బాక్స్ ఆఫీస్ వద్ద అర్జున్ రెడ్డి హవా ఇక చత్రాధిపత్యం గా సాగుతోంది. నిన్న విడుదలైన చిత్రాలకు డివైడ్ టాక్ వస్తుండడం కూడా అర్జున్ రెడ్డి సినిమాకు కలసి వచ్చే అంశం. దీనితో మరో వారం పాటు అర్జున్ రెడ్డి చిత్రం ఎటువంటి కాంపిటీషన్ లేకుండా వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది.
ఇప్పటికి ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో బలమైన కలెక్షన్లతో రాం అవుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 22.3 కోట్లు వసూలు చేసింది. దాదాపు 5 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం ఇంతటి భారీ వసూళ్లు సాధించడం గొప్ప విశేషం. ఈ చిత్ర రీమేక్ హక్కులకు కూడా భారీ డిమాండ్ ఉంది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో యువ హీరో విజయ్ దేవర కొండ లీడ్ రోల్ లో నటించాడు.