మాధుర్ బండార్కర్ డ్రీం ప్రాజెక్ట్ ‘హీరోయిన్’ . ఈ సినిమాలో బాలీవుడ్ తారామణుల జీవిత ఇతివృత్తాంతాలను తెరకెక్కించబోతున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాలనుకుంటున్న ఈ మూవీ నవంబర్ 25 నుంచి షూటింగ్ జరుపుకోనుంది. ఐశ్వర్యరాయ్ బచ్చన్ స్థానం లో కనీనా కపూర్ ఈ చిత్రం లో ప్రధాన పాత్ర పోషించనుంది. అసలు ఈ చిత్రం లో నటించేందుకు మొదట ఐశ్వర్య అంగీకారం తెలిపారు. అయితే గర్భం ధరించినందున ఆమె ఈ ప్రాజెక్ట్ వదులుకోవలసి వచ్చింది. ఈ నిర్ణయానికి కొన్ని రోజుల ముందు ఐష్ ఫోటో షూట్ లో కూడా పాల్గొన్నారు.
ఇదిలాఉంటే, ‘హీరోయిన్’ చిత్రం చాలా హాట్ హాట్ గా ఉండబోతుంది. ఈ మూవీ లో కొన్ని సంచలనాత్మక, వివాదాస్పద దృశ్యాలు చిత్రీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా హీరోయిన్ డ్రింకింగ్, స్మోమ్కింగ్ సీన్స్ ఉంటాయి. ఈ చిత్రం లో నటించేందుకు కరీనా అబ్బుర పరిచే మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం. ఇటీవలకాలం లో కరీనా బాక్స్ ఆఫీసు వద్ద వరుస విజయవంతమైన చిత్రాలతో తారాపధాన దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.
మాధుర్ భండార్కర్ యొక్క ‘హీరోయిన్’ చిత్రాన్ని యుటివి నిర్మిస్తోంది.