సమీక్ష : కాదలి – కన్ఫ్యూజన్ కు గురిచేసే ట్రైయాంగిల్ లవ్ స్టోరీ

సమీక్ష : కాదలి – కన్ఫ్యూజన్ కు గురిచేసే ట్రైయాంగిల్ లవ్ స్టోరీ

Published on Jun 16, 2017 11:45 PM IST
Kaadhali movie review

విడుదల తేదీ : జూన్ 16, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

దర్శకత్వం : పట్టాభి ఆర్. చిలుకూరి

నిర్మాత : పట్టాభి ఆర్. చిలుకూరి

సంగీతం : ప్రసన్ ప్రవీణ్ శ్యామ్

నటీనటులు : హరీష్ కళ్యాణ్, సాయి రోనక్, పూజ కె.దోషి

కాదలి ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలో కాస్తా పబ్లిసిటీతో యువతరం ఆలోచనలు దగ్గరగా ఉంటుందేమో అనే విధంగా చేరువైన చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముక్కోణపు ప్రేమ కథగా తెరకెక్కిన ఈ చిత్రం ఏ స్థాయిలో ప్రేక్షకుల అంచనాలని అందుకుంది అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.

కథ:

అసలు కథలోకి వెళ్తే బాంధవి(పూజ) మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. అయితే ఆమెకు ఇంట్లో పెళ్లి సంబంధం చూస్తూ ఉంటారు. ఎన్ని సంబంధాలు చూసి ఏదో ఒక కారణం వలన ఆ సంబంధాలన్నీ తప్పిపోతాయి. దాంతో ఆమె బాగా ఆలోచించి తన జీవిత భాగస్వామిని తానే ఎంపిక చేసుకోవాలని నిర్ణయానికి వచ్చి తన ప్రేమ ప్రయాణం మొదలు పెడుతుంది. ఈ ప్రయాణంలో ఆమెకు సాయి రోనక్, హరీష్ కళ్యాణ్ పాత్రలతో పరిచయం పెరుగుతుంది. అయితే ఆ ఇద్దరు కుర్రాళ్ళు ఆమెతో పీకల్లోతు ప్రేకలో కూరుకుపోతారు. ఆ విషయాన్ని ఇద్దరు బాంధవికి చెబుతారు. అలాంటి క్లిష్ట పరిస్థితిలో భాంధవి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? తన జీవిత భాగస్వామిగా ఎవరిని ఎన్నుకుంటుంది ? అనేది సినిమా కథ.

ప్లస్ పాయింట్స్:

సినిమాలో గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం అంటే అది దర్శకుడు ఎంచుకున్న కథ. నేటి యువతరం మనోభావాలని ప్రతిబింబించే విధంగా ఒకేసారి ఇద్దరు అబ్బాయితో డేటింగ్ చేస్తూ, వారిలో ఒకరిని జీవిత భాగస్వామిగా ఎంచుకోవాలని ఒక అమ్మాయి అనుకోవడం ఆసక్తికరంగా, కొత్తగా ఉంది. అలాగే సినిమాలో హీరోలుగా చేసిన ఇద్దరు సాయి రోనక్, హరీష్ కళ్యాణ్ ల నటనతో మొదటి భాగం ఫీల్ గుడ్ గా నడుస్తూ హృదయానికి హత్తుకుంటుంది.
ఇక సినిమాలో హీరో సాయి రోనక్ డబ్బున్న అబ్బాయి పాత్రకి బాగా సూటయ్యాడు. అలాగే అతని పాత్రలో వున్న కాస్త నెగెటివ్ స్వభావాన్ని కూడా తన నటన ద్వారా బాగానే ఎలివేట్ చేశాడు.

ఇక మరో హీరోగా నటించిన హరీష్ కళ్యాణ్ తన పాత్ర ద్వారా కథకి బలాన్ని అందించే భావోద్వేగాలను చాలా చక్కగా పలికించాడు. ఇక హీరోయిన్ గా నటించిన పూజ ఇద్దరు హీరోలతో రొమాంటిక్ సన్నివేశాల్లో తన నటనతో కొంత పరిధి మేరకు బాగానే మెప్పించింది. ఆమె పాత్ర చుట్టూ పండించిన ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా సినిమాకి కొంత బలాన్ని అందించేవిగా ఉన్నాయి. కమెడియన్ గా భాను అవిర్నేని తన పాత్రతో కొంత నవ్వించే ప్రయత్నం చేశాడు.

మైనస్ పాయింట్స్:

సినిమాకి మేజర్ మైనస్ గురించి మాట్లాడుకుంటే ముందుగా చెప్పుకోవాల్సింది దర్శకుడు రాసుకున్న బోరింగ్ స్క్రీన్ ప్లే. దర్శకుడు చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పడానికి ఎంచుకున్న కథనం ప్రేక్షకుడు సహనానికి పరీక్ష పెట్టే విధంగా వుంటుంది. కథలో కీలకం అనిపించే ట్విస్ట్ ప్రేక్షకుడిని అంతగా ఆకట్టుకునే విధంగా లేదు. అలాగే హీరోయిన్ చూడటానికి అందంగా ఉన్నా, ఆమె పాత్రని తీర్చిదిద్దిన విధానం సినిమాకి మరో పెద్ద లోపంగా తోచింది. ఈ పాత్రలో ప్రేక్షకులకు పరిచయం ఉన్న హీరోయిన్ ని ఎంపిక చేసుకుంటే బాగుండేది.

మొదటి సగ భాగం కొంత భాగానే అనిపించినా, ఇంటర్వెల్ తర్వాత వచ్చే కథనంలో కథ మొత్తం మరోసారి రిపీట్ అవుతూ అనిపించింది. అలాగే కథలో కీలకమైన హీరో, హీరోయిన్స్ మధ్య సన్నివేశాలు, ఎమోషన్స్ అన్ని కూడా అసందర్భంగా ఉండటంతో పాటు, హీరోయిన్ పాత్ర బిహేవ్ చేసే విధానం కూడా మూస ధోరణిలో సాగుతూ ప్రేక్షకు బోర్ ఫీల్ అయ్యేలా చేస్తుంది.

ఇక చిత్రం క్లైమాక్స్ కి వచ్చే సరికి హీరోయిన్, తనని ప్రేమించిన ఇద్దరి అబ్బాయిల్లో ఒకరిని పెళ్లి చేసుకోవాలని ఫైనల్ అవుతుంది. అయితే అమ్మాయి తనకు కాబోయే వాడిని ఎంపిక చేసుకోవడానికి చూపించే కారణాలు పెద్ద బలంగా అనిపించవు. అలాగే అమ్మాయి కోణంలో కథలో చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పలేక సినిమాను ఉన్నపళంగా ముగించేసిన ఫీలింగ్ కలుగుతుంది.

సాంకేతిక విభాగం:

నిర్మాత తక్కువ బడ్జెట్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని అనుకోవడం మెచ్చుకోదగిన విషయం. అలాగే సినిమాలో ఎక్కువ భాగం శ్రీలంకలో షూట్ చేశారు. అక్కడి ప్రకృతి అందాలని, అందుబాటులో వున్న లైటింగ్ ఉపయోగించుకొని తన కెమెరాతో అద్బుతంగా చూపించే ప్రయత్నం చేశారు. అలాగే ప్రవీణ్ శ్యాం సంగీతం వినసొంపుగా కాస్తా ఆకట్టుకునే విధంగా ఉంది. అయితే ఎడిటింగ్ విషయంలో మార్తాండ్ కె వెంకటేష్ ఇంకా తన కత్తెరకి పని చెప్పాల్సింది.

ఇక నిర్మాత మరియు దర్శకుడు పట్టాబి ఆర్ చెలుకూరి గురించి చెప్పుకోవాలంటే, అతను ఎంచుకునే పాయింట్ ఈ జెనరేషన్ వాళ్లకి భాగా కనెక్టయ్యేదే అయినా దానిని చెప్పాలనుకున్న దారిలో చెప్పలేకపోయారాయన. మొదటి సగ భాగంలో మంచి సన్నివేశాలతో మూడు పాత్రల మధ్య ప్రయాణం కాస్త ఆకట్టుకునే విధంగా నడిపించినా, ఇంటర్వెల్ తర్వాత వచ్చే కథనం మాత్రం పూర్తిగా గాడి తప్పి చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పలేకపోయారు. దాంతో సినిమా చాలా వరకు ఊహాజనితంగానే ముగిసింది.

తీర్పు:

ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే యువతరానికి కనెక్ట్ అయ్యే మంచి కథని ఎంచుకొని, దానిని నడిపించే విధానంలో చాలా వరకు విఫలం అయ్యారు దర్శకుడు. సినిమాలో అప్పుడప్పుడు వచ్చే రొమాంటిక్ లవ్ సన్నివేశాలు కాస్త ఆకట్టుకోగా, బోరింగ్ స్క్రీన్ ప్లే సహనాన్ని పరీక్షించింది. ఇక సినిమాలో హీరోలుగా చేసిన సాయి రోనక్, హరీష్ కళ్యాణ్ ల పెర్ఫార్మెన్స్ చూస్తే నమ్మకంగానే కనిపించారు. మొత్తం మీద ప్రేమ కథలను ఇష్టపడే వారు ఫ్రీ టైంలో గనుక చూస్తే సినిమా వాళ్లకు నచ్చొచ్చు.

123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు