సమీక్ష : ప్రేమిక – నిరుత్సాహ పరిచే ప్రేమకథ

సమీక్ష : ప్రేమిక – నిరుత్సాహ పరిచే ప్రేమకథ

Published on Dec 8, 2017 8:30 PM IST
Premika movie review

విడుదల తేదీ : డిసెంబర్ 08, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

దర్శకత్వం : మహీంద్ర

నిర్మాత : దేశాల లక్ష్మయ్య

సంగీతం : దిలీప్ బండారి

నటీనటులు : తనిష్, శ్రుతి యుగళ్

తనీష్ నటించిన ‘ప్రేమిక’ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నూతన దర్శకుడు మహీంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో తనీష్ ప్రేక్షకులను ఎంతమాత్రం అలరించారో చూద్దాం.

కథ:

కృష్ణ (తనీష్) పల్లెటూరు కుర్రాడు. తులసి (శ్రుతి యుగళ్)ను చూసి ఇష్టపడుతాడు. కొంతకాలం తరువాత తులసి కూడా కృష్ణను ప్రేమించడం మొదలుపెడుతుంది. ఇలా కొంతకాలం జరిగాక ఆ ఊరు సర్పంచ్ తమ్ముడు కృష్ణ చేతిలో చనిపోతాడు. ఆ విషయం గరహించిన సర్పంచ్ తన తమ్ముడి చావుకు కారణం అయిన కృష్ణ పై పగ పెంచుకుంటాడు. అంతేకాక కృష్ణ ప్రేమించిన అమ్మాయి తులసిని కృష్ణకు దూరం చేద్దాం అనుకుంటాడు. కృష్ణ సర్పంచ్ తమ్ముణ్ణి ఎందుకు చంపాడు ? తులసి కృష్ణ చివరికి ఒక్కటి అయ్యారా ? అన్నది మిగిలిన కథాంశం.

ప్లస్ పాయింట్స్ :

తనీష్ ప్రేమికుడిగా, పల్లెటూరు కుర్రాడిగా బాగా నటించాడు. కొత్త హీరోయిన్ శృతి యుగళ్ తెలుగు సాంప్రదాయ దుస్తుల్లో స్క్రీన్ మీద అందంగా కనిపించింది. డైరెక్టర్ మహీంద్ర ఎంచుకున్న లవ్ స్టొరీలో సోల్ బాగుంది . పల్లెటూర్లలో జరిగే ప్రేమకథల్ని కళ్ళకు కడుతూ అందంగా చూపించారు.

ప్రేమలో పగలు, ప్రతీకారాలు, ఆధిపత్య పోరు, పెద్దరికం వంటి అంశాలను క్షుణ్ణంగా చూపించడం జరిగింది. హీరో అన్న ప్రేమించిన అమ్మాయితో ఇంటికి వస్తే వాళ్లిద్దరిని బయటికి వెళ్లి బ్రతకమని తల్లి తన గాజులు ఇవ్వడం వంటి ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి.

మైనస్ పాయింట్స్:

మొదటి సగం భాగం కథ పెద్దగా లేకపోవడం వల్ల కొంత వరకు బోరు కొడుతోంది. డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ బాగుంది కానీ చెప్పిన విధానం చాలా నెమ్మదిగా ఉంది. లవ్ స్టోరీలో పాటలు బాగుండాలి కానీ ఈ సినిమాలో సాంగ్స్ అస్సలు ఆకట్టుకోలేదు. హీరో హీరోయిన్ల మధ్య సన్నివేశాలను పెంచి ఉంటే బాగుండేది.

ఇద్దరు లవ్ లో ఉన్నప్పుడు వారు కలిసి తిరగడం మాట్లాడుకోవడం వంటి సీన్స్ రాసుకొని ఉంటే బాగుండేది. గ్రామ సర్పంచ్, అతను చేసే అరాచకాలు కొంత ఎక్కువైనట్టు అనిపిస్తాయి. ఇక ఫన్ కోసం కథలోకి జొప్పించిన కామెడీ పెద్దగా వర్కువుట్ కాలేదు.

ఫస్టాఫ్ అసలే కథ లేదని అనుకుంటుంటే సంబంధం లేని సన్నివేశాలు కథలోకి జొరబడి చికాకును పెట్టిస్తాయి. సాగదీయబడిన సినిమా క్లైమాక్స్ కూడా కొంత వరకు బోర్ కొట్టించింది.

సాంకేతిక వర్గం:

పల్లెటూరు ప్రేమకథను తెరమీద చూపించడంలో కొంతవరకు సఫలం సాధించిన దర్శకుడు మహీంద్ర దాన్ని ప్రభావంతంగా భువోయించడంలో విఫలమయ్యాడు. అనవసరమైన సీన్లను పక్కనబెట్టి కథకు ఉపయోగపడే సీన్లను రాసుకుని ఉంటే బాగుండేది.

దిలీప్ బండారి అందించిన సాంగ్స్ కంటే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పల్లె అందాలను బాగా చూపించారు కెమెరా మెన్. సినిమా నిడివి ఎక్కువగా ఉంది, రెండోసగం అంత అవసరం లేకుండా కట్ చేసి ఉంటే బాగుండేది. తక్కువ బడ్జెట్ లోనే సినిమా తీసినా నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు:

ప్రేక్షకులు కొత్తదనం కోరుకునే రోజులివి. పాత ప్రేమ కథలు, పాత సన్నివేశాలు చూపిస్తే జనాలకు నచ్చదు. ఈ సినిమాలో అలానే జరిగింది. చిత్రంలో బలమైన స్క్రీన్ ప్లే లేనందున తరువాత జరగబోయే సన్నివేశాలు ప్రేక్షకులు సులభంగా ఊహించవచ్చు. విలేజ్ బ్యాక్ డ్రాప్లో సినిమా నడవడం అనే పాయింట్ మినహా ఈ సినిమాలో ఎంజాయ్ చేయడానికి పెద్దగా ఏమీ దొరకదు. కొత్త రకం ప్రేమ కథని కోరుకుని ‘ప్రేమి’క సినిమాకు వెళ్ళితే నిరాశ తప్పదు. అలా కాకుండా ఏదో విధంగా కాలక్షేపం చేద్దాం అనుకుంటే ఒకసారి ఈ సినిమాను ట్రై చెయ్యవచ్చు.

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team

సంబంధిత సమాచారం

తాజా వార్తలు