విడుదల తేదీ : డిసెంబర్ 01, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
నటీనటులు : శ్రీకాంత్ , దీక్షా పంత్ , పోసాని కృష్ణ మురళి
దర్శకత్వం : కరణం బాబ్జీ
నిర్మాత : అలివేలు
సంగీతం : ర్యాప్ రాక్ షకీల్
సినిమాటోగ్రఫర్ : వెంకట్ ప్రసాద్
ఎడిటర్ : ఉద్దవ్
సీనియర్ హీరో శ్రీకాంత్ నటించిన 125 వచిత్రం ఆపరేషన్ 2019. కరణం బాబ్జీ తెరకెక్కించిన ఈ చిత్రంలో సునీల్ , మంచు మనోజ్ అతిధి పాత్రల్లో నటించారు. మరి ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ..
కథ :
ఎన్నారై అయినా ఉమా శంకర్ (శ్రీకాంత్ ) తన గ్రామానికి ఏమైనా చేయాలనే లక్ష్యం తో ఆ ఊరిలో సౌమ్యుడు గా పేరు తెచ్చుకున్న నారాయణమూర్తి ని స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయిస్తాడు. అయితే నారాయణ మూర్తి అధికార పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోతాడు. ఇక ఉమా శంకర్ ఆ ఎమ్మెల్యే ఫై చేయి చేసుకోవడంతో సంవత్సరం పాటు జైల్లో వుంటాడు. ఆ తరువాత జైలు నుండి బయటికి వచ్చి భారీగా డబ్బు ఇచ్చి ప్రతిపక్ష పార్టీ లో చేరి ఎమ్మెల్యే గా పోటీ చేస్తాడు ఉమా శంకర్. చట్ట విరుద్ధమైన హామీలు ఇచ్చి ఎన్నికల్లో గెలుస్తాడు ఉమాశంకర్ ఆ తరువాత ఆయన ఏం చేశాడు ? అసలు ఉమా శంకర్ లక్ష్యం ఏంటి అనేదే మిగితా కథ..
ప్లస్ పాయింట్స్ :
శ్రీకాంత్ తన నటనతో సినిమా ని తన భుజాలపై వేసుకొని నడిపించాడు. ఆద్యంతం సీరియస్ గా వుంటూ తన నుండి బెస్ట్ అవుట్ ఫుట్ ఇచ్చాడు. ఇక ప్రస్తుతం సమాజంలో వున్నా రాజకీయ పరిస్థితులను చక్కగా వివరించాడు దర్శకుడు కరణం బాబ్జీ. సినిమా ను ఇంట్రస్టింగ్ పాయింట్ తో మొదలు పెట్టి సినిమాపై ఆసక్తిని పెంచేలా చేశాడు. ఇక ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశాలు కూడా బాగున్నాయి.
ఇక కుల ,మత రాజకీయాలు అలాగే ఓటు విలువను గురించి ప్రస్తావించి ఒక సోషల్ మెసేజ్ ఇవ్వడంలో దర్శకుడు విజయం సాదించాడు. ఇక మిగిలిన పాత్రల్లో నటించిన పోసాని కృష్ణ మురళి , దీక్ష పంత్ వారి పాత్రల మేర చక్కగా నటించారు.
మైనస్ పాయింట్స్ :
పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలను కొని ఈ కథను రాసుకున్న దర్శకుడు కరణం బాబ్జీ దాన్ని తెర మీద కు తీసుకురావడంలో పూర్తిగా తడబడ్డాడు. మొదటి 10 నిమిషాలు ఇంట్రస్టింగ్ గా సినిమాను స్టార్ట్ చేసి ప్రేక్షకుడిని సినిమాలో లీన మయ్యేట్లు చేయడంలో విజయం సాధించారు కానీ ఆతరువాత తేలిపోయారు. శ్రీకాంత్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మరి సాగదీసినట్లుగా అనిపించింది. ఇక ఇంటర్వెల్ ముందు మళ్ళీ సినిమా ఫై ఇంట్రస్ట్ క్రియేట్ చేయగలిగారు కానీ అది ఎక్కువ సేపు వుండేలా చూసుకోలేకపోయారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ చాల చోట్లా నిరాశ పరిచింది. ఒక ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని కంట్రోల్ చేయడం అలాగే ముఖ్యమంత్రి తో సహా ఆయన ట్రాప్ లో పడిపోవడం వంటి సన్నివేశాలు అంతగా కనెక్ట్ అవ్వవు. దాంతో దర్శకుడకు చెప్పాలనుకున్న విషయాన్ని స్ఫష్టంగా చెప్పలేకపోయాడు.
ఇక అతిధి పాత్రల్లో కనిపించిన సునీల్ , మంచు మనోజ్ సినిమాకు ఏ మాత్రం ఉపయోగ పడలేదు. మఖ్యంగా ఒక పాటలో కనిపించిన సునీల్ తన స్టెప్పులతో నిరాశ పరుస్తాడు. ఇక క్లైమాక్స్ లో వచ్చిన మనోజ్ కూడా సినిమాకు ఏం చేయలేకపోయాడు. గ్రిప్పింగ్ నరేషన్ తో ఆసక్తికరమైన ట్విస్టుల తో ఈ కథను తెర మీద చూపించి ఉంటే ఇది మరో ఆపరేషన్ దుర్యోధన అయ్యి ఉండేదే.
సాంకేతిక విభాగం :
సినిమాకు కెప్టెన్ అఫ్ ది షిప్ అయిన దర్శకుడు కరణం బాబ్జీ తన నుండి సరైన అవుట్ పుట్ ఇవ్వకపోవడంతో సినిమా సాదాసీదాగా మిగిలిపోయింది. ఇక ర్యాప్ రాక్ షకీల్ అందించిన సంగీతం కూడా ఏమంత బాగా లేదు. ముఖ్యంగా పాటలు సినిమాకు అడ్డు పడినట్లు అనిపిస్తుంది. వెంకట్ ప్రభు కెమెరా పనితనం బాగుంది. ప్రతి ఫ్రెమ్ ను ఉన్నతంగా చూపెట్టి సినిమాకి రిచ్ లుక్ ను తీసుకురాగలిగాడు. ఉద్దవ్ ఎడిటింగ్ కూడా పర్వాలేదు. ఇక సినిమా నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.
తీర్పు :
పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఒక సోషల్ మెసేజ్ తో తెరకెక్కిన ఈ ఆపరేషన్ 2019 మెప్పించలేకపోయింది. గ్రిప్పింగ్ లేని సన్నివేశాలు, ఆసక్తికరంగా లేని ట్విస్ట్ లు సినిమాకు బలహీనత అయితే శ్రీకాంత్ వన్ మ్యాన్ షో అలాగే ఫస్ట్ హాఫ్ లో వచ్చే సన్నివేషాలు సినిమాకు హైలైట్ గా నిలిచాయి. చివరగా ఈ పొలిటికల్ థ్రిల్లర్ అన్ని వర్గాల వారికీ మంచి ఛాయస్ అయ్యే అవకాశాలు తక్కువే.
123telugu.com Rating : 2.25/5
Reviewed by 123telugu Team