సమీక్ష : సరసుడు – షార్ట్ ఫిల్మ్ కథతో తీసిన ఫీచర్ ఫిల్మ్

సమీక్ష : సరసుడు – షార్ట్ ఫిల్మ్ కథతో తీసిన ఫీచర్ ఫిల్మ్

Published on Sep 15, 2017 4:46 PM IST
Sarasudu movie review

విడుదల తేదీ : సెప్టెంబర్ 15, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

దర్శకత్వం : పాండిరాజ్

నిర్మాత : ఉషా రాజేందర్

సంగీతం : కుర్లారసన్

నటీనటులు : శింబు, నయనతార, ఆండ్రియా, సత్యం రాజేష్

తమిళనాట శింబు మంచి యూత్ ఫాలోయింగ్ ఉన్న హీరో, ఆయన ‘మన్మధ’ సినిమాతో అందరికి చేరువైన సంగతి తెలిసిందే. ఇక నయనతార అంటే స్టార్ హీరోయిన్ గా తెలుగు వారందరికీ భాగా పరిచయం ఉన్న పేరు. వీళ్ళిద్దరి మధ్య ఒకప్పుడు ప్రేమ కథ ఉండేది. బ్రేక్ అప్ తర్వాత వీళ్ళిద్దరు కలిసి నటించిన సినిమా ‘సరసుడు’. ఇక ఈ సినిమాకి శింబు తండ్రి అలనాటి ‘ప్రేమ సాగరం’ దర్శకుడు టి.రాజేందర్ మాటలు, పాటలు రాయడం సొంత ప్రొడక్షన్ లోనే నేరుగా తెలుగులో రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉందో కాస్త తెలుసుకుందాం.

కథ:

శివ(శింబు) చెన్నైలో ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్. అతని జీవితంలో లవ్ చేసిన ప్రతి అమ్మాయితో బ్రేకప్ అయిపోతూ ఉంటుంది. దీంతో తండ్రి చూసిన పెళ్లి సంబంధంలో మైలా(నయనతార)ని చూసి మొదటి చూపులోనే లవ్ లో పడిపోతాడు. ఇక వాళ్ళ లవ్ స్టొరీ తో పాటు వారి పెళ్లి కథ కూడా చిన్న చిన్న గొడవల తో శుభం కార్డు పడే వరకు వచ్చేస్తుంది. అప్పుడే ఊహించని సంఘటనతో వాళ్ళిద్దరి మధ్య మరల దూరం పెరుగుతుంది. పెళ్లి కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఇంతకీ వాళ్ళిద్దరి మధ్య దూరం పెరగడానికి కారణం ఏంటి? అసలు శివ ప్రేమ కథకి ఎవరు విలన్? ఇంతకి ప్రియ(ఆండ్రియా)కి శివతో ఉన్న సంబంధం ఏంటి? మరల శివ, మైలా ఎలా ఒకటయ్యారు అనేది సినిమా కథ

ప్లస్ పాయింట్స్ :

సినిమాలో పాజిటివ్ పాయింట్స్ అంటే అది ఫీల్ గుడ్ తో నడిచే సింపుల్ అండ్ క్యూట్ లవ్ స్టొరీ. ఆ లవ్ స్టొరీ ఈ జెనరేషన్లో నిశ్చితార్ధం అయిన అమ్మాయి, అబ్బాయి మధ్య ఎలాంటి లవ్ స్టొరీ ట్రావెల్ అవుతుంది అనే విషయాన్ని ర్శకుడు ఉన్నది ఉన్నట్లు చూపించాడు . ఇక సినిమాకి కాస్త లైట్ వే లో ఇచ్చిన కామెడీ టచ్ కొంతమేర నవ్విస్తుంది.

నయనతార యధావిధిగా తనకు అలవాటైన పెర్ఫార్మెన్స్ తో మరోసారి ఆకట్టుకుంది. ఇక శింబుని తెలుగు ప్రేక్షకులు మాస్ రోల్ లో కాకుండా క్లాస్ రోల్ లో చూడటం మొదటిసారి. ఆ క్లాస్ పాత్రలో తన పరిధి మేరకు శింబు మెప్పించే ప్రయత్నం చేసాడు. ఇక ఆండ్రియా కూడా పాత్ర పరిధి మేర భాగా చేసింది. ఇక హీరో ఫ్రెండ్ గా చేసిన సత్యం రాజేష్ నవ్వించే ప్రయత్నం చేసాడు. మిగిలిన పాత్రదారులు కూడా ఎవరి పరిధి మేరకు వారు భాగానే ఆకట్టుకున్నారు.

మైనస్ పాయింట్స్ :

సినిమాలో మైనస్ పాయింట్స్  అంటే చాలా ఉంటాయి. అసలు కథే లేని సినిమాని రెండు గంటలు కాలక్షేపం చేయించడానికి అల్లుకున్న కథనం చాలా రొటీన్ గా ఉంటుంది. ఇలాంటి రొటీన్ కథనాలని తెలుగు ప్రేక్షకులు చూసి చూసి అలవాటు పడిపోయారు. సినిమా నిజానికి లవ్ స్టొరీ అయినా ఆ ఫీల్ ఎక్కడ కనిపించదు. దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ ని స్ట్రైట్ గా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చెప్పినా, అందులో గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేదు.

ఒక రొటీన్ కథకి, ఒక రొటీన్ కథనం తోడైతే సరసుడులాంటి సినిమా రిపీట్ అవుతుంది. కథలోనే కామెడీ పండించే ప్రయత్నం చేసినా అది పెద్దగా వర్కవుట్ అయినట్లు కనిపించదు. ఇక సినిమాలో సంతానంలాంటి కమెడియన్ ఉన్నా పెద్దగా అతని పాత్రకి స్కోప్ లేదు. సినిమా అంతా తమిళ ఫ్లేవర్ లో నడవడం వలన తెలుగు ప్రేక్షకులకి ఆ ఫీల్ సరిగా కనెక్ట్ కాదు. అసలు బలమైన కథ లేకుండా శింబు ఈ సినిమాని ఎలా ఒప్పుకున్నాడు అనేది అర్ధం కాని విషయం.

సాంకేతిక విభాగం:

టి. రాజేందర్ సొంత బ్యానర్లో ఈ సినిమాని తెరకెక్కించారు. ఉన్నంతలో నిర్మాణ విలువలు భాగానే ఉన్నాయి. ఇక దర్శకుడుగా పాండిరాజ్ సినిమా ద్వారా ఏ కోణంలో కూడా మెప్పించలేకపోయాడు. మ్యూజిక్ డైరెక్టర్ కథకి తగ్గ విధంగా బ్యాగ్రౌండ్ స్కోర్ భాగానే అందించాడు. పాటల్లో కూడా మ్యూజిక్ పర్వాలేదనే విధంగా ఉన్నా తమిళ బీట్ కి టి.రాజేందర్ రాసిన తెలుగు సాహిత్యం చెత్తగా ఉండటంతో పాటలు అంతగా ఆకట్టుకోవు.

సరసుడు సినిమాకి అన్నిటికంటే బెటర్ ఏదైనా ఉందంటే అది సినిమాటోగ్రఫీ మాత్రమే. ప్రతి ఫ్రేమ్ కలర్ఫుల్ గా కనిపించింది. ఇక ఎడిటింగ్ లో పెద్దగా కట్ చేయడానికి ఏమీ లేదు. సినిమాలో విషయం లేనపుడు, అన్ని సన్నివేశాలు ఒకేలా ఉన్నప్పుడు ఎడిటర్ చేయడానికి మాత్రం ఏముంటుంది.

తీర్పు:
‘సరసుడు’ సినిమా టైటిల్ కి, అసలు సినిమా కథకి పెద్దగా సంబంధం లేదు. సినిమాలో శింబు, నయనతార, ఆండ్రియా వాళ్ళ పాత్రల పరిధి మేరకు అందరు భాగానే చేశారు. అయితే విషయంలేని సినిమాలో ఎవరు ఎంత చేసినా ప్రయోజనం మాత్రం ఉండదు. ఈ మధ్య కాలంలో తెలుగులో వస్తున్న లవ్ స్టొరీ బేస్డ్ షార్ట్ ఫిలిమ్స్ కూడా ఈ సినిమా కంటే కొద్దిగా బెటర్ గానే ఉంటున్నాయి. ఓవరాల్ గా సినిమా షార్ట్ ఫిల్మ్ కథతో తీసిన ఫీచర్ ఫిల్మ్.

123telugu.com Rating : 2/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు