విడుదల తేదీ : అక్టోబర్ 26, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు : ఆర్య, సంతానం, తమన్నా, మరియు విశాల్
దర్శకత్వం : ఎమ్ రాజేష్
నిర్మాతలు : ఆర్య
సంగీతం : డి.ఇమ్మాన్
సినిమాటోగ్రఫర్ : నిరవ్ షా
స్క్రీన్ ప్లే : ఎమ్ రాజేష్
ఎం.రాజేష్ దర్శకత్వంలో ఆర్య, సంతానం, తమన్నా, మరియు విశాల్ నటించిన చిత్రం ‘ఐశ్వర్యాభిమస్తు’. వరం జయత్ కుమార్ నిర్మాత. డి.ఇమ్మాన్ సంగీతం అందించారు. కాగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో ఒక్కసారి సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం..!
కథ :
ఐశ్వర్యాభిమస్తు చిత్రం ఇద్దరు ప్రాణ స్నేహితులు కథ. ఆర్య మరియు సంతానం చిన్నప్పటినుంచీ బెస్ట్ ఫ్రెండ్స్. వారి జీవితంలో జరిగే ప్రతి విషయాన్నీ వారు ఒకరికి ఒకరు ఇన్ వాల్వ్ అయి ఉంటారు. కాగా ఈ క్రమంలో ఆర్య తమన్నాతో ప్రేమలో పడతాడు. అటు సంతానం కూడా భానుని పెళ్లి చేసుకుంటాడు. తమన్నా, బానుకి ఆర్య సంతానం స్నేహం నచ్చదు. వీరిద్దరూ విడిపోతేనే తమ దాంపత్య జీవితాలు బాగుంటాయని వారిని విడగొట్టడానికి రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు. మరి వారి ప్రయత్నాలు సఫలం అవుతాయా ? ఆర్య, సంతానం మధ్య స్నేహం పోతుందా ? చివరకి వీరి స్నేహం గొప్పతనాన్ని తమన్నా, బాను అర్ధం చేసుకుంటారా ? లేదా ? లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రం చూడాలసిందే !
ప్లస్ పాయింట్స్:
ఆర్య – సంతానం మధ్య ఫ్రెండ్షిప్, ఆ ఫ్రెండ్షిప్ తాలూకూ కెమిస్ట్రీ ఈ చిత్రానికి చాలా ప్లస్ అయింది. ఆర్య – సంతానం ఇద్దరూ తమ సహజమైన నటనతో చాల బాగా నటించారు. ఆర్య తన టైమింగ్ తో అక్కడక్కడ బాగానే నవ్వించాడు.
ఇక తెలుగు ప్రేక్షకులకి కమెడియన్ గా పరిచయం అయిన సంతానం ఈ చిత్రంలో ఎక్కడా పూర్తిస్థాయి హాస్యనటుడిలా కనిపించకపోయినా సినిమా బోర్ కొడుతుందన్న ఫీలింగ్ వచ్చే లోపే.. ఆయన తన కామెడీ టైమింగ్, పంచులతో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశారు. అతిధి పాత్రలో కనిపించిన విశాల్ కూడా తను ఉన్న సన్నివేశాల్లో తన ముద్ర కనబరిచాడు.
ఇక హీరోయిన్ తమన్నా తన అందంతో పాటు తన అభినయంతో కూడా మెప్పిస్తూనే.. ఆర్య – సంతానాన్ని విడగొట్టే సన్నివేశాల్లో మరి క్లైమాక్స్ లో తమన్నా తన నటనతో ఆకట్టుకుంటుంది. మరో కీలక పాత్రలో నటించిన బాను కూడా చక్కగా నటించింది.
మైనస్ పాయింట్స్:
దర్శకుడు ఎం. రాజేష్, చాలా తేలికపాటి ట్రీట్మెంట్ తో ఈ చిత్రం తెరకెక్కించారు. దాంతో సినిమా స్థాయికి తగట్లు అనిపించదు. దీనికి తోడు కథ కథనాలల్లో కూడా సరైన ప్లో లేదు. ఏ సీన్ కి ఆ సీన్ బాగుందనిపించినా కథకు అనుగుణంగా సాగవు. ఇక దర్శకుడు ఆరోగ్యకరమైన కామెడీకి బదులుగా అనేక వెర్రి సన్నివేశాలతో సినిమాని నిపిండం కూడా విసిగిస్తోంది.
ఇక కథకే కీలక అంశాలు అయినటివంటి కొన్ని అంశాలను మరియు సన్నివేశాలను ఇంకా బలంగా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే బాగుండేది. బలహీన సంఘటనలతో సాగే కథనంలో.. బలమైన కాన్ ఫిల్ట్ మిస్ అయింది. పైగా చాలా చోట్ల సినిమాటెక్ గానే సాగుతాయి. స్క్రీన్ ప్లే కూడా ప్రెడిక్టుబుల్ గా నడుస్తుంది.
సాంకేతిక విభాగం :
ఈ చిత్ర దర్శకుడు ఎం.రాజేష్ ఒక సింపుల్ కథాంశాన్ని ఎంచుకున్నాడు. తన దర్శకత్వ పనితనంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకొన్నే ప్రయత్నం అయితే చేశాడు గాని అది పూర్తీ సంతృప్తికరంగా అనిపించదు.
ఇక సినిమాలో కెమెరా పనితనం మాత్రం ఇంప్రెస్ అయ్యేలా ఉంది. కొన్ని విజువల్స్ చాలా బాగున్నాయి. డి.ఇమ్మాన్ అందించిన సంగీతం బాగుంది. కాకపోతే తమిళ చిత్రాల్లోని బిట్స్ గుర్తువస్తాయి. ఎడిటర్ పనితరం కూడా పర్వాలేదు. నిర్మాత వరం జయత్ కుమార్ నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.
తీర్పు :
ఎం.రాజేష్ దర్శకత్వంలో ఆర్య, సంతానం, తమన్నా, మరియు విశాల్ నటించిన ‘ఐశ్వర్యాభిమస్తు’ చిత్రం పూర్తిగా ఆకట్టుకున్నే విధంగా లేదు. కాకపోతే సినిమాలో అక్కడక్కడ వచ్చే కామెడీ బాగా నవ్విస్తుంది. ఆర్య మరియు సంతానం మధ్య వచ్చే సన్నివేశాలు కూడా సినిమా పై ఆసక్తిని పెంచుతాయి. ఆర్య – సంతానం తన పెర్ఫార్మెన్స్ తో సినిమానే నిలబెట్టే ప్రయత్నం చేశారు. మరి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
123telugu.com Rating : 2.5/5
Reviewed by 123telugu Team