చిట్ చాట్ : మంచు లక్ష్మీ – ‘బుడుగు’తో మళ్ళీ కొత్తగా పరిచమయ్యా!

చిట్ చాట్ : మంచు లక్ష్మీ – ‘బుడుగు’తో మళ్ళీ కొత్తగా పరిచమయ్యా!

Published on Apr 24, 2015 12:44 PM IST

MAnchu-lakshmi
మోహన్ బాబు కుమార్తెగా సినీ రంగ ప్రవేశం చేసి నటిగా, నిర్మాతగా తానేంటో నిరూపించుకున్నారు మంచు లక్ష్మీ. ఇక ఈ మధ్యే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు వైఎస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికవడం, దొంగాట సినిమాలో ఓ ప్రమోషనల్ పాట పాడడం ద్వారా మల్టీ టాలెంటెడ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘బుడుగు’ సినిమా గత శుక్రవారం విడుదలై నేటితో విజయవంతంగా రెండో వారంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా బుడుగు సినిమా విజయం సాధించడం పట్ల మంచు లక్ష్మీ చెప్పిన ముచ్చట్లు..

ప్రశ్న) ‘బుడుగు’ సినిమాకు ఎలాంటి స్పందన వచ్చింది?

స) ‘బుడుగు’ సినిమా విడుదలైన రోజునుంచే మంచి టాక్‌తో నడుస్తోంది. సినిమా విడుదలై వారమైనా కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి. రెండో వారం థియేటర్ల సంఖ్య కూడా పెరిగింది. ముఖ్యంగా సినిమాకు అన్ని వర్గాల నుండి మంచి స్పందన వస్తోంది. ఇలాంటి ప్రయత్నాలు తెలుగులో చాలా అరుదుగా వస్తుంటాయి. చిన్న సినిమా అయినా అందరూ సపోర్ట్ చేసి మంచి విజయాన్ని తెచ్చిపెట్టారు.

ప్రశ్న) ఈ సినిమాలో మీ పాత్రకు ఎలాంటి స్పందన వచ్చింది?

స) ఓహ్. ఈ సినిమాలో నా పాత్రకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సినిమా చూసిన వారంతా లక్ష్మీ కొత్తగా కనిపించిందని అభినందిస్తూ ఉన్నారు. ఫోన్స్, మెయిల్స్, ట్విట్టర్ అన్నింటా అభినందనలు వచ్చి పడుతున్నాయి. ఇంతకుముందు ఇలాంటి పాత్రలు చేయకపోవడం వల్ల చాలెంజింగ్‌గా ఈ సినిమా చేశా. దానికి ఈ రెస్పాన్స్ రావడం సంతోషంగా ఉంది. ఈ సినిమాతో నేను ప్రేక్షకులకు సరికొత్తగా పరిచయమయ్యా!

ప్రశ్న) ‘ఏ’ సర్టిఫికెట్ రావడంతో ఫ్యామిలీ ప్రేక్షకులు దూరమయ్యారేమో?

స) అది నిజమే. అయితే ఈ సినిమా అందరూ అనుకునేట్టు హర్రర్ సినిమా కాదు. ప్రతీ ఒక్కరూ తప్పక చూడాల్సిన ఎమోషనల్ కంటెంట్ ఉన్న సినిమా ‘బుడుగు’. సెన్సార్ వారితో మరోసారి పోరాడి ఉంటే ‘యూ/ఏ’ సర్టిఫికెట్ వచ్చేదేమో!

ప్రశ్న) దర్శక, నిర్మాతల గురించి చెప్పండి?

స) ఇలాంటి సినిమాలు చేయాలంటే నిర్మాతలకు గట్స్ ఉండాలి. నిర్మాతలు భాస్కర్, సారిక శ్రీనివాస్‌లు ఒక మంచి ప్రయత్నాన్ని మన ముందుకు తెచ్చారు. ఓవర్‌నైట్ డబ్బులు సంపాదించాలనుకుంటే ఇలాంటి సినిమాలు ఎవ్వరూ చేయలేరు. ఇక దర్శకుడు మన్మోహన్ గురించి చెప్పాలంటే.. చాలా గొప్ప కమిట్‌మెంట్ ఉన్న దర్శకుడాయన. ఆయనకు ఏది కావాలో అది పర్ఫెక్ట్‌గా సాధించి పెట్టుకుంటారు. ప్రీ ప్రొడక్షన్ నుంచే ఓ సినిమాను ఇంత ప్లాన్ చేసి తీసిన దర్శకుడిని నేను ఇప్పటివరకూ చూడలేదు.

ప్రశ్న) ‘దొంగాట’ సినిమా గురించి చెప్పండి?

స) ఈ నెలాఖర్లో నేను నటించి, నిర్మించిన ‘దొంగాట’ సినిమా విడుదల కానుంది. ఒకేసారి నా రెండు సినిమాలు రావడం కొత్తగా ఉంది. ఆ సినిమా కోసం నేను పాడిన పాటకు సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది.

ప్రశ్న) చివరగా ప్రేక్షకులకు ‘బుడుగు’ గురించి ఏం చెప్పదల్చుకున్నారు?

స) ముందుగా సినిమాకు ఇంత విజయాన్ని సాధించి పెట్టిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఇప్పటికీ సినిమా చూడకుంటే వెంటనే వెళ్ళి చూడండి. మంచి సినిమాలను ఆదరిస్తేనే మరిన్ని మంచి సినిమాలు వస్తాయి.

CLICK HERE FOR ENGLISH INTERVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు