సమీక్ష : భలే మంచి చౌక బేరం – అక్కడక్కడా అలరించే కామెడీ డ్రామా

సమీక్ష : భలే మంచి చౌక బేరం – అక్కడక్కడా అలరించే కామెడీ డ్రామా

Published on Oct 6, 2018 1:53 AM IST
Bhale ManchiChowka Beram movie review

విడుదల తేదీ : అక్టోబర్ 05, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : నవీద్, ‘కేరింత’ నూకరాజు , యామిని భాస్కర్

దర్శకత్వం : మురళీకృష్ణ ముడిదాని

నిర్మాతలు : ఆరోళ్ళ సతీష్ కుమార్

సంగీతం : హరి గౌర

సినిమాటోగ్రఫర్ : బాల్ రెడ్డి

ప్రముఖ దర్శకుడు మారుతీ కాన్సెప్ట్ తో నవీద్ , నూకరాజు , యామిని భాస్కర్ ముఖ్య పాత్రల్లో నూతన దర్శకుడు మురళీ కృష్ణ తెరకెక్కించిన చిత్రం ‘భలే మంచి చౌక బేరమ్’. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా వుందో ఇప్పుడు చూద్దాం.

 

కథ :

పార్థు (నవీద్), సలీమ్ (నూకరాజు) ఉద్యోగం కోసం దుబాయ్ కి వెళ్లే క్రమంలో.. ఓ దళారీ చేతిలో మోసపోయి, ఇక గత్యంతరం లేక హైదరాబాద్ లో చిన్న జాబ్ చేస్తూ గడిపేస్తుంటారు. మరో పక్క మాజీ ఆర్మీ మేజర్ అయిన (రాజా రవీంద్ర) భారత దేశ రహస్యాలు అనే ఫైల్ రాసి.. దాన్ని అమ్మేయాలని చూస్తాడు. అనుకోకుండా ఓ సంఘటన కారణంగా ఆ ఫైల్ కొరియర్ బాయ్ అయినా సలీమ్ (నూకరాజు)కి దొరుకుతుంది. దాంతో ఆ ఫైల్ ఓపెన్ చేసి సగం చదివి.. దేశ రహస్యాలను పాకిస్థాన్ కు అమ్ముదామని చూస్తాడు.

అయితే, మొదట్లో దీనికి ఒప్పుకొని పార్థు ఆర్థిక సమస్యల కారణంగా చివరికీ ఆ పని చేయడానికి అంగీకరిస్తాడు. ఈ క్రమంలో పాకిస్థానీ టెర్రరిస్ట్ అస్లమ్ బాయ్ తో డీల్ కుదుర్చుకుంటారు. అంతలో తన ఫైల్ కోసం వెతుకుతున్న రాజా రవీంద్రకి అది పార్థు, సలీమ్ ల దగ్గర ఉందని తెలుసుకుంటాడు. మరి వారి నుండి తన ఫైల్ ను తిరిగి సంపాదిస్తాడా ? లేదా ? అసలు ఆ ఫైల్ ను పార్థు, సలీమ్ తీవ్రాదులకు అమ్మారా ? అయినా ఆ ఫైల్ లో అంతగా రహస్యాలు ఏమున్నాయి ? లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ‘భలే మంచి చౌక బేరమ్’ చిత్రాన్ని చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

పార్థు పాత్రలో నవీద్ తన నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా కీలక సన్నివేశాల్లో మరియు క్లైమాక్స్ లో నవీద్ చాలా బాగా నటించాడు. ఇక సినిమాలో మరో ప్రధాన పాత్ర అయిన సలీం పాత్రలో నటించిన నూకరాజు తన కామెడీ టైమింగ్ తో అక్కడక్కడా బాగానే నవ్వించాడు.

సీనియర్ నటుడు రాజా రవీంద్ర చాలా కాలం తరువాత ఈ సినిమాలోనే ఫుల్ లెంగ్త్ రోల్ లో నటించారు. ఆయన ఇటు సిరియస్ గానూ అటు కామెడీగానూ మంచి టైమింగ్ తో సినిమాకు మెయిన్ పిల్లర్ గా నిలిచారు. ముఖ్యంగా ఈ ముగ్గురి కలయికలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను బాగానే ఎంటర్టైనర్ చేస్తాయి.

ఇక హీరోయిన్ పాత్రలో పార్థుకు ప్రియురాలుగా ఆదర్శీ (యామిని భాస్కర్) నటన పరంగానే కాకుండా, తన లుక్స్ అండ్ గ్లామర్ పరంగానూ బాగా ఆకట్టుకుంటుంది.

ఇక సినిమాలో ఊహించని ఇంటర్వెల్ ట్విస్ట్ మరియు సెకండ్ హాఫ్ లో వచ్చే కామెడీ సన్నివేశాలు బాగా ఎంటర్ టైన్ చేస్తాయి. అలాగే దేశ భక్తి గురించే వివరించే ఎపిసోడ్ కూడా సినిమాకు హైలైట్ గా నిలుస్తోంది. కొత్త దర్శకుడు మురళీకృష్ణ సినిమాలోని కీలక సన్నివేశాలను బాగానే డీల్ చేశాడు. సినిమాలో కొన్ని డైలాగ్స్ కూడా ఆకట్టుకుంటాయి.
మైనస్ పాయింట్స్ :

దర్శకుడు మంచి కథను తీసుకున్న దాన్ని తీర్చిదిద్దిన తీరు కొంచెం సిల్లీ గా అనిపిస్తుంది. ఇలాంటి కథను ఎంచుకున్నప్పుడు ఇంకొంచెం బలమైన పాత్రలను రాసుకోవాల్సింది. ఇక టెర్రరిస్టులతో వచ్చే సన్నివేశాలు అంత పవర్ఫుల్ గా అనిపించవు. విలన్ పాత్రను కూడా ఇంకొంచెం హైలైట్ చేయాల్సింది.

ఇక సెకండ్ హాఫ్ లో వినోదం పంచుతూ సందేశాన్ని ఇచ్చిన తీరు బాగున్నా ఫస్ట్ హాఫ్ కు వచ్చే సరికి ఇంటర్వెల్ ట్విస్ట్ మినహా అలాంటి హైలైట్ ఎపిసోడ్ ఒక్కటికూడా ఉండదు.

ఇక హీరో ,హీరోయిన్ల లవ్ ట్రాక్ ఏమాత్రం ఆసక్తికరంగా అనిపించదు. ఇక ఫస్ట్ హాఫ్ లో నూకరాజు చేసే కామెడీ కొన్ని చోట్ల విసుగు తెప్పిస్తుంది. సెకండ్ హాఫ్ లో లాగా ఫస్ట్ హాఫ్లో బలమైన సన్నివేశాలు ఉండి ఉంటే ఈ చిత్రం ఫలితం ఇంకోలా ఉండేది.
సాంకేతిక వర్గం :

చిత్ర దర్శకుడు మురళీశర్మ కు ఇదే మొదటి సినిమాయైన ఎక్కడా తడబడకుండా ఇటు కామెడీ తో పాటు చిన్న మెసేజ్ కూడా ఇవ్వడంలో విజయం సాధించారు. లాజిక్ల గురించి పట్టించుకుకుండా ఆయన కథ నడిపిన తీరు చాలా వరకు ఆకట్టుకుంది. కథను ఇంకొంచెం పకడ్బందీగా రాసుకొనిఉంటే ఈ చిత్రం ఆయనకు మంచి విజయాన్ని అందించేది.

ఇక హరి గురువ అందించిన సంగీతం పర్వాలేదు. సినిమాలో వున్న మూడు పాటలు పర్వాలేదనిపిస్తాయి. ఇక ఉద్దవ్ ఎడిటింగ్ కూడా బాగుంది. బాల్ రెడ్డి అందించిన ఛాయాగ్రహణం సినిమాకు రిచ్ లుక్ ను తీసుకొచ్చింది. ఆరోళ్ళ సతీష్ కుమార్ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు :

మురళీకృష్ణ దర్శకత్వంలో కామెడీ తో పాటు చిన్న మెసేజ్ తో తెరకెక్కిన ఈ చిత్రం పర్వాలేదనిపించిది. రాజా రవీంద్ర , నూకరాజు , నవీద్ ల నటన , ఇంటర్వెల్ ట్విస్ట్ , సెకండ్ హాఫ్ లో వచ్చే కామెడీ మరియు ఎమోషనల్ సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలువగా.. లాజిక్ లేని సన్నివేశాలు, బలహీనమైన పాత్రలు, ఆసక్తిలేని కథనం సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. కానీ ఈ చిత్రంలోని కొన్ని అంశాలు బి.సి ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకుంటాయి.

Click here for English Review

123telugu.com Rating :2.75 /5

Reviewed by 123telugu Team

సంబంధిత సమాచారం

తాజా వార్తలు