విడుదల తేది : 24 ఫిబ్రవరి 2012 |
123తెలుగు.కాం రేటింగ్: 3.25/5 |
దర్శకుడు : విక్రమ్ కె కుమార్ |
నిర్మాత :యమ్ విక్రమ్ గౌడ్ |
సంగిత డైరెక్టర్ : అనూప్ రూబెన్స్ |
తారాగణం : నితిన్, నిత్య మీనన్ |
నితిన్ మరియు నిత్య మీనన్ నటించిన చిత్రం ‘ఇష్క్’ శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై న్రిమించిన ఈ చిత్రానికి విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించారు. ప్రముఖ పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించగా ఇష్క్ ప్రపంచవ్యాప్తంగా ఈ రోజే విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.
కథ:
రాహుల్ (నితిన్) ప్రాక్టికల్ జోకులు వేస్తూ జోవియల్ గా మరియు ఫ్రెండ్లీగా ఉండే కుర్రాడు. హైదరాబాదుకు వెళ్తున్న ప్రియ (నిత్య మీనన్) కలిసి ప్రేమలో పడతాడు. వారు హైదరాబదుకు వెళుతున్న విమానం అనుకోకుండా గోవాలో ఆగిపోవడంతో అక్కడే ప్రియ మనసు కూడా గెలుచుకుంటాడు. హైదరాబాదు వెళ్ళేలోపు ఇద్దరు ప్రేమలో మునిగిపోతారు. ఇక్కడినుండి కథ అనుకోని మలుపులు తిరుగుతుంది. ప్రియ అన్నయ్య శివ (అజయ్) కథలోకి వస్తాడు. గతంలో శివ కి రాహుల్ కి మధ్య వైరం ఉంటుంది. మరి శివ రాహుల్, ప్రియ ల రిలేషన్ కి ఎలా స్పందించాడు అనేది మిగతా చిత్ర కథ.
ప్లస్ పాయింట్స్:
నితిన్ మరియు నిత్య మీనన్ మంచి నటన కనబరిచారు. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా పండింది. వారి జంట కూడా చూడ ముచ్చటగా ఉంది. నితిన్ నటన ఆయన చిత్రాలలో అత్యుత్తమమ అని చెప్పాలి. అతని పాత్ర కూడా ఫ్రెష్ గా ఉండటంతో ఆ పాత్రలో ఒదిగిపోయి నటించాడు. నిత్య మీనన్ క్యూట్ గా అందంగా ఉంది. చీరల్లో చాలా బావుంది. మంచి నటన కనబరిచింది. పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ తో చిత్రీకరణ చాలా అందంగా ఉంది. (సాంకేతిక విభాగం ఆయనగురించి మరింత మాట్లాడుకుందాం). నితిన్ మరియు నిత్య మీనన్ మధ్య రొమాంటిక్ ట్రాక్ చాలా బాగా తీసాడు. నిత్య తండ్రిగా నగినీడు పరలేధనిపించాడు. శివ పాత్రలో అజయ్ బాగా నటించాడు. అతను తన పాత్రలో పలు విభిన్నమైన రకాలు చూపించాడు. అలీ ది చిన్న పాత్ర అయిన బాగా నవ్వించాడు. శ్రీనివాస్ రెడ్డి మరియు తాగుబోతు రమేష్ కూడా బాగా నవ్విస్తారు. గోవా లో ఉండే జయ అంటీ గా రోహిణి బాగానే చేసింది. పాటలు చాలా బాగా చిత్రీకరించారు ముఖ్యంగా ఓ ప్రియ ప్రియ ఇంకా బాగా తీసారు.
మైనస్ పాయింట్స్:
సినిమాలో అత్యదికంగా లాజిక్ అందని సన్నివేశాలు ఉన్నాయి. వర్షాల వాళ్ళ హైదరబాద్ ఎయిర్ పోర్ట్ దాదాపు రెండు రోజులు మూసి వేయడం జరుగుతుందా? 1940 ల నాటి పాత జీప్ పవర్ఫుల్ మోడరన్ కార్ తో హైదరబాద్ ఔటర్ రింగ్ రోడ్ మీద పోటీ పడుతుందా? ఇలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకుని ఉంటే బావుండేది. చిత్ర రెండవ భాగంలో కథన వేగం మందగిస్తుంది. సత్య కృష్ణ, సింధు తులాని మరియు సుప్రీత్ లకు సరైన పాత్రలు ఇవ్వక వృధా చేసారు.
సాంకేతిక విభాగం:
పిసి శ్రీరామ్ గారికి అందరూ అంత గౌరవం ఎందుకు ఇస్తారు అనేది ఈ చిత్రం చూస్తే అర్ధమవుతుంది. ప్రతి ఫ్రేములోనూ సినిమాటోగ్రఫీ అందం కనపడుతుంది. పాటల్లో ఆయన కెమెరా పనితనం ఇంకా పదునుగా ఉంది. రమేష్ సామల రాసిన డైలాగులు బావున్నాయి. కొన్ని సన్నివేశాల్లో బాగా నవ్విస్తాయి. ఎడిటింగ్ పరవాలేదు. కోరియోగ్రఫీ చాలా బావుంది.అనూప్ రూబెన్స్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బావుంది. అరవింద్ శంకర్ త్రయం అందించిన పాటలు కూడా బావున్నాయి.
తీర్పు:
ఇష్క్ అందమైన ప్రేమ కథ. నితిన్ మరియు నిత్య మీనన్ మధ్య కెమిస్ట్రీ చూడ ముచ్చటగా ఉంది. అందమైన సినిమాటోగ్రఫీ, మంచి డైలాగులు సినిమాకి బాగా ప్లస్. కొన్ని లాజిక్ కు అందని సన్నివేశాలు, కమర్షియల్ అంశాలు పెద్దగా లేకపోవడం వంటివి మైనస్. బి మరియు సి సెంటర్స్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయినా ఏ క్లాస్ ఆడియెన్స్ కి మాత్రం బాగా
నచ్చుతుంది.
123తెలుగు.కామ్ రేటింగ్: 3.25/5
అనువాదం :అశోక్ రెడ్డి
Clicke Here For ‘Ishq’ English Review