సమీక్ష : పటుత్వం లేని కథ – ఇట్స్ మై లవ్ స్టోరీ

సమీక్ష : పటుత్వం లేని కథ – ఇట్స్ మై లవ్ స్టోరీ

Published on Nov 11, 2011 2:19 PM IST
విడుదల తేదీ: 11 నవంబర్ 2011
123Telugu.com రేటింగ్: 2.5 /5
దర్శకుడు: మధుర శ్రీధర్ రెడ్డి
నిర్మాత: డా. మున్న వెంకటకృష్ణ రెడ్డి
సంగీత దర్శకుడు: సునీల్ కశ్యప్
పాత్రలు: అరవింద్ కృష్ణ, నికిత నారాయణ్

తన తొలి చిత్రం ‘స్నేహగీతం’ తో విమర్శకుల ప్రసంసలు సైతం పొందిన దర్శకుడు మధుర శ్రీధర్. ఇప్పుడు తన రెండవ ప్రాజెక్ట్ ‘ఇట్స్ మై లవ్ స్టొరీ’ తో ముందుకొచ్చారు. ఈ చిత్రంలో అరవింద్ కృష్ణ, నికిత నారాయణ్ హీరో, హీరోయిన్ లు గా నటించారు. ఈ మూవీ రాష్ట్ర వ్యాప్తంగా నేడు విడుదల అయ్యింది. ఈ సినిమా ఎలాఉందో ఇప్పుడు చూద్దాం.

కథ: అర్జున్ (అరవింద్ కృష్ణ) హైదరాబాద్ లో ఒక లీడింగ్ గేమ్ డవలపర్. అనుకోని పరిణామాలు వందనా (నికితా నారాయణ్) తో స్నేహానికి దారితీస్తాయి. ఆమె విశాఖపట్టణం నుండి హైదరాబాద్ వచ్చిన ఒక ఆసక్తి కల ఫ్యాషన్ డిజైనర్. వరుసగా వచ్చే సంఘటనలు వందనను అర్జున్ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రేరేపిస్తాయి. అనంతరం వీరి మధ్య ప్రేమ వికసిస్తుంది.

వీరి ప్రేమ విషయం నికితా తల్లిదండ్రులు (జయసుధ – శరత్ బాబు) కు తెలుస్తుంది. అయితే వీరు దీనిని వ్యతిరేకిస్తారు. మిగతా స్టొరీ అంతా నికితా తల్లిదండ్రులను ఒప్పించి అర్జున్ ఎలా తన ప్రేమను సాధించుకుంటాడు అనే దాని గురించి.

ప్లస్ పాయింట్లు:

అరవింద్ కృష్ణ తన పాత్ర లో ఒదిగిపోయాడు. నికితా నటన ఓకే. వారి స్థాయికి అనుగుణంగా శరత్ బాబు – జయసుధ ప్రదర్శన ఉంది. నిఖితా సోదరిగా కల్పిక నటన చాలా బావుంది. తాగుబోతు రమేష్ మంచి హాస్యాన్ని పండించాడు. తెరపై అతని టైమింగ్ డీసెంట్ గా ఉంది.

అరవింద్ కృష్ణ పేరెంట్స్ గా ప్రగతి – కాశి విశ్వనాథ్ రక్తికట్టించారు. పాటలు బాగా చిత్రీకరించారు.

మైనస్ పాయింట్లు:

ముఖ్యంగా ఈ సినిమా కథలో పటుత్వం లేదు. ఇలాంటి సందర్భాలలో కనీసం స్క్రీన్ ప్లే అన్నా రక్తి కట్టించాలి. అయితే అది కూడా సక్రమంగా లేక పోవటం బాధాకరం. స్టొరీ చెప్పిన విధానం సైతం ఆద్యంతం చాలా నెమ్మదిగా సాగుతుంది. ఇది ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించే స్థాయిలో ఉంటుంది.

అరవింద్ కృష్ణ నటన బానే కనిపించినప్పటికీ నైపుణ్యం కొరవడినట్టు అగుపిస్తుంది. నిఖితా విషయం లోనూ అలానే అనిపిస్తుంది.

ఆర్ జె ఘజిని హాస్యం టాప్ గా ఉంది. వెన్నెల కిషోర్ ‘సుజాత’ పాత్ర వృధా ప్రయాస గా మారింది. కొన్ని కామెడీ సన్నివేశాలు నవ్వులు పండించుట మాట అటుంచితే, విసుగు తెప్పించేలా సాగుతాయి.

సాంకేతిక విభాగాలు:

డైలాగ్స్ ఈ సినిమాలో చాలా పేలవంగా ఉన్నాయి. మరింత మంచి సంభాషణలు ఉంటే, చిత్ర విజయానికి దోహద పడేవి. సినిమాటోగ్రఫీ అటు, ఇటుగా ఉంది. కొన్ని చోట్ల బావుంది. మరికొన్ని చోట్ల నాసిరకంగా వచ్చింది. పాటలు తెరపై మంచి అనుభూతిని కల్గించటానికి సునీల్ కశ్యప్ మ్యూజిక్ ఎంతో దోహద పడింది. ఎడిటింగ్ సరే సరి.

తీర్పు:

ప్రేక్షకుల మెప్పు పొందలేని సినిమాల్లో ‘ఇట్స్ మై లవ్ స్టోరీ’ ఒకటి. కథ చెప్పిన తీరు, స్టొరీ లో పటుత్వం లేకపోవటం, స్క్రీన్ ప్లే తాపీ గా సాగటం ఈ సినిమాకు సక్సెస్ కు ప్రధాన అవరోధం. మంచి సంభాషణలు, సినిమా చురుగ్గా పరుగెత్తి వుంటే ఇంకా మెరుగైన చిత్రం వచ్చి ఉండేది. మొత్తంమీద ‘ఇట్స్ మై లవ్ స్టొరీ’ ప్రేక్షకులను నిరాశ పరిచే చిత్రమే.

నారాయణ – ఎవి

123Telugu.com రేటింగ్: 2.5 / 5

సంబంధిత సమాచారం

తాజా వార్తలు