విడుదల తేదీ : సెప్టెంబర్ 07, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
నటీనటులు : అభిలాష్ వాడాడ , ప్రియా వడ్లమాని , మోనికా తావణం
దర్శకత్వం : ఆకెళ్ళ పెరి శ్రీనివాస్
నిర్మాతలు : శరత్ మరార్
సంగీతం : దీపక్ కిరణ్
సినిమాటోగ్రఫర్ : శరత్ గురువుగారి
ప్రముఖ నిర్మాత శరత్ మరార్ సమర్పణలో అభిలాష్ వాడాడ , ప్రియా వడ్లమాని , మౌనిక హీరో హీరోయిన్లు గా పరిచయం చేస్తూ నూతన దర్శకుడు ఆకెళ్ళ పెరి శ్రీనివాస్ తెరకెక్కించిన చిత్రం ప్రేమకు రెయిన్ చెక్. దీపక్ కిరణ్ సంగీతం అందించిన ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకులముందుకు వచ్చింది మరి ఈ చిత్రం ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.
కథ :
విక్కీ (అభిలాష్ ) మరియు రమ్య (ప్రియ) ఒక అడ్వెంచర్ స్పోర్ట్స్ ఏజెన్సీలో సహచరులు. విక్కీ యొక్క అభిరుచి మరియు తన పట్టుదలను చూసి రమ్య అతనితో ప్రేమలో పడుతుంది. ఈవిషయాన్నివిక్కీ కి చెబుతాం అనే లోపు తాన్యా (మోనికా) విక్కీ ప్రేయసిగా సీన్లోకి ఎంట్రీ ఇస్తుంది . ఇంతకీ తాన్య ఎవరు? ఆమె నిజంగా విక్కీ ప్రేయసి కాదా? ఈ ముగ్గురు ప్రేమ కోణంలో విక్కీ తన ప్రేయసిగా ఎవరిని ఎన్నుకుంటాడు? అనేదే మిగతాకథ .
ప్లస్ పాయింట్స్ :
ప్రధాన జంటగా నటించిన అభిలాష్ మరియు ప్రియ, వారి పాత్రలలో బాగా నటించారు. కొత్తవారైనా ఎంతో అనుభవం వున్నా నటులుగా ఈజీ గా చేసుకుంటూ వెళ్లారు. ఏమాత్రం భయం లేకుండా కెమెరా ను చూసి ఎక్కడా తడబడకుండా తమ పాత్రలకు న్యాయం చేశారు. ముఖ్యంగా ప్రియా తెలుగు డబ్బింగ్ ఆమెకు నటన పరంగా బాగా హెల్ప్ అయ్యింది.
ఇక ఈ చిత్రంలో రెండవ హీరోయిన్ గా నటించిన తాన్యా కూడా తన పాత్ర పరిధి మేర నటించి ఆకట్టుకుంది. లీడ్ పెయిర్ మధ్య క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలు ఆహ్లాదకరంగా అనిపిస్తాయి. హీరోయిన్ రూమేట్స్ గా నటించిన వారు కూడా బాగా నటించారు.
మైనస్ పాయింట్స్ :
ఈచిత్రంలో కథనం చాలా చోట్ల నెమ్మదించడం ప్రధాన బలహీనతగా చెప్పవచ్చు. ఈలాంటి ఓక ట్రయాంగిల్ లవ్ స్టోరీ విజయం సాదించడంలో పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే ప్రధాన పాత్ర పోషిస్తుంది. కానీ ఈచిత్రం అందులోను ఫెయిల్ అయ్యింది. లీడ్ పెయిర్ మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు బాగనిపించిన ఇంటర్వెల్ వరకు కథలోకి తీసుకెళ్లకుండా ప్రేక్షకులకు బోర్ కొట్టిస్తుంది.
ఇక ప్రముఖ హాస్య నటుడు రఘు కామెడీ ట్రాక్ చాలా సిల్లీ గా సాగుతూ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. అలాగే సెకండ్ హాఫ్ లో వచ్చే సన్నివేశాలు కూడా నెమ్మదిగా సాగుతూ నిరాశకు గురిచేస్తాయి.
సాంకేతిక వర్గం :
ఈ చిత్రం లో బడ్జెట్ లో తెరకెక్కిన క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. ఈచిత్రానికి మేజర్ ప్లస్ పాయింట్ కూడా అదే . శరత్ గురువుగారి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి ఫెమ్ ను అందగా మరియు రిచ్ గా చాలా బాగా చూపెట్టాడు. మొదటి భాగం లో వచ్చే అడ్వెంచర్ సాంగ్ ను అద్భుతంగా చిత్రీకరించాడు. దీపక్ అందించిన సంగీతం బాగుంది . సినిమాకు కీలకమైన ప్రేమ సన్నివేశాలను ఎలివేట్ చేసే నేపథ్య సంగీతం కూడా చాలా బాగుంది.
ఇక ఈ చిత్ర దర్శకుడు ఆకెళ్ళ పెరి శ్రీనివాస్ మంచి కథను ఎనుకున్న సినిమాను తెరకెక్కించడంలో చాలా చోట్ల తడబడ్డాడు. ఆకట్టుకునే స్క్రీన్ ప్లై తోపాటు నెమ్మదిగా సాగె కథనంతో అంచనాలను అందుకోలేకపోయారు. ఈ రెండింటిని జాగ్రత్తగా డీల్ చేసుంటే ఈసినిమా మరో స్థాయిలో ఉండేదే .
తీర్పు :
ట్రయాంగిల్ లవ్ స్టోరీ తో వచ్చిన ఈ ప్రేమకు రెయిన్ చెక్ లో నటీనటుల నటన ఆకట్టుకోగా చిత్రం యొక్క క్వాలిటీ మేజర్ హైలెట్ గా చెప్పుకోవచ్చు. నెమ్మదించిన కథనం , బోరింగ్ స్క్రీన్ ప్లే మైనస్ గా చెప్పవచ్చు. చివరగా ప్రేమకథలను ఇష్ట పడే వారికి ఈచిత్రం ఒకే అనిపిస్తుంది. కమర్షియల్ చిత్రాలను కోరుకొనే వారికి ఈ చిత్రం అంతగా నచ్చక పోవచ్చు.
123telugu.com Rating : 2.25/5
Reviewed by 123telugu Team