విడుదల తేది : 18 నవంబర్ 2011 | ||
123 తెలుగు .కామ్ రేటింగ్ : 2.5/5 | ||
దర్శకుడు : బి . చిన్నికృష్ణ | ||
నిర్మాత :ప్రకాష్ బాబు | ||
సంగిత డైరెక్టర్ : చక్రి | ||
తారాగణం : నిఖిల్ ,పూజ |
చిన్న బడ్జెట్ చిత్రాల కథానాయకుడు నిఖిల్ చాలా చిత్రాల్లో నటించినా విజయాల శాతం మాత్రం తక్కువే.
అతని తాజా చిత్రం వీడు తేడా తో మన ముందుకు వచ్చాడు. ప్రకాష్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి
చిన్ని క్రిష్ణ దర్శకత్వం వహించారు. నిఖిల్ కి జంటగా పూజ నటించింది.
కథ: కత్తి శీను (నిఖిల్) భాద్యతా రాహిత్యంగా తిరుగుతూ తిరుపతిలో తన బావ (కృష్ణ భగవాన్), అక్క (హేమ) దగ్గర ఉంటాడు.
తన ఫ్రెండ్ లవ్ కుమార్ (అలీ) కోసం భీమవరం వెళ్తాడు. అక్కడ మేఘ (పూజ) ని చూసి మొదటి చూపులోనే ప్రేమలో
పడతాడు. కానీ మేఘ మాత్రం అతని ప్రేమని అంగీకరించదు.
కథ ఇలా నడుస్తుండగా మేఘకి సంబందించిన గతం తెలుస్తుంది. డాన్ లిక్కర్ శంకర్ ( షాయాజీ షిండే) మరియు
జైలు ఖైదీ దాస్ ( సుమన్ ) తో మేఘ అన్వేషిస్తూ ఉంటారు. నిఖిల్ ఈ ఆపదల నుండి మేఘాన్ని కాపాడే ప్రయత్నం చేస్తాడు.
ఆ గూండాలు ఎందుకు మేఘన వెంట పడుతుంటారు, వారితో మేఘనకి సంబంధం ఏంటి అనేది మిగతా కథ …
ప్లస్ పాయింట్స్: ఈ చిత్రంలో నిఖిల్ ఎనర్జీ లెవెల్స్ బావున్నాయి. మొదటి పాటలో అతని డాన్సు ఆకట్టుకుంటుంది.
కొన్ని పంచ్ డైలాగులు బాగా పండించాడు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది “కొంత” అనే ఊత పదం బాగా పలికించాడు.
కామెడీ విషయానికి వస్తే యుగంధర్ గా రఘు బాబు మరియు పచ్చి పులుసు నాగేశ్వర్ రావు గా ఎం.ఎస్.నారాయణ
లవ్ కుమార్ గా అలీ పర్వాలేదనిపించారు. ఎం.ఎస్.నారాయణ తెలుగు సినిమా హీరోల మీద చేసిన స్పూఫ్ కొంత వరకు పండింది.
ఆయన మహేష్ బాబు యొక్క ఖలేజా పాత్రని మరియు పవన్ కళ్యాణ్ యొక్క కొమరం పులి పాత్రకి చేసిన స్పూఫ్
కడుపుబ్బ నవ్విస్తుంది. హేమ మరియు వేణు మాధవ్ చిన్న పాత్రల్లో పర్వాలేదనిపించారు.
మైనస్ పాయింట్స్: ఈ చిత్రానికి పూజ పెద్ద మైనస్, ఆమె చూడటానికి అందంగా లేదు మరియు అస్సలు ఎలా నటించాలో కూడా తెలీదు.
చెడు సంభాషణలు, వెకిలి కామెడీ నటుల వల్ల వృధా అయ్యాయి. నిఖిల్ కొన్ని సంబాషణలు పరవాలేదనిపించిన అవి
వృధా చేసారు. స్క్రిప్ట్ లో చాలా లోపాలు ఉన్నాయి మరియు చిత్ర రెండవ భాగంలో లాజిక్ లేకుండా సాగుతుంది.
కామెడీ బాగా వచ్చి ఉంటె, పైన చెప్పిన లోపాలు అన్ని మర్చిపోవచ్చు. కొన్ని కామెడీ సన్నివేశాలు మినహా
మిగతా సన్నివేశాలు చూడడం కూడా వృధా. అబ్బాయ్ రాజు గా చేసిన మాస్టర్ భరత్, బ్రహ్మానందం పాత్రలు
వృధా అయ్యాయి. బ్రహ్మానందంతో చేయించిన “బనానా బాబా” పాత్రా మరీ హీనంగా ఉంది. గ్రేసీ సింగ్
పాత్ర కూడా అస్సలు బాలేదు.
కృష్ణ భగవాన్ నటన చూసాక మంచి మీకు అతనిపై మంచి అభిప్రాయం కలుగుతుంది. కానీ అతను ఈ పాత్ర అంగీకరించడం విచారకరం.
చిత్ర మొదటి భాగం నెమ్మదిగా సాగుతూ సహనాన్ని పరీక్షిస్తుంది. రెండవ భాగంలో వేగంగా సాగినా వెర్రి కామెడీ వలన వృధా ఐపాయింది.
సాంకేతిక విభాగం: చిత్రీకరణ పర్వాలేదు. నిర్మాణ విలువలు ఈ చిత్రానికి తగ్గట్టుగా ఉన్నాయి. చిన్ని కృష్ణ దర్శకత్వం పేలవంగా ఉంది.
ఇంకా బాగా చేయాల్సింది. చక్రి మ్యూజిక్ పర్వాలేదు. ఎడిటింగ్ కూడా అస్సలు బాగాలేదు.
సంబాషణలు చిత్రానికి బాగా మైనస్ కొన్ని సంబాషలు మళ్ళి మళ్ళి పలికించారు.
ఈ చిత్రం చూడకుండా వదిలేయడం చాల మంచిది. ఎం.ఎస్.నారాయణ, రఘు బాబు కామెడీ లేకపోతే ఘోరంగా ఫ్లాప్ అయ్యేదే.
ధియేటర్ వెళ్లి చూసేంత అంశాలు ఏమి లేవు.
అశోక్ రెడ్డి . ఎం
123Telugu.com రేటింగ్: 2.5 / 5