విడుదల తేదీ : 26 October 2011 | ||
రేటింగ్ : 3/5 | ||
దర్శకుడు : ఎ ఆర్. మురుగదాస్ | ||
నిర్మాత : బి సుబ్రహ్మణ్యం | ||
సంగీత దర్శకుడు : హారిస్ జయరాజ్ | ||
పాత్రలు : సూర్య, శృతి హాసన్, అభినయ |
మురుగదాస్ – సూర్య ‘గజని’ సినిమాతో బాక్స్ ఆఫీసు చరిత్రను తిరగరాశారు. ఆ చిత్రం సూర్యను రాత్రికి రాత్రే యావత్ భారతదేశం లోనే ఒక ప్రముఖ నటుడిగా చేసింది. కాగా, మళ్లీ అదే కాంబినేషన్ తో ఒక భారీ బడ్జెట్ యాక్షన్ మూవీ వస్తుందంటే అందరి అంచనాలు సహజంగానే ఆకాశాన్ని అంటుతాయి. ఈ సమీకరణానికి శృతి హాసన్ సౌందర్యం తోడవటం మరింత హైప్ క్రియేట్ అయింది. ఈ చిత్రం నేడు ఆంధ్రప్రదేశ్ అంతటా భారీగా విడుదల అయింది. ఆ చిత్ర తీరు తెన్నులు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
కథ : ఈ చిత్రం ప్రధానంగా సర్కస్ కళాకారుడైన అరవింద్ (సూర్య), ప్రతిభావంతురాలైన సైన్స్ స్టూడెంట్ శుభ (శ్రుతి హాసన్) చుట్టూ తిరుగుతుంది. అరవింద్.. శుభను పిచ్చిగా ప్రేమిస్తాడు. అయితే అంతలోనే తేరుకొని తానో క్రీడాలో భాగమేనని తెలుసుకుంటాడు. అరవింద్ కు, భారతదేశపు ఒక పురాతన రాజుకు సంబంధం ఉంటుంది. ఆరాజుకు మార్షల్ ఆర్ట్స్, వైద్యం, మనస్తత్వ శాస్త్రాల్లో అపారమైన జ్ఞానం ఉండేది. అతని చైనా ప్రయాణంలో అక్కడి ప్రాంత ప్రజల మన్ననలను పొంది, మహానుభావుడిగా కీర్తి ప్రతిష్టలు పొందుతాడు.
ఇదిలా ఉంటే, భారత దేశాన్ని అస్థిరపరిచే కుట్ర (ఆపరేషన్ రెడ్) లో భాగంగా చైనీయులతో నియమితుడైన ఏజంట్.. డాంగ్ లీ (జానీ గుయెన్). ఇతనితో అరవింద్, శుభల జీవితాలు ముడిపడి ఉంటాయి. పురాతన రాజు బోధి కు అరవింద్ కు మధ్యగల సారూప్యతను శుభ తన పరిశోధనలో కనుగొంటుంది., ఆపరేషన్ రెడ్ ఏమవుతుంది..?, అరవింద్.. డాంగ్ లీ ని ఆపగాలిగాడా..? తదితర విషయాలు తెరపై చూడాల్సిందే.
ఇవి బాగున్నాయి : ఒక చారిత్రాత్మక పురాతన రాజుగా సూర్య నటన, చైనా లో చిత్రీకరించిన సన్నివేశాలు మొదటి 20-25 నిమిషాల పాటు అద్భుతంగా ఉన్నాయి. ఏ తరహా పాత్రలోనైనా జీవించగలిగే ఒక నటుడిగా సూర్య మెప్పించాడు. అతని శరీరాకృతి, భాష, అభినయం చూడటానికి కనుల విందుగా ఉంటాయి.
జానీ గుయెన్.. చైనీస్ ఏజంట్ డాంగ్ లీ గా అద్భుతంగా నటించాడు. అతని యుద్ధ కళలు, కనికరంలేని పరాక్రమం అబ్బుర పరుస్తాయి. శృతి హాసన్ గ్లామరస్ గా కనిపించి నప్పటికినీ, శాస్త్రవేత్త గా ఆమె నటన సుమారుగా ఉంది. ఈ సినిమాలో సైకాలజీ, హిప్నాటిజం, డిఎన్ఎ సీక్వెన్స్ తదితర అంశాలు చాల ఆశక్తికరంగా ఉన్నాయి. పట్టణ ప్రేక్షకులకు ఈ మూవీ నచ్చుతుంది.
కథ అనుకోని మలుపులు తిరగటమే కాక గొప్ప అనుభూతి కలిగిస్తుంది. కొన్ని యాక్షన్ సీక్వెన్స్ చాల బాగా పండాయి.
ఇవి బాగులేవు : మంచి సబ్జక్ట్ కు అనవసరంగా మురుగదాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ చొప్పించాలని చూడటం బాలేదు. సూర్య – శ్రుతి ల రొమాంటిక్ ట్రాక్ అసంతృప్తిగా ఉంది. వీరి లవ్ స్టొరీ విషయంలోనూ, సూర్యను సర్కస్ కళాకారుడిగా చూపించటంలోనూ చాలా సమయం వృధా అయింది. దీని ప్రభావం క్లై మాక్స్ పై పడింది.
సెకండ్ హాఫ్ లో కొన్ని స్పెషల్ ఎఫెక్ట్స్ సిల్లిగా అనిపించాయి. SFX పని తీరు పిల్ల చేష్టలు మాదిరి సాగింది. చిత్ర విజయానికి సాంగ్స్ ఏమాత్రం దోహదం చేసేలా లేవు. కొన్ని సమయాల్లో స్టొరీ సాగే తీరు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది.
సినిమా ద్వితీయార్థం లో వచ్చే సన్నివేశాలు వాస్తవానికి ఏమాత్రం దగ్గరగా ఉండవు. ఇవి ప్రేక్షకులను చాలా నిరాశ పరిచాయి.
సాంకేతిక విభాగాలు : సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే కానీ, మ్యూజిక్ పెద్ద నిరాశ మిగిల్చింది. SFX , CGI పనితనం కొన్ని చోట్ల అద్భుతంగా, కొన్ని చోట్ల దారుణంగా ఉంది. ఎడిటింగ్ ఏవరేజ్.
ఇక్కడ యాక్షన్ సీక్వెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొన్ని మహాద్భుతంగా ఉంటే, మరికొన్ని పరమ రోత పుట్టించేలా ఉండటం విశేషం.
తీర్పు : 7న్త్ సెన్స్ ఒక బ్రిలియంట్ మూవీ. పవర్ ఫుల్ పాత్రలుకు వీలున్న ఒక మంచి కాన్సెప్ట్ సినిమా. అయితే, అత్యంత పేలవంగా ఉన్న స్క్రీన్ ప్లే, వేస్ట్ గా చొప్పించిన కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ చిత్రానికి విజయానికి ముఖ్య ప్రతిబంధకాలు. సెకండ్ హాఫ్ చాలా బోరింగ్ గా సాగుతుంది. మొదటి 20 నిమిషాల కంటెంట్ మాత్రం చాలా బాగుంది. ఈ చిత్రం సూర్య అభిమానులకు నచ్చాలితప్ప, మిగతా వారికి ఎంత త్వరగా ఇంటికి పోదామా అనిపిస్తుంది.
– నారాయణ ఎ.వి