సమీక్ష : కోటికొక్కడు – నిరాశ మిగిల్చాడు

సమీక్ష : కోటికొక్కడు – నిరాశ మిగిల్చాడు

Published on Mar 10, 2018 1:05 AM IST
Kotikokkadu movie review

విడుదల తేదీ : మార్చి 09, 2018

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు : సుదీప్‌, నిత్యమీనన్‌

దర్శకత్వం : కె.ఎస్. రవికుమార్

నిర్మాత : కళ్యాణ్‌ ధూళిపాళ్ల

సంగీతం : డి. ఇమాన్

సినిమాటోగ్రఫర్ : రాజారత్నం

ఎడిటర్ : ప్రవీణ్‌ ఆంటోని

సత్యం (సుదీప్) వ్యక్తిగతంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ నిజాయితీగా ఉంటాడు. అచ్చు అతనిలాగే ఉండే అతని సోదరుడు శివం మాత్రం పెద్ద వ్యాపారస్తుల దగ్గరనుండి నల్ల ధనాన్ని దొంగలిస్తూ ఎవ్వరికి పట్టుబడకుండా ఉంటాడు.

కానీ దొంతనాలు చేసేది శివం కాదని సత్యమేనని అనుమానించిన వారందరికీ శివం తన అన్నయ్య అని అతని వల్ల తను ఇబ్బందులు పాలవుతున్నాడని సత్యం చెబుతూ ఉంటాడు. మరోవైపు వీరు ఇద్దరు కాదని ఒకడేనని అసిస్టెంట్ కమిషనర్ (రవి శంకర్) నిరూపించాలని ప్రయత్నం చేస్తుంటాడు. ఇలాంటి గందరగోళంలో చివరికి ఏం జరిగిందనేది తెలుసుకోవాలంటే ‘కోటికొక్కడు’ సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

హీరో సుదీప్ రెండు విభిన్న పాత్రల్లో నటించాడు. డిఫరెంట్ వేరియేషన్స్ లో అతని నటన బాగుంది. అదే సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ అయింది. హీరోయిన్ నిత్య మీనన్ నటన గురించి ప్రేత్యేకంగా చెప్పనవసరం లేదు. హీరో ప్రేమికురాలిగా ఆమె నటన ఆకట్టుకుంది. అసిస్టెంట్ కమీషనర్ పాత్రలో రవి శంకర్ బాగా చేసాడు.

ఈ సినిమాలో ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్‌లో ఎపిసోడ్ బాగుంది. అందులో వచ్చే తండ్రి కొడుకుల ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఉన్న సన్నివేశాలు బాగానే రక్తి కట్టాయి. తెరపై ఆయన కనిపించినంతసేపు సినిమా పరువాలేదనిపిస్తుంది.

మైనస్ పాయింట్స్ :

కథ పర్వాలేదనిపించినా ఆ కథను చెప్పే విధానం మాత్రం స్లోగా ఉండడంతో ప్రేక్షకులకు బోర్ ఫీలవుతారు. సుదీప్ దొంగలా నటిస్తూ పబ్లిక్ మరియు పోలీస్ లను నమ్మించే సన్నివేశాల్లో బలం లేకపోవడంతో నమ్మశక్యంగా లేవు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ తప్ప సినిమా మొత్తం నీరసంగా సాగడం పెద్ద బలహీనత.

సినిమా మొత్తం పాత ఫార్మాట్లోనే ఉంటుంది. అందుకే ప్రెజెంట్ జనరేషన్ కు ఈ మూవీ నచ్చకపోవచ్చు. ‘కోటిగొప్ప’ పేరుతో తమిళ్ లో 2016 లో విడుదలైన ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. అదే సీన్ తెలుగులో కూడ రిపీట్ అయ్యిందని చెప్పుకోవచ్చు. క్లైమాక్స్ కూడా ఆసక్తికరంగా లేకపోవడంతో సినిమా తేలిపోయింది.

సాంకేతిక విభాగం:

డి. ఇమ్మాన్‌ సంగీతం పరువాలేదు. ముఖ్యంగా నైపథ్య సంగీతం బాగుంది. శశాంక్ వెన్నెలకంటి రాసిన మాటలు బాగున్నాయి. హీరో, పోలీస్ ఆఫీసర్ మద్య వచ్చే సన్నివేశాల్లోని డైలాగ్స్ ఆలోచింపచేసాయి. రాజారత్నం అందించిన కెమెరా వర్క్ బాగుంది. ప్రవీణ్ అంథోని ఫస్ట్ హాఫ్ లో చాలా సన్నివేశాలు కత్తరించి రెండవ సగంలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ నిడివి పెంచి ఉంటే బాగుండేది.

కనల్‌కణ్ణన్‌ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపోసోడ్స్ పరువాలేదు. గతంలో ఎన్నో ఎమోషనల్ సినిమాల్ని తీసి మెప్పించిన దర్శకుడు కె. ఎస్. రవికుమార్ ఈ చిత్రంలో ఆ ఎమోషన్ ప్రేక్షకులకి కనెక్టయ్యేలా చేయలేకపోయారు. స్టోరీ లైన్ ఓకే అనేలా ఉన్నా బలమైన సన్నివేశాలు లేకపోవడం ఇందుకు కారణం.

తీర్పు:

‘కోటికొక్కడు’ సినిమా కథ ఏమంత గొప్పగా లేదు. కనీసం కథనం అయిన బాగుంటే సినిమా ప్రేక్షకులకు కొంతైనా నచ్చే అవకాశం ఉంది కాని ఈ సినిమా మొత్తం నిధానంగానే ఉండడంతో చూస్తున్న ప్రేక్షకులకు కూడ నీరసం తప్పదు. సినిమా మొత్తంలో ఒక్క ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తప్ప వేరే ఆకట్టుకునే అంశాలేవీ ఉండవు. మొత్తం మీద కొత్తదనం కోరుకొనే వారికి ఈ సినిమా నిరాశనే మిగులుస్తుంది.

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team

Click Here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు