విడుదల తేదీ : డిసెంబర్ 14, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
నటీనటులు : మోహన్‌లాల్, ప్రకాష్‌రాజ్, మంజు వారియర్, సన అల్తాఫ్, సిద్ధిక్ తదితరులు
దర్శకత్వం : వి.ఏ. శ్రీకుమార్ మీనన్
నిర్మాత : ఆంటొని పెరుంబవూర్, రామ్
సంగీతం : ఎం. జయచంద్రన్
సినిమాటోగ్రఫర్ : షాజి కుమార్
ఎడిటర్ : జాన్ కుట్టి
శ్రీకుమార్ మీనన్ దర్శకత్వంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన తాజా చిత్రం ‘ఒడియన్’ ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ :
ఒడియన్ మాణిక్యం (మోహన్ లాల్) చిన్నతనం నుంచి ప్రభ (మంజు వారియర్)ను ఆరాధిస్తుంటాడు. ప్రభ పై కన్ను వున్న ఆమె బావ రాజారావు (ప్రకాష్‌రాజ్) ప్రభను సొంతం చేసుకోవడానికి చాలా పన్నాగాలు పన్నుతూ.. ఆ క్రమంలో ఒడియన్ ను ఊరిలోనుంచి వెళ్లిపోయేలా చేస్తాడు. దాంతో ఒడియన్ ప్రభకు, ఆ ఊరికి దూరంగా వెళ్లిపోవాల్సి వస్తోంది. మళ్లీ ప్రభ కుటుంబం ఆపదలో ఉందని తెలుసుకొని తిరిగి వస్తాడు.
తిరిగి వచ్చిన ఒడియన్ ప్రభను ఆమె కుటుంబాన్ని కాపాడాడా ? లేదా ? అసలు ఒడియన్ కి ప్రభకు ఉన్న సంబంధం ఏమిటి? పదిహేను సంవత్సరాలుగా ఓడియన్ మాణిక్యం ఎందుకు ఆమెకు దూరంగా ఉండాల్సి వచ్చింది ? ఈ మొత్తం కథలో రాజారావు (ప్రకాష్‌రాజ్) పాత్ర ఏమిటి ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
సూపర్ స్టార్ అనే ట్యాగ్ కూడా పట్టించుకోకుండా మోహన్ లాల్ ఒడియన్ పాత్రలో ఇన్ వాల్వ్ అయిపోయారు. ఈ సినిమా కోసం ఆయన చూపించిన అంకితభావం గురించి మరియు నిబద్ధత గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది. పనితీరు మరియు ప్రమాదం చర్య సన్నివేశాలను చేయడానికి అభ్యంతరకరమైన పనిని ప్రశంసించడం ఖచ్చితంగా ఉంది.
కుటుంబంలోని బాధ్యతగల మహిళగా నటించిన హీరోయిన్ మంజు వారియర్ తన నటనతో ఈ కీలకమైన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా కొన్ని కీలకమైన దృశ్యాల్లో ఆమె నటన ఆకట్టుకుంటుంది. ఇక హీరోయిన్ పై కన్ను ఉన్న విలన్ పాత్రలో నటించిన ప్రకాష్ రాజ్ ఎప్పటిలాగే తన నటనతో మెప్పిస్తారు.
మంజు వారియర్ చెల్లిగా చేసిన నటి కూడా చాల బాగా చేసింది. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేశారు.
మైనస్ పాయింట్స్ :
దర్శకుడు మంచి ఎమోషనల్ సన్నివేశంతో, ఆసక్తిని పెంచే పాయింట్ తో సినిమాని ప్రారంభించినా… ఆ తర్వాత సినిమాను అంతే ఆసక్తికరంగా నడపలేదు. సినిమా మీద ప్రేక్షకుడికి ఇంట్రస్ట్ పుట్టించే స్కోప్ ఉన్నపటికీ దర్శకుడు ఆ పాయింట్ ను వదిలేసి అనవసరమైన సన్నివేశాలతో సినిమాని నింపేశాడు.
దీనికి తోడు కథ కూడా పాత కాలం నాటి ప్రేమకథలా సాగుతూ.. బోర్ కొట్టిస్తోంది. ఇక విలన్ గా నటించిన ప్రకాష్ రాజ్ పాత్ర తాలూకు ఐడియాలు కూడా చాలా పాతకాలపు సినిమాల్లోని ఐడియాలను గుర్తు తెస్తాయి.
పైగా అవసరం లేని పాటలు అనవసరమైన సందర్భాల్లో వస్తూ.. సినిమా పై ఉన్న ఆ కాస్త ఇంట్రస్ట్ ని కూడా పూర్తిగా చెడ కొడుతుంది. ఓవరాల్ గా దర్శకుడు శ్రీకుమార్ మీనన్ మంచి కంటెంట్ ని తీసుకున్నప్పటికీ సినిమాని మాత్రం ఆసక్తికరంగా మలచలేకపోయారు.
సాంకేతిక విభాగం :
ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. ముందే చెప్పుకున్నట్లు దర్శకుడు మంచి కంటెంట్ తీసుకున్నా దాన్ని పూర్తిగా వాడుకోలేకపోయారు. ఆయన రాసిన స్క్రీన్ ప్లే పండకపోగా విసిగిస్తోంది.
సంగీత దర్శకుడు అందించిన పాటల సంగీతం పర్వాలేదనిపిస్తోంది. కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం కొన్ని కీలక సన్నివేశాల్లో అక్కట్టుకున్నేలా ఉంది. నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు :
శ్రీకుమార్ మీనన్ దర్శకత్వంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా వచ్చిన ఈ చిత్రం కొన్నిచోట్ల పర్వాలేదనిపించినా.. ఓవరాల్ గా నిరుత్సాహ పరుస్తోంది. కానీ దర్శకుడు ఆసక్తిని పెంచే విధంగా సినిమాని ప్రారంభించినా… ఆ తర్వాత సినిమాను అంతే ఆసక్తికరంగా నడపలేదు. సినిమా మీద ప్రేక్షకుడికి ఇంట్రస్ట్ పుట్టించే స్కోప్ ఉన్నపటికీ దర్శకుడు ఆ పాయింట్ ను వదిలేసి అనవసరమైన సన్నివేశాలతో సినిమాని నింపేశాడు. అయితే మోహన్ లాల్ మరియు మంజు వారియర్ నటన ఆకట్టుకుంటుంది. ఓవరాల్ గా ఈ సినిమా డిఫరెంట్ జోనర్ లో సినిమాను చూద్దామకొన్నే ప్రేక్షకులను కొంత ఆకట్టుకున్నా.. మిగిలిన ప్రేక్షకులను మాత్రం బాగా నిరుత్సాహపరుస్తోంది.
123telugu.com Rating : 2.25/5
Reviewed by 123telugu Team