రాష్ట్రం లోని పలు జిల్లాల్లో కొత్త వైరస్ హడలెత్తిస్తోంది. దీనిపేరు హంత వైరస్. ఈ మహమ్మారి భారిన పడి పలుజిల్లాల్లో మరణాలు సంభవించాయి. వరంగల్, ఆదిలాబాద్, నెల్లూరు, కరీంనగర్, ఇంకా ఒంగోలు జిల్లాల్లో 17 మంది మృత్యువాత పడ్డారు. ఈ వైరస్ ఎలుకలు ద్వారా సంక్రమిస్తుంది. తీవ్రమైన జ్వరం, కళ్ళు ఎర్రబడుట, లివర్స్ లో మంట, బిపి లో హెచ్చుతగ్గులు మొదలైనవి ఈ వ్యాధి లక్షణాలు.
ఈ మృతులను రాష్ట్ర పాలనా యంత్రాంగం మొదట తెలిగ్గాతీసుకుంది. 8 రోజులుగా మరణాల సంఖ్య పెరుగుతూ వస్తుండటంతో ప్రభుత్వం ఇప్పుడు దీనిపై దృష్తి సారించింది. మాన్సూన్ సెషన్లో ఈ వైరస్ మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో దీని నియంత్రణకు సర్కారు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లా అధికారులకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఆరోగ్యశ్రీ జాబితాలో ఈ వ్యాధిని కూడా చేర్చి గ్రామాల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశాలిచ్చింది.