విడుదల తేదీ : ఫిబ్రవరి 16, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : సందీప్ కిషన్, అమైర దస్తూర్, త్రిదా చౌదరి, అదిత్
దర్శకత్వం : మంజుల
నిర్మాత : జెమిని కిరణ్, సంజెయ్ స్వరూప్
సంగీతం : రాధన్
సినిమాటోగ్రఫర్ : రవి యాదవ్
ఎడిటర్ : సతీష్ సూర్య
కథ:
సూరజ్ (సందీప్ కిషన్ ) నిత్య (ఆమెరా దస్తూర్) చిన్నప్పటి నుండి మంచి ఫ్రెండ్స్ గా ఉంటారు. ఒకరోజు వీరిద్దరికి పెళ్ళి చెయ్యాలని నిర్ణయిస్తారు కుటుంబ సభ్యులు. ఆ పెళ్ళి ఇష్టం లేని వీరిద్దరు గోవా పారిపోతారు. అక్కడ వీరిద్దరికి (త్రిదా చౌదరి) లిఖిత పరిచయమవుతుంది. కొంత కాలానికి లిఖిత, సూరజ్ క్లోజ్ ఫ్రెండ్స్ అవుతారు. నిత్య, సూరజ్ ను ఇష్టపడుతుంది. ఆ తరువాత ఏం జరిగింది ? సూరజ్, నిత్య ప్రేమ ఫలించిందా ? లిఖిత, సూరజ్ మధ్య ప్రేమ ఎంతవరకు వచ్చింది ? తెలుసుకోవాలనుకుంటే ‘మనసుకు నచ్చింది’ చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
సినిమాలో డీటైలింగ్ బాగుంది. ప్రతి ఫ్రేమ్ చాలా ఫ్రెష్ గా ఉంది. దీంతో సినిమా మొత్తం మంచి క్వాలిటీతో నిండి చూడ్డానికి అందంగా కనిపించింది. సందీప్ కిషన్ నటన బాగుంది. తన పాత్రకు తాను న్యాయం చేశాడు. హీరోయిన్ అమైరా దస్తూర్ కూడ తన పాత్రకు న్యాయం చేసేలా పెర్ఫార్మ్ చేసింది.
ద్వితీయార్థంలోని ఎమోషనల్ సీన్లలో ఆమె నటన బాగుంది. సందీప్ కిషన్, రెజినాల మధ్య కెమిస్ట్రీ కూడ బాగా కుదిరింది. వీరిద్దరి మధ్యన సన్నివేశాలు కొన్ని యువతకు కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. నటుడు అదిత్ అర్జున్ చేసింది చిన్న పాత్రే అయినా బాగుంది. రాధన్ సంగీతం చాలా బాగా కుదిరింది. కీలకైమన సన్నివేశాలకు బలం చేకూర్చేలా ఉంది. సినిమా ద్వితీయార్థం మొదటి అర్ధభాగం కన్నా బెటర్ గా ఉంది.
మైనస్ పాయింట్స్:
హీరో హీరోయిన్లు ఇద్దరూ చిన్నప్పటి నుండి స్నేహంగా ఉండి చివరికి ప్రేమలో పడటం, ఆ ప్రేమను తెలుసుకోవడం అనే అంశాలు చాలా పాతవి, చాలా సినిమాల్లో చూసినవే కాబట్టి కొత్తగా అనిపించవు. సినిమాలో ప్రకృతి గురించి ఎక్కువగా చెప్పడం, మనిషి దానికి ఎలా కనెక్ట్ అవ్వాలో చూపడం వలన సినిమాలో అసలైన ప్రేమ కథ మరుగునపడిపోయి చప్పగా తయారైంది.
హీరో, హీరోయిన్ మధ్యన జరిగే కొన్ని రొమాంటిక్ సీన్స్ తప్ప మిగతా సన్నివేశాలెవీ కొత్తగా లేవు. ప్రియదర్శి లాంటి ట్రెండింగ్ కమెడియన్ సినిమాలో ఉన్నా పెద్దగా ఎంటర్టైన్మెంట్ దొరకలేదు. హీరోయిన్స్ ఇద్దరు ఉన్నా వారిలో ఏ ఒక్కరికీ సరైన ప్రాధాన్యం లేకపోవడంతో చిత్రం బలహీనంగా తయారైంది. సందీప్ కిషన్ నటన బాగానే ఉన్నా అతని పాత్రలో క్లారిటీ లోపించింది. అతని పాత్ర ప్రేమను రియలైజ్ అవ్వడమనే కీలమైన అంశం చాలా సిల్లీగా ఉంటుంది. అసలు కొన్ని సన్నివేశాల్లో అతనెందుకు ఉంటాడో కూడ అర్థం కాదు.
సాంకేతిక వర్గం:
సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. ముఖ్యంగా రవి యాదవ్ సినిమాటోగ్రఫీ విజువల్స్ ను రీఫ్రెషింగా తయారుచేసింది. గోవాలో చిత్రీకరించిన సన్నివేశాలు బాగున్నాయి. డైలాగ్స్ బాగానే ఉన్నాయి. ఎడిటింగ్ పర్వాలేదు. మొదటి అర్ధభాగం కొన్ని సన్నివేశాలని ట్రిమ్ చేసి ఉండాల్సింది. సంగీతం పర్వాలేదు.
డైరెక్టర్ మంజుల విషయానికొస్తే ప్రేమికులిద్దరినీ ప్రకృతితో కనెక్ట్ చేసి దానితో మనుషులు ఎలా మమేకమవ్వాలో చూపించాలనే ఆమె ఆలోచన బాగానే ఉన్నా తెరపై ఎగ్జిక్యూషన్ ఇంకాస్త బెటర్ గా ఉండాల్సింది. సినిమాను మొదలుపెట్టిన విధానం, మలుపులు అన్నీ సర్వ సాధారణంగానే ఉన్నాయి. డ్రామా, రొమాన్స్ కు మంచి అవకాశమే ఉన్నా వాటిని పండించలేకపోయారామె. చిత్ర నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
తీర్పు:
మొత్తం మీద ఈ ‘మనసుకు నచ్చింది’ మనం చూసిన చాలా పాత సినిమాల్లానే రొటీన్ గానే ఉంటుంది. మంచి విజువల్స్, ద్వితీయార్థంలో లవ్ ఫైల్యూర్ సీన్స్ మెప్పించే అంశాలు కాగా హీరో హీరోయిన్ల మధ్యన బాండింగ్ సరిగా లేకపోవడం ఒక మోస్తారుగా మాత్రమే ఉన్న స్క్రీన్ ప్లే నిరుత్సాహపరుస్తాయి. ప్రేమ కథల్ని ఎక్కువగా ఇష్టపడే కొన్ని మనసులకి ఈ చిత్రం ఓకే అనిపించవచ్చేమో కానీ మిగతా వారిని మెప్పించదు.
123telugu.com Rating : 2.75/5
Reviewed by 123telugu Team