సమీక్ష : ఝాన్సీ – అక్కడక్కడ బాగుంది

సమీక్ష : ఝాన్సీ – అక్కడక్కడ బాగుంది

Published on Aug 18, 2018 3:00 AM IST
 Geetha Govindam movie review

విడుదల తేదీ : ఆగష్టు 17, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : జ్యోతిక, జీవి ప్రకాష్

దర్శకత్వం : బాలా

నిర్మాతలు : కోనేరు కల్పన

సంగీతం : ఇళయరాజా

సినిమాటోగ్రఫర్ : తేని ఈశ్వర్

స్క్రీన్ ప్లే : బాలా

ఎడిటర్ : సతీష్ సూర్య

 

వైవిధ్యమైన దర్శకుడు బాల దర్శకత్వంలో జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన తమిళ సినిమా ‘నాచియార్’. కాగా ఈ చిత్రం ఈ రోజు ‘ఝాన్సీ’ పేరుతో తెలుగులో రిలీజ్ అయింది. డి.అభిరాం, కోనేరు కల్పన ‘కల్పనా చిత్ర మరియు యశ్వంత్ మూవీస్ పతాకాల’ పై సంయుక్తంగా ఝాన్సీ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ:

ఝాన్సీ (జ్యోతిక) ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్. వెరీ స్ట్రేట్ ఫార్వర్డ్, ఆమె విచారణ చేసే విధానం కూడా వెరీ వైలెంట్ గా ఉంటుంది. తన పై ఆఫీసర్స్ ను కేర్ చెయ్యదు. కాగా ఝాన్సీ తన ఫ్యామిలీతో కలిసి విదేశీ పర్యటనకు బయలుదేరే సమయంలో మైనర్ బాలిక ప్రగ్నన్సీ కేసులో ఉన్న రాశి (ఇవాన) జాడ తెలుస్తోంది. ఆమెను కస్టడీలోకి తీసుకోని ఆ కేసులో భాగంగా రాశి ప్రగ్నన్సీకి కారణమైన గాలి రాజు (జివి ప్రకాష్ )ని అరెస్ట్ చేసి ఇన్వెస్ట్ గేట్ చేయగా అటు రాశి, ఇటు గాలి రాజు ఇద్దరూ మేం ప్రేమించుకున్నామని ప్రగ్నన్సీకి మేం ఇద్దరం కారణమని అంగీకరిస్తారు. కానీ ఝాన్సీకి రాజు ‘డి.ఎన్.ఏ’కి, రాశికి పుట్టిన బిడ్డ ‘డి.ఎన్.ఏ’కు అసలు మ్యాచ్ కావట్లేదు అని తెలుస్తోంది.

మరి రాశి బిడ్డకు తండ్రి ఎవరు ? అసలు రాశికి కూడా తెలియకుండా జరిగిన ఆ సంఘంటన ఏమిటి ? అని ఝాన్సీ విచారణ మొదలు పెడుతుంది. ఆ క్రమంలో ఝాన్సీ రాశి బిడ్డ తండ్రిని పట్టుకుంటుందా ? రాశిని సిన్సీయర్ గా ప్రేమించిన రాజుకు ఈ విషయం తెలుస్తుందా ? చివరకి రాశి, రాజు కలుస్తారా ? ఝాన్సీ, రాశి ప్రగ్నన్సీకి కారణమైన వ్యక్తిని ఎలా పట్టుకుంది ? అతన్ని ఎలా శిక్షించింది ? లాంటి విషయాలు తెలయాలంటే ఝాన్సీ చిత్రం చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

ఈ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర‌లో నటించిన జ్యోతిక తన టెర్రిఫిక్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటారు. ఆమె అగ్రెసీవ్ బాడీ లాంగ్వేజ్, డామినేట్ చేసే ఆమె మాడ్యులేషన్ ఆమె పాత్రకు ఫర్ఫెక్ట్ గా సరిపోయాయి. మైనర్ బాలికగా నటించిన ఇవాన చాలా బాగా నటించింది. చిన్న చిన్న ఎక్స్ ప్రెషన్స్ తోనే భావోద్వేగ సన్నివేశాలను కూడా చాలా చక్కగా పడించింది.

ఇక బస్తీ కుర్రాడి పాత్రలో కనిపించిన యంగ్ హీరో జివి.ప్ర‌కాష్ ఆ పాత్రకు తగ్గట్లే తన లుక్స్ ను తన ఫిజిక్ ను చాలా బాగా మార్చుకున్నాడు. ఓ అమాయకపు సిన్సియర్ లవర్ గా తన నటనతో ఆకట్టుకుంటూ తన పాత్రకు పూర్తి న్యాయం చేస్తూ ఈ చిత్రానికి స్పెషల్ ఎట్రాక్షన్ లా నిలిచాడు.

మొదటిసారిగా నటించిన ప్రముఖ ప్రొడ్యూసర్ రాక్ లైన్ వెంకటేష్ కూడా తన నటనతో ఆకట్టుకున్నే ప్రయత్నం చేశారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా రాశి ప్రగ్నన్సీకి కారణమైన పాత్రలో నటించిన వ్యక్తి బాగా నటించాడు.

దర్శకుడు బాలా రాసిన ఈ చిత్ర కథ కూడా ఆకట్టుకుంటుంది. సినిమాలోని కొన్ని సంఘటనలు సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలను గుర్తుకు తెస్తాయి.

మైనస్ పాయింట్స్ :

వైవిధ్యమైన దర్శకుడిగా మంచి పేరు ఉన్న బాలా మంచి కథ రాసుకున్నప్పటికీ ఆసక్తికరమైన కథనంతో సినిమాని ఇంట్రెస్టింగ్ గా మలచలేకపోయారు. అక్కడక్కడ స్లోగా నడిచే సన్నివేశాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.

పైగా ఈ ఝాన్సీ చిత్రం చూస్తున్నంత సేపు తమిళ నేటివిటినే గుర్తుకొస్తొంది. సినిమాలోని నేపధ్యానికి ప్రతి పాత్రకు తెలుగు పేర్లే పెట్టి రిజిస్టర్ అయ్యే విధంగా పలికించనప్పటికీ సినిమా నిండా ఎక్కువమంది తమిళ ఆర్టిస్టులే ఉండటంతో, సినిమాలో చాలా చోట్ల అరవ వాసనలు తగలడంతో సినిమా చూస్తున్నంత సేపు తమిళ సినిమాను చూస్తున్నట్లే ఉంటుంది.

సినిమా మెయిన్ గా మాస్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యే జోనర్ అయినప్పటికీ దర్శకుడు బాలా మాత్రం అక్కడక్కడ ఆకట్టుకున్నే ఎమోషనల్ సన్నివేశాలు తప్ప, మిగిలిన భాగం అంతా సింపుల్ గానే నడిపించారు. ఓ అమ్మాయికి ప్రగ్నన్సీకి కారణం ఎవరని కరెక్ట్ గా ఆ అమ్మాయికి కూడా తెలియదు. మరి ఎవరు అని ఇన్విస్టిగేట్ చేసే క్రమం పెరిగే కొద్ది చాలా ఆసక్తికరంగా ఉత్కంఠభరితంగా ఉండాలి. కానీ ఈ చిత్రంలో చాలా తేలికపాటి ఇన్విస్టిగేషన్ తోనే ముగించడం అంతగా రుచించదు.

సాంకేతిక విభాగం:

దర్శకుడు బాల ఓ మంచి స్టోరీ ఐడియా తీసుకున్నారు గాని, ఆ ఐడియాకు తగ్గట్టు అంతే కొత్తగా ట్రీట్మెంట్ మాత్రం రాసుకోలేదు. సినిమాలో సప్సెన్స్ ఇంట్రస్ట్ పెంచే స్కోప్ ఉన్నప్పటికీ బాలా మాత్రం సెకెండ్ హాఫ్ ని సింపుల్ గా హ్యాండల్ చేశారు. మ్యూజిక్ విష‌యానికి వ‌స్తే… మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా అందించిన సంగీతం అయన స్థాయికి తగ్గట్టు లేదు. కానీ ఆయన అందించిన నేపధ్య సంగీతం అక్కడక్కడ పర్వాలేదనిపిస్తోంది.

సినిమాటోగ్రఫర్ తేని ఈశ్వర్ కెమెరా పనితనం బాగుంది. సినిమా మూడ్ కి అనుగుణంగా అయన దృశ్యాలని తెరకెక్కించారు. సతీష్ సూర్య ఎడిటింగ్ బాగున్నప్పటికీ కథకు అవసరం లేని సీన్స్ ను ట్రీమ్ చేసి ఉంటే బాగుండేది. ఇక సినిమాలోని నిర్మాతలు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి.

తీర్పు :

ముందు చెప్పుకున్నట్లు దర్శకుడు బాలా చక్కటి సోషల్ పాయింట్ తీసుకున్నారు గాని, ఆ పాయింట్ ను ఎలివేట్ చేస్తూ ఇంట్రెస్ట్ పెంచే ట్రీట్మెంట్ మాత్రం రాసుకోలేకపోయారు. ముఖ్యంగా సెకెండ్ హాఫ్ లో ఇంకా ఆసక్తికరంగా ఇన్వెస్ట్ గెట్ చేసే సీన్స్ రాసుకున్నే స్కోప్ ఉన్నప్పటికీ, బాలా మాత్రం సాధారణంగానే నడిపించారు. కానీ సినిమాలో ఇవాన – జివి ప్రకాష్ లవ్ స్టోరీ బి.సి సెంటర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అలాగే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా జ్యోతిక పెర్ఫామెన్స్ కూడా సినిమాకి హైలెట్ గా నిలుస్తోంది. మరి బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎంతవరికి నిలబడుతుందో చూడాలి.

123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు