ఇంటర్వ్యూ : అనీషా ఆంబ్రోస్ – వంశీగారి వలనే ‘ఫ్యాషన్ డిజైనర్’ సినిమాకి ఒప్పుకున్నాను !

ఇంటర్వ్యూ : అనీషా ఆంబ్రోస్ – వంశీగారి వలనే ‘ఫ్యాషన్ డిజైనర్’ సినిమాకి ఒప్పుకున్నాను !

Published on May 20, 2017 6:55 PM IST


‘అలియాస్ జానకి’ చిత్రంతో నటిగా పరిచయమై ‘రన్, మనమంతా’ చిత్రాల్లో నటించిన అనీషా ఆంబ్రోస్ ప్రస్తుతం క్లాసికల్ డైరెక్టర్ వంశీ దర్శకత్వం వహించిన ‘ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ టైలర్’ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం జూన్ 2న రిలీజ్ కానున్న సందర్బంగా ఆమె మీడియాతో చిత్ర విషయాల్ని పంచుకున్నారు. ఆ విశేషాలు ఇవే..

ప్ర) ఈ సినిమాలో మీది ఎలాంటి రోల్ ?
జ) ఈ సినిమాలో నేనొక ఎన్నారై. నాకు విలేజస్, ఇక్కడి నేటివిటీ అంటే ఇష్టం. అలాంటి అమ్మాయి హీరో ఉండే విజిల్ కి ఎలా వచ్చింది. ఆ విలేజ్ తో ఎలాంటి రిలేషన్ ఏర్పరుచుకుంది అనేదే నా క్యారెక్టర్.

ప్ర) వంశీగారితో వర్క్ చేశారు కదా ఎలా ఫీలవుతున్నారు ?
జ) సీనియర్ వంశీగారితో పనిచేయడం చాలా లక్కీగా ఫీలవుతున్నాను. కేవలం వంశీగారు డైరెక్ట్ చేస్తున్నారనే ఈ గ్లామరస్ రోల్ కి ఒప్పుకున్నాను.

ప్ర) గ్లామరస్ రోల్ అంటే ఎలా ఉంటుంది ?
జ) అంటే ఇంతకూ ముందు నేను చేసిన సినిమాల్లో అన్నీ కాలేజ్ అమ్మాయిలాంటి సింపుల్ పాత్రలే చేశాను. కానీ ఇందులో మాత్రం చాలా రొమాన్స్ ఉంటుంది. కాస్ట్యూమ్స్ లో కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది.

ప్ర) గోదావరి జిల్లాల్లో షూట్ చేయడం ఎలా ఉంది ?
జ) నేనెప్పుడూ గోదావరి జిల్లాలకు వెళ్ళలేదు. ముఖ్యంగా పాపాయికొండల్లో షూటింగ్ మంచి అనుభవం. అసలక్కడ మొబైల్ సిగ్నల్ కూడా ఉండదు. అలాంటి చోట 8 రోజులు ఉన్నాను. ఇంట్లో వాళ్ళతో కూడా కమ్యూనికేషన్ లేదు. అది మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను.

ప్ర) సుమంత్ అశ్విన్ తో వర్క్ చేయడం గురించి ?
జ) సుమంత్ అశ్విన్ తో కలిసి పనిచేయడం చాలా బాగుంది. అతను నాకు మంచి ఫ్రెండైపోయాడు. అంటే బాగా తెలిసిన వాళ్ళతో కలిసి ఒక ఈవెంట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది అశ్విన్ తో షూట్ చేయడం.

ప్ర) వంశీగారితో వర్క్ చేయాలనుకోవడానికి ఇతర రీజన్స్ ఏమైనా ఉన్నాయా ?
జ) అంటే ఒకసారి సినీ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత కొందరు దర్శకులతో పనిచేయడం లైఫ్లో బ్లెస్సింగ్ దొరకడంలా అనిపిస్తుంది. వంశీగారితో కూడా అంతే.

ప్ర) లేడీస్ టైలర్ కి ఈ సినిమాకి తేడా ఏంటి ?
జ) చాలా తేడాలున్నాయ్. సినిమా చూస్తే తెలుస్తుంది. ఇది లేడీస్ టైలర్ కి సీక్వెల్ లా ఉంటుంది. తప్పకుండా అందరికీ నచ్చే విధంగా ఉంటుంది.

ప్ర) ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పండి ?
జ) మధుర శ్రీధర్ గారు చాలా మంచివారు. ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. ఏ టైమ్ లో అయినా ఫోన్ చేసి ఈ హెల్ప్ కావలి అంటే తప్పకుండా చేసేవారు.

ప్ర) మీకు ఎలాంటి రోల్స్ చేయాలని ఉంది ?
జ) నాకు ఎలాంటి క్యారెక్టరైనా ఓకే. అది నాకు సూటైతే తప్పకుండా చేస్తాను. అంతేగాని ఇలాంటి పాత్రలే చేయాలనేం లేదు.

ప్ర) మీ నెక్స్ట్ సినిమాలేంటి ?
జ) నెక్స్ట్ మంచు మనోజ్ చేస్తున్న ‘ఒక్కడు మిగిలాడు’ లో చేస్తున్నాను. అది ప్రభాకరన్ బయోపిక్. ఇంకా కొన్ని ఉన్నాయి. అవి అఫీషియల్ గా అనౌన్స్ అయ్యాక చెప్తాను. వాటిలో తమిళ సినిమా కూడా ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు