వాణీ విశ్వనాధ్ భీభత్సంగా నటించిందంటున్న బోయపాటి !

వాణీ విశ్వనాధ్ భీభత్సంగా నటించిందంటున్న బోయపాటి !

Published on Aug 10, 2017 1:42 PM IST


బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ‘జయ జానకి నాయక’ చిత్రం రేపు థియేటర్లలోకి రానుంది. శరత్ కుమార్, జగపతిబాబు వంటి స్టార్ నటీనటులున్న ఈ సినిమాతో ఒకప్పటి స్టార్ హీరోయిన్ వాణీ విశ్వనాథ్ కూడా రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. చాలా ఏళ్ళ తర్వాత ఆమె సినిమాల్లోకి రానుండటంతో ఆమె పాత్రపై అందరిలోనూ అసక్తి నెలకొంది కొందరైతే ఆమెది నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అని కూడా అంటున్నారు.

కానీ దర్శకుడు బోయపాటి మాత్రం చాలా రోజుల తర్వాత ఆమెను తీసుకొస్తుండటం వలన అలా అనుకుంటున్నారని, అలాంటిదేమీ లేదని, ఫ్రెష్ నెస్ కోసం ఆమెను తీసుకున్నామని అన్నారు. అలాగే ఆమె కనిపించేది నాలుగు సన్నివేశాలే అయినా వాటిలో భీభత్సంగా నటించారని, ఇందులో ఆమెది తన అన్నయ్యను సపోర్ట్ చేసే పాత్రని అన్నారు. ఈ చిత్రంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా మంచి ఎత్తుకు ఎదుగుతాడని కూడా బోయపాటి తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు