మహేష్ బాబు న్యూ ఇయర్ ప్లాన్ ఇవే!!

మహేష్ బాబు న్యూ ఇయర్ ప్లాన్ ఇవే!!

Published on Dec 23, 2015 12:15 PM IST

mahesh-babu
సూపర్ స్టార్ మహేష్ బాబు మాములుగా సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసాక కొద్ది రోజులు తన ఫ్యామిలీతో కలిసి హాలిడే ట్రిప్ ప్లాన్ చేస్తాడు. సినిమా షూట్ మధ్యలో చాలా తక్కువగా హాలిడేకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. గత రెండు వారాలుగా బ్రహ్మోత్సవం షూట్ లో బిజీగా ఉన్న మహేష్ బాబు నిన్నటితో ఊటీ షెడ్యూల్ ని ఫినిష్ చేసాడు. తన తదుపరి షెడ్యూల్ జనవరి మొదటి వారం చివర్లో మొదలవుతుంది. దాంతో మహేష్ బాబుకి ఒక 10రోజులు గ్యాప్ దొరికింది.

ఇదే గ్యాప్ లో క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ కూడా రానుండడంతో మహేష్ బాబు తన ఫ్యామిలీతో స్పెషల్ ట్రిప్ ప్లాన్ చేసాడు. అందులో భాగంగా ఆయన నమ్రత, గౌతమ్, సితారలతో కలిసి అబ్రాడ్ వెళ్లనున్నాడు. ఆయన ఏ ప్లేస్ కి వెళ్లనున్నాడు అనేదిగోప్యంగా ఉంచినా, మహేష్ అండ్ ఫ్యామిలీ రేపు(డిసెంబర్ 24) రాత్రి ఫ్లైట్ ఎక్కనున్నారు అన్నది మాత్రం కచ్చితమైన సమాచారం. న్యూ ఇయర్ తర్వాత మహేష్ బాబు తిరిగి హైదరాబాద్ రానున్నాడు. వచ్చాక మహేష్ బాబు బ్రహ్మోత్సవం న్యూ షెడ్యూల్ లో జాయిన్ అవుతాడు. ఈ షెడ్యూల్ లో సమంత కూడా జాయిన్ అవుతుంది.

శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని పివిపి బ్యానర్ పై ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు