తమిళ్ ఫిలిం ఇండస్ట్రీ కి జయలలిత బొనాంజా

తమిళ్ ఫిలిం ఇండస్ట్రీ కి జయలలిత బొనాంజా

Published on Oct 24, 2011 5:07 AM IST

తమిళ్ చిత్ర పరిశ్రమకు దీపావళి కానుక అందించారు ముఖ్యమంత్రి జయలలిత. తమిళనాడు లోని అన్ని థియేటర్ల యజమానులకు, రోజుకి ఐదు షోలు ప్రదర్శించే అవకాశం కల్పించారు. దీపావళి మొదటి వారమంతటికీ ఈ వెసులుబాటు అమలులో ఉంటుంది. ఈ విషయాన్ని చెన్నై సిటీ ఫిలిం యగ్జిబిటర్స్ అసోసియేషన్ ధృవీకరించింది. దీనిని సీఎం దీపావళి గిఫ్ట్ గా అభివర్ణించారు సంఘం అధ్యక్షుడు అబిరామి రామంతాన్. ఇది అన్ని థియేటర్ల యజమానులును సంతోషపరిచే వార్త గా ఆయన పేర్కొన్నారు.

కాగా, ఈ పండుగకు మూడు భారీ సినిమాలు విడుదల కానున్నాయి. అవి, సూర్య – 7 ఆం అరివు , విజయ్ – వేలాయుధం మరియు షా రుక్ ఖాన్ రా. వన్. రోజుకు ఐదు షో లు ప్రదర్శించుకునే అవకాశం అక్టోబర్ 26 నుండి నవంబర్ 1 వరకూ వుంటుంది.

తాము ప్రతి ఏడాది దీపావళి వారాంతంలో ఐదు షోల అనుమతికి అభ్యర్థి స్థామన్నారు అబిరాం. కానీ ఈ సంవత్సరం, అక్టోబర్ 26 నుండి నవంబర్ 1 వరకు ఐదు షో లు ప్రదర్శించుకునే అనుమతి మంజూరు చేశారని చెప్పారు. పండుగ సమయంలో ఇలాంటి అవకాశం లభించటం వల్ల అజిత్ – మంకత, సల్మాన్ ఖాన్ – బాడీగార్డ్ చిత్రాలకు భారీ వసూళ్లు నమోదయ్యయిన విషయాన్ని ఆయన గుర్తుచేసారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు