సమీక్ష : కులు మనాలి – ప్రేక్షకులను టార్చర్ పెట్టే కులు మనాలి.

సమీక్ష : కులు మనాలి – ప్రేక్షకులను టార్చర్ పెట్టే కులు మనాలి.

Published on Mar 9, 2012 11:26 PM IST
విడుదల తేది : 9 మార్చి 2012
123తెలుగు.కాం రేటింగ్:1.75/5
దర్శకుడు : వేగేశ్న సతీష్
నిర్మాత : బొప్పన చంద్రశేఖర్
సంగిత డైరెక్టర్ : శ్రీ వసంత
తారాగణం : కృష్ణుడు ,శశాంక్ ,అర్చన ,సమీక్ష ,విమలరామన్

విమల రామన్, అర్చన (వేద), శశాంక్, కృష్ణుడు ముఖ్య పాత్రల్లో మర్డర్స్ మిస్టరీగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కులు మనాలి’. బోపన చంద్రశేఖర్ నిర్మించిన ఈ చిత్రానికి శ్రీవసంత్ సంగీతం అందించారు. కులు మనాలి చిత్రం ఆంధ్రప్రదేశ్ అంతటా ఈ రోజే విడుదలవగా ఈ చిత్రం ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.

కథ:

కృష్ణుడు, రిషి (శశాంక్) మారి స్నేహితుల గ్యాంగ్ సరదాగా గడపడానికి కులు మనాలి వెళతారు. కాని వారి ట్రిప్ విషాదంగా మారుతూ మాస్కు వేసుకున్న ఒక హంతకుడు ఒక్కొక్కరినీ వెంటాడుతూ చంపుతుంటాడు. ఈ పరిణామానికి భయపడిన వారు లోకల్ గైడ్ హర్ష (హర్ష వర్ధన్) సహకారంతో ఇన్స్పెక్టర్ ప్రవల్లిక (విమల రామన్) సహాయం కోరతారు. ఆ హంతకుడు తమను చంపడం వెనుక ఏదో బలమైన కారణం ఉండటం వలన తమను చంపుతున్నాడు అని అర్ధం చేసుకున్న వారు అది తెలుసుకునే ప్రయత్నం మొదలు పెడతారు. మరో వైపు ఆ హంతకుడు వరుస హత్యలు చేస్తూనే ఉంటాడు. ఆ స్నేహితులు గతంలో చేసిన తప్పుల వలన హంతకుడు ఈ హత్యలు చేస్తున్నాడు అని ప్రవల్లిక తెలుసుకుంటుంది. వారు గతంలో చేసారు? చివరకు ఆ హంతకుడు దోరికడా అనేది మిగతా చిత్ర కథ.

ప్లస్ పాయింట్స్:

విమల రామన్, అర్చన తమ పాత్ర పరిది మేరకు పరవాలేదనిపించారు. విమల రామన్ డాన్సులు ఫైట్స్ బాగానే చేసింది. అర్చన కూడా ఉన్నతలో బాగానే చేసింది. తన స్థాయికి సరితూగే పాత్ర కాదని మాత్రం చెప్పుకోవచ్చు. శశాంక్ కూడా బాగానే చేసాడు కాని ఇంకా బాగా చేసుండొచ్చు. హర్ష వర్ధన్ మరియు వినయ్ మోహన్ నిరాశ పరచాకపోయిన బాగానే చేసారు. వారు పండించిన కామెడీ ప్రేక్షకులకు కొంత ఓదార్పు.

మైనస్ పాయింట్స్:

సినిమా చూడానికి వచ్చిన ప్రేక్షకులను ఎలా హింసించాలో ఇదొక చక్కని ఉదాహరణ. ఈ చిత్ర కథని చాలా ఇంగ్లీష్ సినిమాల నుండి ఆధారంగా తీసుకున్నారు. చిత్రంలో ఉన్న ఒక్క పాత్రని కూడా సరిగా చిత్రణ చేసుకోలేదు. కథనం అస్సలు బాగా లేకపోగా సాంగ్స్ టైమింగ్ అయితే ఇంకా చిరాకు తెప్పిస్తుంది. సినిమాలో సస్పెన్స్ క్రియేట్ చేయడంలో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు. చిత్ర రెండవ భాగంలో ఎడిటింగ్ బాగా చేసి ఉంటే సినిమాకి కొంత ఉపయోగపడేది. హంతకుడు హత్యలు చేయడం వెనక పగని ఎస్టాబ్లిష్ చేయడంలో కూడా దర్శకుడు విఫలమయ్యాడు.

సాంకేతిక విభాగం:

సినిమాటోగ్రఫీ మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. ఎడిటింగ్ ఇంకా బాగా చేసి ఉండాల్సింది ముఖ్యంగా చిత్ర రెండవ భాగంలో. డైలాగుల గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం. నిర్మాణాత్మక విలువలు బానే ఉన్నాయి.

తీర్పు:

కులు మనాలి సినిమా చూడకపోవడమే మంచిది. సినిమాలో ఏముంది అంటే ఏమీ లేదు. ఒక వేల మీరు విమల రామన్, అర్చన అభిమానులు అయి ఉంటే సినిమాకి వెళ్ళాలనుకుంటే ఇంటర్నెట్లో వారి ఫోటోలు చూసి ఎంజాయ్ చేయండి.

123తెలుగు.కాం రేటింగ్ : 1.75/5

అనువాదం : అశోక్ రెడ్డి

Clicke Here For ‘Kulu Manali’ English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు