విడుదల తేదీ : నవంబర్ 17, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5
నటీనటులు : విజయ్ దేవరకొండ , ప్రియాంక జవాల్కర్ , మాళవిక నాయర్
దర్శకత్వం : రాహుల్ సంక్రుత్యన్
నిర్మాత : ఎస్ కె ఎన్
సంగీతం : జేక్స్ బిజోయ్
సినిమాటోగ్రఫర్ : సుజిత్ సారంగ్
ఎడిటర్ : శ్రీజిత్ సారంగ్
విజయ్‌దేవరకొండ, ప్రియాంక జవాల్కర్, మాళవికా నాయర్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘టాక్సీవాలా’. జి.ఎ 2 పిక్చర్స్, యు.వి.క్రియేషన్స్ బ్యానర్స్ పై రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో ఎస్.కె.ఎన్ నిర్మించిన ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ :
శివ (విజయ్ దేవరకొండ) డిగ్రీ ఐదు సంవత్సరాలు కష్టపడి పూర్తి చేసుకోని, జాబ్ కోసం హైదరాబాద్ కు వస్తాడు. అలా రకరకాల జాబ్ లు చేసి.. ఏ జాబ్ నచ్చక, ఫైనల్ గా ఓ కారు కొనుక్కొని క్యాబ్ డ్రైవర్ గా సెటిల్ అవుతాడు. ఇక అంత హ్యాపీ అనుకుంటున్న టైంలో కార్ వల్ల జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల కారణంగా శివ లైఫ్ లో ఊహించని సంఘటనలు జరుగుతాయి.
దాంతో ఆ కార్ ని వదిలించుకోవడానికి శివ ప్రయత్నాలు మొదలుపెడతాడు. ఆ క్రమంలో ఆ కార్ గురించి కొన్ని నిజాలు తెలుస్తాయి. అంతలో ఆ కారు లో ప్రయాణించిన ఓ డాక్టర్ ను, ఆ కారు అతి దారుణంగా చంపేస్తోంది. అసలు ఆ కార్ అతన్ని ఎందుకు చంపుతుంది ? ఆ కార్ లో ఏముంది ? ఎవరు కోసం ఎదురుచుస్తూ ఉంది? శివకు ఆ కార్ కు ఎందుకు అంత అటాచ్ మెంట్ పెరుగుతుంది ? ఫైనల్ గా ఆ కారు ఎవరి పై రివేంజ్ తీసుకోవాలనుకుంటుంది ? దానికి శివ ఏ విధంగా సహాయపడతాడు ? లాంటి విషయాలు తెలయాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాలో ఓ క్యాబ్ డ్రైవర్ గా నటించిన విజయ్ దేవరకొండ చక్కని నటనను కనబరిచాడు. గత తన సినిమాల్లో కంటే ఈ సినిమాలో ఓ ఆర్డనరీ కుర్రాడిగా కొత్త లుక్ తో ఫ్రెష్ గా కనిపించాడు. కొన్ని హర్రర్ సన్నివేశాల్లో తన నటనతో అక్కడక్కడా నవ్విస్తూనే.. ఇటు ఆ హర్రర్ సీన్స్ లో భయపడుతూ.. సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు.
ఇక కథానాయకిగా నటించిన ప్రియాంక జవాల్కర్ జూనియర్ డాక్టర్ అను పాత్రలో చాలా చక్కగా నటించింది. ఆమె క్యారెక్టర్ ఇంట్రడక్షన్ సీన్ లో మరియు హీరోతో సాగే కొన్ని సన్నివేశాల్లోనూ తన నటనతోనూ బాగా ఆకట్టుకుంటుంది.
సినిమాలో మరో కీలక పాత్రలో కనిపించిన మాళవిక నాయర్ కి పెద్దగా స్క్రీన్ ప్రెజన్స్ లేకపోయినా .. తన నటనతో సినిమాలో హైలెట్ గా నిలుస్తోంది. కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె పలికించిన హావభావాలు ఆకట్టుకుంటాయి.
మధు, మధు పక్కన అసిస్టెంట్, అలాగే చమ్మక్ చంద్ర తమ కామెడీ టైమింగ్ తో మ్యానరిజమ్స్ తో బాగా నవ్విస్తారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.
మైనస్ పాయింట్స్ :
దర్శకుడు రాహుల్ సంక్రిత్యాన్ మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నప్పటికీ, ఆ లైన్ ను పూర్తిగా కన్విన్స్ చేసిన విధానంలో.. కొన్ని చోట్ల సినిమాటిక్ గా అనిపిస్తాయి. విలన్ తాలూకు సన్నివేశాలను కూడా ఇంకా కొంచెం క్లారిటీ చూపించే ఉంటే బాగుండేది. ముఖ్యంగా రవివర్మ పాత్రను దాచి ఉంచడం అనేది, కథకు కావాలి కాబట్టి ఏదో కావాలని దాచిపెట్టినట్లు ఉంటుంది.
పైగా కథనంలో కొన్ని సన్నివేశాలు ఇంకా ఆసక్తికరంగా నడిపే అవకాశం ఉన్నప్పటికీ.. దర్శకుడు మాత్రం తన శైలిలోనే సినిమాని మలిచారు.
అయితే రాహుల్ సంక్రిత్యాన్ సినిమాని చాలా చోట్ల ఎంటర్ టైన్ గా నడిపినప్పటికీ.. లవ్ స్టోరీని మాత్రం ఆ స్థాయిలో మలచలేకపోయారు.
మెయిన్ గా హీరోహీరోయిన్ల మధ్య వచ్చే సీన్స్ విషయంలో ఇంకొంచెం శ్రద్ద తీసుకుని ఉండి ఉంటే బాగుండేది. దీంతో పాటు కొన్ని సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువుగా కనిపిస్తోంది. ఇలాంటి చిన్న చిన్న మైనస్ లు కూడా లేకుండా ఉండి ఉంటే ఈ చిత్రం మరో స్థాయిలో ఉండి ఉండేది.
సాంకేతిక విభాగం :
దర్శకుడు దర్శకుడు రాహుల్ సంక్రిత్యాన్ మంచి స్టోరీ లైన్ తో పాటు మంచి కామెడీ సన్నివేశాలతో బాగా ఎంటర్ టైన్ చేశాడు. ఇక సినిమాలో సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. సినిమాలో దృశ్యాలన్నీ చాలా అందంగా చూపించారు.
సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ అందించిన పాటలు బాగున్నాయి. ఆయన అందించిన నేపధ్య సంగీతం కూడా సినిమాకి చాలా బాగా ప్లస్ అయింది. శ్రీజిత్ సారంగ్ ఎడిటింగ్ కూడా ఆకట్టుకుంటుంది. ఇక సినిమాలోని యస్.కె.ఎన్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.
తీర్పు :
విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్ హీరో హీరోయిన్లుగా, మాళవిక నాయర్ ముఖ్య పాత్రలో వచ్చిన ఈ చిత్రం కొన్ని సన్నివేశాల్లో తప్ప, మిగతా సినిమా మొత్తం ఆసక్తికరంగా సాగుతూ ఆకట్టుకుంటుంది. ముందుగానే చెప్పుకున్నట్లు దర్శకుడు రాహుల్ సంక్రిత్యాన్ మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు. ఆ లైన్ కి చక్కని ట్రీట్మెంట్ తో పాటు మంచి కామెడీ సీన్స్ తో బాగా ఎంటర్ టైన్ చేశారు.
అయితే.. దర్శకుడు సినిమాని చాలా చోట్ల ఎంటర్ టైన్ గా నడిపినప్పటికీ, లవ్ స్టోరీని మాత్రం ఆ స్థాయిలో మలచలేకపోయారు. మెయిన్ గా హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సీన్స్ విషయంలో ఇంకొంచెం శ్రద్ద తీసుకుని ఉండి ఉంటే బాగుండేది. దీంతో పాటు కొన్ని సన్నివేశాల్లో నాటకీయత కూడా ఎక్కువుగా కనిపిస్తోంది.
ఇక విజయ్ దేవరకొండ తన నటనతో సినిమాని మరో లెవల్ కి తీసుకు వెళ్లారు. ప్రియాంక నటన కూడా చాలా బాగుంది. కీలక పాత్రలో కనిపించిన మాళవిక నాయర్ కి పెద్దగా స్క్రీన్ టైం లేకపోయినా.. తన నటనతో సినిమాలో హైలెట్ గా నిలుస్తోంది. కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె పలికించిన హావభావాలు కూడా బాగా ఆకట్టుకుంటాయి. మొత్తం మీద ఈ చిత్రం విజయ్ దేవరకొండ అభిమానులతో పాటు మిగిలిన వర్గాల ప్రేక్షకులని కూడా అలరిస్తుందని చెప్పొచ్చు.
123telugu.com Rating : 3.25/5
Reviewed by 123telugu Team