తెరపై తెలంగాణా చాకలి ఐలమ్మ

తెరపై తెలంగాణా చాకలి ఐలమ్మ

Published on Nov 15, 2011 8:20 AM IST


చాకలి ఐలమ్మ గా ప్రీతీ నిగం అవతారమెత్తనుంది. తెలంగాణా ప్రాంతంలోని చిన్న సన్నకారు రైతుల హక్కులకోసం ఇప్పటికీ పోరాడుతూ ఖ్యాతి గడించింది చాకల ఐలమ్మ. ఆ ప్రాంత గొప్పతనాన్ని సాధక బాధకాలను ఈ చిత్రం ప్రతిభంభిస్తుంది. తెలంగాణాకు స్వతంత్ర ప్రతిపత్తి కోసం పోరాడుతోన్న వారికి ఈ సినిమా కొత్త ఉత్సాహాన్ని ఇవ్వబోతుంది.

మూవీ గురించి ఆ చిత్ర దర్శకుడు మిరియాల రవీందర్ కొన్ని విషయాలు వెల్లడించారు. ప్రధానంగా ఈ సినిమా తెలంగాణా కోసం అసువులు బాసిన త్యగాధనులకు ఈ చిత్రం అంకితం అని ఆయన తెలిపారు. నవంబర్ 26 నుంచి ఈ చిత్ర తొలి షెడ్యూల్ వరంగల్ లో ప్రారంభం కానుంది. ఈ చిత్రం లో నటించే ఇతర తారాగణం విషయానికి వస్తే.. బయ్యారం వీరన్న, రాఖి, బండారి మువ్వ, ఇంకా హరి లక్ష్మి.

ఈ సినిమా కు సంగీతం రమేష్ ముక్కర అందిస్తున్నారు. మహూర్తపు షాట్ ను ఇలమ్మ మనువడు రామచంద్ర క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఈ చిత్రానికి నాగమణి, విజయకుమార్ నిర్మాతలు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు