విడుదల తేదీ : మే 19, 2017
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5
దర్శకత్వం : హరనాథ్ పొలిచెర్ల
నిర్మాత : హరనాథ్ పొలిచెర్ల
సంగీతం : ఎస్ అండ్ బి మ్యూజిక్ మిల్
నటీనటులు : పోలిచర్ల హరనాధ్, నిషిగంధ, మౌనిక
‘చంద్రహాస్, అలెక్స్’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన హరనాథ్ పొలిచెర్ల హీరోగా నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహించిన చిత్రమే ‘టిక్ టాక్’. ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
కథ :
అంజి (హరనాథ్) అనే మెకానిక్ తన మరదలు మహాలక్ష్మి (మౌనిక), మరియు తన స్నేహితులతో కలిసి హాయిగా జీవిస్తుంటాడు. అలాంటి సమయంలో ప్రీతి (నిషి గంధ) అనే అమ్మాయి వీరి జీవితాల్లోకి అనుకోకుండా ఎంటరై అంజికి ఒక పాడుబడిన బంగ్లాలో కొన్ని రోజులపాటు ఉండాలని ఛాలెంజ్ విసురుతుంది.
ధైర్యవంతుడు, సాహసవంతుడు అయిన అంజి ఆ ఛాలెంజ్ ను తీసుకుని బంగ్లాలోకి వెళతాడు. అలా ఆ బంగ్లాలోకి వెళ్లిన అంజికి ఎలాంటి సమస్యలు ఎదురయాయ్యి ? వాటిని అంజి తన తెలివితో ఎలా పరిష్కరించాడు ? అనేదే మిగతా కథ.
ప్లస్ పాయింట్స్:
సినిమా ఆరంభంలోనే దర్శకుడు, హీరో అయిన హారనాథ్ తన వాయిస్ ఓవర్ తో ఆత్మల అంశాన్ని గురించి చెప్పడం బాగుంది. పైగా అయన దర్శకత్వ పరంగా, నటన పరంగా ఎలాంటి ప్రయోగాలు చేయకపోవడం ఊరటనిచ్చింది. అలాగే ఆయన మ్యానరిజం, డైలాగ్ డెలివరీ ప్రేక్షలకి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాయి.
అలాగే తక్కువగా ఉన్న రన్ టైం కూడా సినిమాకి కలిసొచ్చే అంశమనే చెప్పాలి. హీరోయిన్లలో ఒకరైన మౌనిక పల్లెటూరి అమ్మాయిగా తన లుక్స్ తో ఆకట్టుకుంది. మరొక హీరోయిన్ నిషి గంధ గ్లామర్ షో మాస్ ప్రేక్షకుల్ని అలరిస్తుంది. సినిమా సెకండాఫ్ ను బాగానే చిత్రీకరించారు. అందులో గ్రాఫిక్స్ తో కూడిన ఒక పాట చూసేందుకు బాగుంది.
మైనస్ పాయింట్స్:
హరనాథ్ రచయితగా, దర్శకుడిగా చాలా వరకు ప్రేక్షకుల్ని నిరుత్సాహపరిచారు. కథలోని హర్రర్ ఎలిమెంటర్ సినిమాకి మరో బలహీనత. కథలో, కథనంలో దర్శకుడికి పూర్తిగా క్లారిటీ లేకపోవడమనేది తెరపై స్పష్టంగా కనిపించింది. అసలు హరనాథ్ తన గ్యారేజ్ లో ఏం చేస్తుంటాడు అనేది అర్థం కాదు.
కేవలం కొన్ని కామెడీ సన్నివేశాలు, హీరో ఇంట్రడక్షన్ సాంగ్ కోసం ఆ ఎపిసోడ్లు పెట్టినట్లుంది. మొదటి 5 నిముషాల సినిమా బాగానే ఉన్న ఆ తర్వాత వచ్చే సన్నివేశాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా ఆకట్టుకోలేదు. ఇక క్లైమాక్స్ లో వచ్చే ఐటం సాంగ్ అయితే సహనానికి పరీక్షనే చెప్పాలి.
సాంకేతిక విభాగం :
ముందుగా చెప్పినట్టే కథ, కథనంలో పూర్తి క్లారిటీ లేకపోవడంతో దర్శకుడిగా హరనాథ్ నిరుత్సాపరిచారు. ఆయన స్క్రిప్ట్ మీద ఇంకాస్త దృష్టి పెట్టి ఉండాల్సింది. వెంకట రమణ ఎడిటింగ్ ఎడిటింగ్ కూడా బాగోలేదు. ఇంకా ఆయన కొని సన్నివేశాల్ని తొలగించి ఉండాల్సింది. ఫై. వంశీ కృష్ణ సినిమాటోగ్రఫీ పర్వాలేదంతే. ఎస్ అండ్ బి మిల్ సంగీతం పర్వాలేదు. నిర్మాణ విలువలు తక్కువ స్థాయిలోనే ఉన్నాయి.
తీర్పు:
మొత్తం మీద చెప్పాలంటే ఈ ‘టిక్ టాక్’ చిత్రంలో కొత్తదనమంటూ ఏం లేదు. హీరో, దర్శకుడు హరనాథ్ ఆత్మల గురించి, వాటి ఉనికి గురించి చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ అది సరిగా వర్కవుట్ కాలేదు. ఆటను కథను వివరించిన విధానం, కథనం సినిమాను పూర్తిగా పక్కదారి పట్టించాయి. సినిమా ఫస్టాఫ్ ఆరంభం తప్ప మిగతా అంతా నిరుత్సాకరంగానే ఉంది. కనుక ఈ వారాంతంలో ఈ చిత్రాన్ని పక్కనబెడితే మంచిది.
123telugu.com Rating : 2/5
Reviewed by 123telugu Team