సమీక్ష : లయన్ – ఫ్యాన్స్ కి నచ్చే మాస్ మసాలా.!

సమీక్ష : లయన్ – ఫ్యాన్స్ కి నచ్చే మాస్ మసాలా.!

Published on May 15, 2015 5:55 PM IST
Lion

విడుదల తేదీ : 14 మే 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

దర్శకత్వం : సత్య దేవ

నిర్మాత : రుద్రపాటి రమణారావు

సంగీతం : మణిశర్మ

నటీనటులు : బాలకృష్ణ, త్రిష, రాధిక ఆప్టే..


‘లెజెండ్’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘లయన్’. మరోసారి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో అందాల భామలు త్రిష, రాధిక ఆప్టేలు హీరోయిన్స్ గా నటించారు. నూతన దర్శకుడు సత్య దేవ దర్శకత్వం వహించిన ఈ మూవీకి రుద్రపాటి రమణారావు నిర్మాత. లెజెండ్ తర్వాత వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఆ అంచనాలను అందుకునేలా ఈ లయన్ ఉందా లేదా.? లెజెండ్ తర్వాత బాలయ్య మరో హిట్ అందుకున్నాడా.? లేదా.? అన్నది ఇప్పుడు చూద్దాం..

కథ :

లయన్ సినిమా కథ ముంబైలోని రామ్ మనోహర్ హాస్పిటల్స్ లో మొదలవుతుంది. చనిపోయాడు అనుకున్న గాడ్సే(బాలకృష్ణ) బతుకుతాడు. స్పృహలోకి వచ్చాక, తమ కొడుకు గాడ్సే అంటూ దగ్గరికి వచ్చిన జయసుధ – చంద్ర మోహన్ లకు తను గాడ్సే కాదని బోస్ అని చెప్తాడు. కానీ తనే గాడ్సే అనేలాగా అన్ని డీటైల్స్ చూపిస్తారు. అసలు తను గాడ్సేనా, బోసునా అని తెలుసుకోవడానికి హైదరాబాద్ బయలుదేరుతాడు. హైదరాబాద్ వచ్చిన గాడ్సే తను పెరిగిన ఇంటికి, తన తల్లి తండ్రులని కలుస్తాడు. కానీ వాళ్ళందరూ తనెవరో తెలియదని అంటారు.

దాంతో బాగా కన్ఫ్యూజ్ అయిన బోస్ కి ఏం చేయాలో తెలియదు. అదే టైంలో ఓ సంఘటన ద్వారా బోస్ గతం గురించి తెలుస్తుంది. గతంలో బోస్ ఒక సిన్సియర్ సిబిఐ ఆఫీసర్. రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన అచ్యుతరామయ్య(విజయ్ కుమార్) గుండెపోటుతో చనిపోతాడు. కానీ ఆ మరణం వెనుక ఏదో తెలియని మిస్టరీ ఉందని, ఆ మిస్టరీని చేధించమని ఆ కేసుని బోస్ కి అప్పగిస్తారు. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడే బోస్ సడన్ గా మిస్ అయిపోతాడు. ఆ మిస్ అయిపోయిన బోసేనా మళ్ళీ బతిక్కి వచ్చింది.? హైదరాబాద్ లో కనపడకుండా పోయిన బోస్ ముంబైకి ఎలా చేరాడు.? చనిపోయి బతికింది బోస్ అనుకుంటే మరి గాడ్సే ఎవరు.? గాడ్సే కథ ఏంటి.? బోస్ తల్లి తండ్రులు తను బోస్ కాదని ఎందుకు చెప్పారు.? అలాగే అచ్యుతరామయ్య మరణం వెనుక ఉన్న మిస్టరీ ఏమిటి.? అనే ఆసక్తికర విషయాలను మీరు వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే..

ప్లస్ పాయింట్స్ :

‘లయన్’ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ లో ముందుగా చెప్పాల్సింది.. సినిమా స్టార్టింగ్.. సినిమా మొదలవ్వడమే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మొదటి 5 నిమిషాల్లోనే మిమ్మల్ని కథలో ఇన్వాల్వ్ చేస్తాడు. మొదటి 20 నిమిషాలు సినిమా చాలా వేగంగా సాగుతూ ఆడియన్స్ లో ఆసక్తిని పెంచుతుంది. అలాగే ఇంటర్వల్ బ్లాక్ లో వచ్చే ఫైట్ మరియు ట్విస్ట్ ఆడియన్స్ ని తారా స్థాయికి తీసుకెళుతుంది. సెకండాఫ్ లో సిబిఐ ఆఫీసర్ బోస్ పాత్రని పరిచయం చేసిన సీన్ మరియు అక్కడ వచ్చే యాక్షన్ ఎపిసోడ్ మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయి.

ఈ సినిమాలో చాలా మంది నటీనటులే ఉన్నారు ముందుగా.. నట సింహం బాలకృష్ణ గురించి చెబుతా.. ఇలాంటి కథకి బాలకృష్ణ పెర్ఫార్మన్స్ చాలా పెద్ద హెల్ప్ అయ్యింది. ముఖ్యంగా గాడ్సే పాత్రలో బాలకృష్ణ చూపిన ఇంటెన్సిటీ, రౌద్రం మాస్ ఆడియన్స్ కి తెగ నచ్చేస్తుంది. గాడ్సే పాత్రలో షూట్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ ఆడియన్స్ రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తాయి. ఇక పవర్ఫుల్ సిబిఐ ఆఫీసర్ బోస్ లా కూడా మెప్పించాడు. ఓవరాల్ గా డాన్సులతో, ఫైట్స్ తో, పవర్ఫుల్ డైలాగ్స్ తో బాలకృష్ణ అభిమానులను మెప్పించాడు. అందాల భామ త్రిష ఉన్నంతలో బాగా చేసింది. పాటల్లో బాగా గ్లామరస్ గా కనిపించింది. లెజెండ్ లోలానే రాధిక ఆప్టే కూడా తన పెర్ఫార్మన్స్ తో, గ్లామర్ తో ఆకట్టుకుంది. బాలయ్యకి టఫ్ పోటీని ఇచ్చే విలన్ పాత్రల్లో నటించిన ప్రకాష్ రాజ్ బాగానే చేసాడు. జయసుధ, చంద్ర మోహన్, గీతలు సెంటిమెంట్ పరంగా మంచి నటనని కనబరిచారు. చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన అర్చన, శివ బాలాజీ, ఆదిత్య మీనన్, చలపతి రావు తదితరులు తమ పరిధిమేర నటించి వెళ్ళిపోయారు.

కీలక పాత్రలో ఇంద్రజ మెప్పించింది. ఇక పోసాని కృష్ణమురళి పోలీస్ ఆఫీసర్ గా అలా కనిపించి నవ్వించి వెళ్ళిపోతాడు. ఇకపోతే సెకండాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాకి ప్లస్ అయ్యింది. ఒక ఇంటెలిజెంట్ సిబిఐ ఆఫీసర్ గా చివర్లో విలన్ కి హీరో కౌంటర్ అటాక్ ఇచ్చే ప్రీ క్లైమాక్స్ సీన్స్ బాగున్నాయి. క్లైమాక్స్ బాలకృష్ణ అభిమానులకు నచ్చేలా ఓ మంచి యాక్షన్ ఎపిసోడ్ తో ముగించడం బాగుంది.

మైనస్ పాయింట్స్ :

లయన్ సినిమాలో మొదటి 20 నిమిషాలు ఎంత వేగంగా, ఆసక్తికరంగా సాగుతుందో.. ఆ తర్వాత నుంచి అంతే స్లోగా సాగుతుంది. ఇంటర్వల్ వరకూ కథలో ముందుకు వెళ్ళకుండా క్రియేట్ చేసిన సబ్ ట్రాక్స్ అంత ఆసక్తికరంగా లేవు. దానికి తోడు ఫస్ట్ హాఫ్ లో బాలకృష్ణ – త్రిషల మధ్య వచ్చే రొమాంటిక్ ట్రాక్ చాలా పాతకాలం కామెడీలా అనిపిస్తుంది. ఈ ట్రాక్ ఆడియన్స్ ని మెప్పించకపోవడమే కాకుండా, ఆడియన్స్ బోర్ ఫీలయ్యేలా చేస్తుంది. ఇంటర్వల్ బ్లాక్ తర్వాత ఆడియన్స్ కి కథ మీద దాదాపు క్లారిటీ వచ్చేస్తుంది, ఎప్పుడైతే సెకండాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ లో ట్విస్ట్ రివీల్ చేస్తాడో అక్కడి నుంచి కథ మరీ ఊహాజనితంగా మారుతుంది.

బాలయ్యని ఇది వరకూ ఎన్నడూ చూడని కొత్త పాత్రల్లో చూస్తున్నాం అనే తప్ప, కథా పరంగా చెప్పుకోవడానికి కొత్తదనం అంటూ ఏమీ లేదు. ఇదొక స్క్రీన్ ప్లే బేస్ మూవీ, కానీ స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ లో ఆద్యంతం ఆసక్తికరంగా నడిపించలేకపోయాడు. నేరేషన్ లో ఒక ఫ్లో లేదు. కాసేపు స్పీడ్ గా కాసేపు స్లోగా, కాసేపు బోరింగ్ గా మళ్ళీ స్పీడ్ గా అన్న రీతిలో సినిమా వెళుతుంటుంది. కమర్షియాలిటీ కోసం పలు చోట్ల కామెడీ ఇరికించాలని ట్రై చేసాడు. ఆ ఇరికించిన కామెడీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అలీ, ఎంఎస్ నారాయణలు పెద్దగా నవ్వించలేకపోయారు. ఇకపోతే పవర్ఫుల్ సిబిఐ ఆఫీసర్ గా బాలకృష్ణ పాత్ర రాసుకున్నప్పుడు తాని చేసిన నాలుగైదు ఇన్వెస్టిగేషన్ కేసులని డీల్ చేయడం చూపించి ఉంటే ఆ పాత్ర ఇంకా ఎలివేట్ అవ్వలేదు. దానివల్ల ఆడియన్స్ లో ఈ పాత్రని ఇంకాస్త పవర్ఫుల్ గా చూపించి ఉంటే బాగుండేదే అనే ఫీలింగ్ వస్తుంది.

సాంకేతిక విభాగం :

‘లయన్’ సినిమాని ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది అంటే దానికి కారణమైన మొదటి వ్యక్తి, ఈ సినిమాకి కెప్టెన్ సత్య దేవ. ఈయనకిది మొదటి సినిమా.. కథ పరంగా కొత్తదనం ఏమీ లేదు, పాత పాయింట్ ని సెలెక్ట్ చేసుకున్నా ఎంచుకున్న నేపధ్యం, పాత్రలతో రాసుకున్న ట్విస్ట్ లు బాగానే అనిపిస్తాయి. అందుకే దీనిని స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ అనాలి. కానీ స్క్రీన్ ప్లే విషయంలో అనుకున్న మేజిక్ ని క్రియేట్ చేయలేకపోయాడు. ఒకటి, రెండు ట్విస్ట్ లని బాగానే రివీల్ చేసాడు.. కానీ ట్విస్ట్ లకి ముందు వెనుక ఉండాల్సిన లీడ్ సీన్స్ ని బోర్ కొట్టించేలా రాసుకుని ఆడియన్స్ కి బోర్ కొట్టించేసాడు . ఇక దర్శకుడిగా 50-50 అనిపించుకున్నాడు. ఎందుకు అంటే ఏ విషయాన్ని ఆయన పూర్తిగా క్యారీ చేయలేకపోయాడు. నందమూరి అభిమానులను ఓ మేరకు మెప్పించగలిగినా ఓవరాల్ గా అందరినీ మెప్పించలేకపోయాడు.

మణిశర్మ అందించిన పాటలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.. విజువల్స్ పరంగా ఓకే.. ఇకపోతే రీ రికార్డింగ్ స్పెషలిస్ట్ అయిన మణిశర్మ ఇచ్చిన నేపధ్య సంగీతం బాగుంది. ముఖ్యంగా హీరో ఎలివేషన్ సీన్స్ కి మ్యూజిక్ అదిరింది. వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ చాలా డీసెంట్ గా ఉంది. గౌతమ్ రాజు ఎడిటింగ్ జస్ట్ ఓకే. చాలా చోట్ల ఆయన సీన్స్ లెంగ్త్ తగ్గించి ఉంటే సినిమా ఇంకాస్త వేగంగా, ఆసక్తిగా ఉండేది. రవీందర్ ఆర్ట్ వర్క్ బాగుంది. ఇక ఈ సినిమాకి మేజర్ హైలైట్స్ లో చెప్పుకునేలా రామ్ – లక్ష్మన్ మాస్టర్స్ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్ బాగున్నాయి. ఆ ఎపిసోడ్స్ ని మాస్ ఆడియన్స్ విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒక నూతన దర్శకుడిని నమ్మి ఇంత బడ్జెట్ పెట్టి సినిమా తీసిన రుద్రపాటి రమణారావుని మెచ్చుకొని తీరాలి. ఆయన ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా పెట్టిన ప్రతి రూపాయి మనకు ఆన్ స్క్రీన్ కనిపిస్తుంది.

తీర్పు :

నందమూరి బాలకృష్ణ తన అభిమానులు ఏమేమి కోరుకుంటారో అలాంటి అంశాలన్నిటినీ మిక్స్ చేసి తీసిన సమ్మర్ మాస్ మసాలా ఎంటర్టైనర్ ‘లయన్’. బాలయ్య నుంచి భారీ డైలాగ్స్, సూపర్బ్ యాక్షన్ ఎపిసోడ్స్, మాస్ సాంగ్స్ ఆశించే నందమూరి అభిమానులకు, కేవలం మాస్ అని కలవరించే ఆడియన్స్ ని ఈ సినిమా నచ్చుతుంది. రెండు పాత్రల్లో బాలకృష్ణ చూపించిన వైవిధ్యం, యాక్షన్ ఎపిసోడ్స్, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, ఇంటర్వల్ మరియు క్లైమాక్స్ ఎపిసోడ్స్ లయన్ సినిమాకి హైలైట్ గా నిలిచాయి. పాతకాలం నాటి సింపుల్ కథ, అనుకున్న మేజిక్ ని స్క్రీన్ ప్లే లో చూపలేకపోవడం, నో కామెడీ, ఆకట్టుకోని రొమాంటిక్ ట్రాక్స్ చెప్పదగిన మైనస్ పాయింట్స్. ఓవరాల్ గా బాలకృష్ణ చేసిన ఈ లయన్ సినిమా అభిమానులను, బి, సి సెంటర్ ఆడియన్స్ ని మెప్పించే సినిమా.

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు