విడుదల తేదీ : 31 జూలై 2015
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
దర్శకత్వం : కార్తీక్ జి క్రిష్
నిర్మాత : మారుతి
సంగీతం : నటరాజన్ శంకరన్
నటీనటులు : వైభవ్, సోనమ్ బజ్వా..
ఒకప్పటి స్టార్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి తనయుడు వైభవ్ హీరోగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. వైభవ్ ఒక్క తెలుగులోనే కకుండా తమిళంలో కూడా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ టాప్ డైరెక్టర్ శనక్ర్ నిర్మాతగా వైభవ్ హీరోగా చేసిన సినిమా ‘కప్పల్’. గయా ఏడాది క్రిస్మస్ కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా అక్కడ మంచి హిట్ అయ్యింది. దాంతో ఈ సినిమాని తెలుగులో ‘పాండవుల్లో ఒకడు’ అనే టైటిల్ తో తెలుగులో డబ్ చేసి నేడు రిలీజ్ చేసారు. కార్తీక్ జి క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉంది.? పాండవుల్లో ఒక్కడు కథేంటి.? అనేది ఇప్పుడు చూద్దాం..
కథ :
ఆంధ్రప్రదేశ్ – తమిళనాడు బార్డర్ అయిన తడలో ఈ కథ మొదలవుతుంది. చిన్నప్పటి నుంచి వాసు(వైభవ్), కనకరాజు(కరుణాకరన్), కార్తీక్ సుబ్బరాజు(అర్జునన్), పట్టాభి(వెంకట్ సుందర్), వెంకటేశ్వర్లు(కార్తీక్)లు మంచి ఫ్రెండ్స్. వీరికి చీన్నతనమ్లొనె పెద్దయ్యాక ప్రేమలో పడ్డా లేదా పెళ్లి చేసుకున్నా ఫ్రెండ్స్ అంతా కలిసి ఉండలేం అనే ఉద్దేశంతో అసలు పెళ్ళే చేసుకోకూడదు అనే నిర్ణయానికి వచ్చి ఒకరికొకరు మాట ఇచ్చుకుంటారు. ఈ ఒప్పందం వాసుకి ఇష్టం లేకపోయినా ఫ్రెండ్స్ బలవంతం మీద ఓకే అంటాడు. కాలేజ్ కి వచ్చాక అన్నా మారుతారేమో అనుకుంటాడు కానీ అక్కడా మారరు. కానీ వాసుకి ఏమో ఓ అమ్మాయిని ప్రేమించాలి, పెళ్లి చేసుకోవాలని ఉంటుంది. వాసు ఎంత ట్రై చేసిన ఆ నలుగురు ఫ్రెండ్స్ చెడగొడుతూ ఉంటారు. వారి నుంచి తప్పించుకోవాలని ఉద్యోగం పేరు చెప్పి చెన్నై చెక్కేస్తాడు వాసు.
అక్కడ తన ఊరికి చెందిన నెల్సన్(విటివి గణేష్)తో ఉంటూ ఆయన ఇచ్చిన సలహాలను ఫాలో అయ్యి అమ్మాయిలను వెతకడం మొదలు పెడతాడు. ఆ సమయంలో వాసు రిచ్ కిడ్ అయిన దీపిక(సోనమ్ బజ్వా)ని చూసి ప్రేమలో పడతాడు. కొద్ది రోజులకి తనూ ప్రేమిస్తుంది, దాంతో ఇద్దరూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటారు. అప్పుడే వాసు ఫ్రెండ్స్ చెన్నైకి వస్తారు. అక్కడ వాసు ప్రేమ వ్యవహారం తెలుసుకొని ఆ ప్రేమని చెడగొట్టాలని ప్రయత్నాలు మొదలెడతారు. అక్కడి నుంచి వాసు ఎదుర్కునే కష్టాలు ఏమిటి.? చివరికి ఆ నలుగురు ఫ్రెండ్స్ వాసు-దీపికలని విడగొట్టారా.? లేక వల్లే మారిపోయారా అనే విషయాలను మీరు వెండితెరపై చూడాలి..
ప్లస్ పాయింట్స్ :
‘పాండవులలో ఒకడు’ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ ఏమిటి అంటే.. డైరెక్టర్ కార్తీక్ ఎక్కువగా సందర్భానుసారంగా వచ్చే కామెడీని రాసుకోవడం. రాసుకోవడమే కాకుండా ఆన్ స్క్రీన్ చాలా బాగా వచ్చేలా తీయడం. సినిమాలో కామెడీ అంతా సందర్భానుసరంగానే ఉంటుంది. సన్నివేశాలు కామెడీగా ఉంటాయి, ఆ సన్నివేశాలలో నటీనటుల పెర్ఫార్మన్స్ ఆ సీన్స్ ని మరో స్టేజ్ కి తీసుకెళ్ళి మిమ్మల్ని నవ్విస్తాయి. సినిమా మొదట్లో పాటలని పరిచయం చేసే విధానం చాలా ఫన్నీగా ఉంటుంది.
నటీనటుల పరంగా వస్తే వైభవ్ పెర్ఫార్మన్స్ చాలా నవ్వు తెప్పిస్తుంది. ఈ కథ ప్రకారం హీరో పాత్ర చాలా ఫన్నీగా ఉండాలి, దానికి వైభవ్ పూర్తి న్యాయం చేసాడు. కామెడీ హావ భావాలను బాగా పలికించాడు. హీరోయిన్ సోనమ్ బజ్వా రిచ్ కిడ్ పాత్రలో బాగా చేసింది. సోనమ్ బజ్వా చోడటానికి బాగుంది, అలాగే సినిమా మొత్తం పొట్టి పొట్టి బట్టల్లో కనిపించి అందాల ఆరబోతతో కూడా అందరినీ ఆకట్టుకుంది. విటివి గణేష్ కనిపించే ప్రతి సీన్ లోనూ నవ్విస్తాడు. ఇక వైభవ్ ఫ్రెండ్స్ గా కనిపించిన కరుణాకరన్, అర్జునన్, వెంకట్ సుందర్, కార్తీక్ లు తమ పాత్రల్లో మంచి నటనని కనబరిచారు.
సినిమా పరంగా చూసుకుంటే మొదటి 15 నిమిషాలు చాలా సరదాగా ఉంటుంది. ఆ తర్వాత వైభవ్ – విటివి గణేష్ కాంబినేషన్ లో వచ్చే సీన్స్ చాలా బాగా నవ్వు తెప్పిస్తాయి. సెకండాఫ్ లో వైభవ్ ని ఫ్రెండ్స్ ఇబ్బంది పెట్టే సీన్స్ చాలా బాగుంటాయి. ఇక ఫైనల్ గా క్లైమాక్స్ లో వచ్చే కామెడీ ట్రాక్ అందరినీ బాగా నవ్విస్తుంది. అలాగే సినిమాలో ఫ్రెండ్షిప్ మీద వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ యువతని ఆకట్టుకుంటాయి. ఇకపోతే సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ శంకర్, మారుతిల మార్క్ ఈ సినిమాకి ఉండడం కూడా ఓ ప్లస్ పాయింట్.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమాకి చెప్పుకోదగిన మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. మొదటగా చెప్పుకోవాల్సింది ఈ చిత్ర రన్ టైం. 151 నిమిషాల రం టైంని కాస్త కుదించి 135 నిమిషాలకి కుదించి ఉంటే సినిమా ఇంకాస్త బాగుండేది. డైరెక్టర్ కార్తీక్ కొన్ని సీన్స్ ని కామెడీ పరంగా బాగా తీసాడు కానీ మధ్య మధ్యలో బోర్ కొట్టే సీన్స్ ని కూడా రాసుకున్నాడు. చెప్పాలంటే ఫుల్ కామెడీ, ఒక 5 నిమిషాలు స్లో, మళ్ళీ ఓ కామెడీ ఎపిసోడ్ మళ్ళీ కాస్త బోర్ అనేలా సినిమా ఉంటుంది. అలాగే సినిమాలో కొన్ని సాంగ్స్ అవసరం లేదు. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే డ్యూయెట్ సాంగ్ అవసరం లేదు. ఆ సాంగ్ సెకండాఫ్ ని స్లో చేస్తుంది. కథా పరంగా చూసుకుంటే ఇటీవల తమిళం నుంచి తెలుగులోకి వచ్చిన ‘చిరునవ్వులతో చిరుజల్లు’ సినిమాలనే ఉంటుంది.
ఇకపోతే డైరెక్టర్ కార్తీక్ మొదటి నుంచీ 5 గురిలో నలుగురు పెళ్ళికి పూర్తి వ్యతిరేఖం అని చూపిస్తారు. కానీ క్లైమాక్స్ లో ఆ నలుగురు తమ ప్రినిపల్స్ ని మార్చుకొని వాసు-దీపికలను కలపాలి అనుకోవడం అనే పాయింట్ ని చాలా సింపుల్ గా చెప్పేసాడు. అంత సింపుల్ గా వారితో ఆడియన్స్ కనెక్ట్ అవ్వరు. క్లైమాక్స్ లో చాలా కామెడీ బిట్స్ పేలాయి, అవి సినిమాకి బాగా హెల్ప్ అయ్యాయి కానీ క్లైమాక్స్ ఎపిసోడ్ లెంగ్త్ ఎక్కువైపోయింది. అంటే ఫుల్ కామెడీతో ఒక 5-8నిమిషాల్లో ముగించాల్సిన క్లైమాక్స్ ఎపిసోడ్ ని 15 నిముషాలు తీయడం. ఇకపోతే డైరెక్టర్ కామెడీ మీద దృష్టి పెట్టి లాజిక్స్ ని గాలికి వదిలేసాడు.
సాంకేతిక విభాగం :
తమిళంలో ఇది చాలా లో బడ్జెట్ లో తెరకెక్కిన సినిమా. అక్కడి టెక్నీషియన్స్ అంతా ఈ సినిమాకి బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చారు. చిన్న సినిమా అయినా దినేష్ కృష్ణన్ సినిమాటోగ్రఫీ బాగుంది. తెలుగులోకి డబ్ చేసిన నటరాజన్ శంకరన్ పాటలు బాలేవు. నేపధ్య సంగీతం మాత్రం చాలా బాగా ఇచ్చాడు. కామెడీ సీన్స్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. అంథోని ఎడిటింగ్ ఇంకాస్త బెటర్ గా ఉండాల్సింది. ఆరుసామి ఆర్ట్ వర్క్ బాగుంది. ఇక తెలుగులోకి డబ్ చేసిన మారుతి నిర్మాణ విలువలు బాగున్నాయి. డబ్బింగ్ అందరికీ సెట్ అయ్యింది. అలాగే శేషు అనువదించిన డైలాగ్స్ కూడా బాగున్నాయి.
తీర్పు :
తమిళం నుంచి తెలుగులోకి అనువదించబడిన మరో డీసెంట్ కామెడీ ఎంటర్టైనర్ ‘పాండవుల్లో ఒకడు’. సినిమా మొదటి నుంచి చివరిదాగా సరదా సరదాగా, అక్కడక్కడా మంచి కామెడీ బిట్స్ తో సాగిపోతుంది. డైరెక్టర్ కార్తీక్ ఈ సినిమాలో ఎక్కువ భాగం సందర్భానుసారంగా వచ్చే కామెడీని రాసుకోవండం మేజర్ ప్లస్ పాయింట్ అయితే దానికి వైభవ్ తో పాటు ఇతర నటీనటుల పెర్ఫార్మన్స్ పర్ఫెక్ట్ గా దొరకడం, సోనమ్ బజ్వా గ్లామర్ ట్రీట్ చెప్పదగిన ప్లస్ పాయింట్స్. సినిమా లెంగ్త్ ఎక్కువ అవ్వడం, అనవసరపు సాంగ్స్, అక్కడక్కడా బోర్ కొట్టే కొన్ని సీన్స్ చెప్పదగిన మైనస్ పాయింట్స్. కొన్ని కొన్ని బోరింగ్ ఎలిమెంట్స్ ఉన్నా ఓవరాల్ గా కాసేపు బాగా నవ్వుకొని ఓ డీసెంట్ కామెడీ ఎంటర్టైనర్ చూసాం అనే ఫీలింగ్ ని ఇచ్చే సినిమా ‘పాండవుల్లో ఒకడు’.
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
123తెలుగు టీం