడు అని ఆలోచిస్తాను. అలాగే లవ్ అండ్ రిలేషన్ షిప్స్ అనేవి నా పరంగా చాలా సీక్రెట్, నా వేవ్ లెంగ్త్ కి డైరెక్టర్ కనెక్ట్ అయితే సినిమా చేసేస్తాను.
ప్రశ్న) ప్రతి ఒక్కరు మణిరత్నంతో సినిమా చేయాలనుకుంటారు. మరి ఆయనతో పనిచేయడం ఎంతవరకూ మీ నటనను మెరుగుపరుచుకునేందుకు ఉపయోగపడింది.?
స) నా నటన మెరుగుపడేలా ఎంతోకొంత ప్రతి సినిమా నుంచి నేను నేర్చుకుంటాను. ఒక్క మణిరత్నం గారి నుంచే నేర్చుకున్నాను అని చెప్పలేను. ఎందుకంటే ఎంతో మంది కొత్త వారి నుంచి కూడా చాలా నేర్చుకుంటాను. అలాగే మణిరత్నం గారి నుంచి కూడా చాలా నేర్చుకున్నాను.
ప్రశ్న) ఈ మధ్య కాలంలో ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ అంటే పాటల్లో రావడం, రెండు సీన్స్ లో రావడం లేదా ఐటం నెంబర్స్ తప్ప పెద్దగా ప్రాముఖ్యత లేదు. దీనిపై మీ కామెంట్.?
స) అవును.. అది బాధాకరమైన విషయం కానీ ఇప్పుడదే కదా ట్రెండ్.. నేను చెప్పేది ఏమిటంటే సినిమాలలో సెన్సిబిలిటీ ఉండాలి. హౌస్ వైఫ్ పాత్రని చూపించినా రియల్ గా, సెన్సిబిలిటీస్ ఉండేలా చూపిస్తే బాగుంటుంది.
ప్రశ్న) బెంగుళూరు డేస్ రీమేక్ లో నటించడానికి గల రీజన్ ఏమిటి.?
స) నిజం చెప్పాలంటే అంజలి మీనన్ ఆ కథ రాసింది నాకోసమే.. కానీ అప్పుడు చేసే టైం లేక మెయిన్ లీడ్ అయిన నజరియా పాత్ర కాకుండా వేరే రోల్ చేసాను. ఇప్పుడు అదే అవకాశం తమిళ్ లో వచ్చింది. అది నా కథ కదా అందుకే చేస్తున్నాను.
ప్రశ్న) ఓకే బంగారం చూసిన ప్రతి ఒక్కరూదల్కేర్ సల్మాన్ – నిత్యా కెమిస్ట్రీ గురించే మాట్లాడుకుంటున్నారు. దాని గురించి చెప్పండి.?
స) ఒకేసారి నేను దల్కేర్ సల్మాన్ కలిసి చేసాం. మలయాళంలో 100 డేస్ ఆఫ్ లవ్ అండ్ ఓకే బంగారం ఒకేసారి చేస్తాను. అందులో మా ఇద్దరి మధ్యా మంచి రాపో ఉంది. ఓకే బంగారం ఇంటెన్స్ ఫిల్మ్, అలాంటప్పుడు నేను దల్కేర్ కంఫర్టబుల్ గా ఉండాలి. మేము అలా ఉండగాలిగాం కాబట్టే ఆన్ స్క్రీన్ అంత బాగా వచ్చింది. యాక్టింగ్ బాగా చేస్తే కెమిస్ట్రీ ఆటోమాటిక్ గా వస్తుందని నమ్ముతాను.
ప్రశ్న) సమంత మిమ్మల్ని వన్ అఫ్ ది బెస్ట్ హీరోయిన్ అంటుంది. దానిపై మీ కామెంట్.?
స) నా కెరీర్ మొదటి నుంచే సమంత నన్ను పొగుడుతూ ఉంటుంది. నా యాక్టింగ్, నా వర్క్ అంటే తనకి ఎంతో ఇష్టం. ఇప్పుడు కూడా ఓకే బంగారం చూసి అన్ బిలీవబుల్ అని మెసేజ్ చేసింది. సత్యమూర్తి టైంలో ఇద్దరం కలిసి పనిచేశాం.. ఒకరి గురించి ఒకరం బాగా తెలుసుకున్నాం. యాక్టర్స్ గా ప్రొఫెషనల్ గా ఇద్దరికీ డిఫరెంట్ గా ఉంటుంది, కానీ బయట ఒకరి గురించి ఒకరు తెలుసుకున్న మంచి ఫ్రెండ్స్ మేమిద్దరం.
ప్రశ్న) బాలీవుడ్ సినిమాల మీద ఏమన్నా ఆసక్తి చూపుతున్నారా.?
స) నో నాకు అస్సలు బాలీవుడ్ సినిమా చెయ్యాలని ఆసక్తి లేదు, నేను ట్రై కూడా చేయలేదు. ఒకవేళ నాదారిలో ఏదన్నా మంచి స్క్రిప్ట్ వస్తే నాకు నచ్చితే చేస్తాను.
అంతటితో నిత్యా మీనన్ ఇంటర్వ్యూ ముగిసింది.
CLICK HERE FOR ENGLISH INTERVIEW