విడుదల తేదీ : డిసెంబర్ 28, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : సుమంత్ , అంజు కురియన్ , శివాజీ రాజా
దర్శకత్వం : అనిల్ శ్రీకంఠం
నిర్మాత : శ్రీధర్ గంగపట్నం
సంగీతం : శ్రీ చరణ్ పాకాల
సినిమాటోగ్రఫర్ : బాల్ రెడ్డి
ఎడిటర్ : గ్యారి బిహెచ్
సుమంత్ , అంజు కురియన్ జంటగా నూతన దర్శకుడు అనిల్ శ్రీకంఠం తెరకెక్కించిన చిత్రం ‘ఇదం జగత్’. మరి ఈ రోజు ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ..
కథ :
నిషిత్ (సుమంత్ ) ఎలాగైనా డబ్బు సంపాదించాలని నైట్ రిపోర్టర్ గా మారతాడు. రాత్రిళ్లు జరిగే సంఘటలను షూట్ చేసిఆ ఫుటేజ్ ను ఛానెల్ కు అమ్ముకుని డబ్బు సంపాదిస్తాడు. ఈ క్రమంలో హీరోయిన్ మహతి (అంజు కురియన్) వాళ్ల నాన్న హత్యా చేయబడుతాడు. ఈ హత్యా ను సుమంత్ రికార్డుచేస్తాడు దాన్ని భారీ మొత్తంలో క్యాష్ చేసుకోవాలనుకుంటాడు. మరి సుమంత్ ప్లాన్ వర్క్ అవుట్ అయ్యిందా ? ఆ హత్యా ను ఎవరుచేశారు ? లాంటి విషయాలు తెలియాలంటే ఈసినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
నిషిత్ పాత్రలో నటించిన సుమంత్ ఆ పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు. సవాలు తో కూడుకున్న పాత్ర కాకపోవడంతో పెద్దగా కష్టపడ్డట్లు అనిపించదు. హీరోయిన్ అంజు కురియన్ తన పాత్ర పరిధి మేర నటించింది. కాకపోతే గ్లామర్ పరంగా అంతగా మెప్పించలేకపోయింది. ఇక హీరో ఫ్రెండ్ పాత్రలో నటించిన సత్య అలాగే పోలీస్ ఆఫీసర్ గా నటించిన శివాజీ రాజా తమ పాత్రలకు న్యాయం చేశారు.
ఇక నెగిటివ్ రోల్ లో నటించిన అర్జున్ రెడ్డి ఫేమ్ కళ్యాణ్ మంచి నటన కనబరిచాడు. తన ఆటిట్యూడ్ ఈ సినిమాకు ప్లస్ అయ్యింది.
దర్శకుడు అనిల్ శ్రీకంఠం క్రైమ్ జోనర్ లో డిఫ్రెంట్ పాయింట్ తో కథను రాసుకోవడం సినిమాకు ప్లస్ అయ్యింది. సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు బాగున్నాయి.
మైనస్ పాయింట్స్ :
దర్శకుడు అనిల్ ఇంట్రస్టింగ్ సబ్జెక్టు ను తెర మీదకు తీసుకురావడంలో కొన్నిచోట్ల తడబడ్డాడు. క్రైమ్ థ్రిల్లర్ అంటేనే ఆసక్తికర మలుపులు , ఉత్కంఠతో కూడిన స్క్రీన్ ప్లే ఎక్స్పెక్ట్ చేస్తారు కాని ఈసినిమాలో అవి మిస్ అయ్యాయి. దాంతో సినిమా కొన్ని చోట్ల సాగదీసి నట్లుగా అనిపిస్తుంది.
ఫస్ట్ హాఫ్ స్లో సాగుతూ ప్రేక్షకుడిని నీరసం తెప్పిస్తుంది. ఇంట్రస్టింగ్ పాయింట్ ఉన్న కథకు సరైన కథనం తోడైయితే సినిమా ఫలితం ఊహించినదానికంటే ఎక్కువగానే ఉంటుంది కానీ ఈ చిత్రం కథనం విషయం లో నిరాశపరచడంతో ఆ ప్రభావం సినిమా ఫలితం ఫై పడింది.
ఇక హీరో , హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ ట్రాక్ అలాగే క్లైమాక్స్ సన్నివేశాలు సినిమాటిక్ గా అనిపిస్తాయి. వీటితో పాటు లో బడ్జెట్ కూడా ఈచిత్రం యొక్క ఫలితాన్ని దెబ్బతీసింది. క్వాలిటీ లేని విజువల్స్ సినిమా ఫై ఆసక్తిని తీసుకురాలేకపోయింది.
సాంకేతిక విభాగం :
దర్శకుడు అనిల్ శ్రీకంఠం ఒక ఆసక్తికరమైన థ్రిల్లర్ ను ప్రేక్షకులను అందించాలనుకొని ఆ ప్రయత్నంలో పూర్తిగా సక్సెస్ కాలేకపోయాడు. స్లో నరేషన్ ఊహించిన ట్విస్టులు సినిమాను ప్రభావితం చేశాయి. అయితే అనిల్ తన మొదటి సినిమాతో డైరెక్టర్ గా మంచి మార్కులు కొట్టేశాడు. ఎవరు టచ్ చేయని పాయింట్ తో కథ రాసుకొని మెప్పించాడు. కాగా శ్రీ చరణ్ పాకాల సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సన్నివేశాలను ఎలివేట్ చేశాడు. బాల్ రెడ్డి ఛాయాగ్రహణం అంతంత మాత్రం గానే వుంది. గ్యారీ ఎడిటింగ్ పర్వాలేదు. ఇక నిర్మాణ విలువలు సాదా సీదాగా ఉండడంతో సినిమా స్క్రీన్ ఫై ఉన్నతంగా కనిపించలేకపోయింది.
తీర్పు :
క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ ఇదం జగత్ అనుకున్నంతగా థ్రిల్ చేయలేకపోయింది. సుమంత్ నటన , కథ ఈ సినిమాకు హైలైట్ అవ్వగా కథనం ,స్లో నరేషన్ , ఊహించిన ట్విస్ట్ లు సినిమా ఫలితాన్ని దెబ్బతీశాయి. చివరగా ఈ చిత్రం క్రైం జోనర్ ను ఇష్టపడే వారికీ నచ్చుతుంది కానీ మిగితా వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వడం కష్టమే.
123telugu.com Rating : 2.75/5
Reviewed by 123telugu Team