సమీక్ష : బిచ్చగాడా … మజాకా – బోరింగ్ బ్రేక్ అప్ లవ్ స్టోరీ

సమీక్ష : బిచ్చగాడా … మజాకా – బోరింగ్ బ్రేక్ అప్ లవ్ స్టోరీ

Published on Feb 1, 2019 3:35 PM IST
BichagaadaMajaaka movie review

విడుదల తేదీ : ఫిబ్రవరి 01, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 1.5/5

నటీనటులు : అర్జున్ రెడ్డి , నేహా దేశ్ పాండే ,సుమన్ , బాబు మోహన్

దర్శకత్వం : కెయస్ నాగేశ్వరరావు

నిర్మాత : బి చంద్రశేఖర్

సంగీతం : శ్రీ వెంకట్

ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్

అర్జున్ రెడ్డి , నేహా దేశ్ పాండే హీరో హీరోయిన్లుగా కెయస్ నాగేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బిచ్చగాడా … మజాకా. మరి ఈ రోజు ప్రేక్షకులముందుకు వచ్చిన ఈచిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ..

 

కథ :

సిద్ధూ (అర్జున్ రెడ్డి ), అవని ( నేహా దేశ్ పాండే ) ఇద్దరు తొలి చూపులోనే ప్రేమలో పడతారు. అవని తండ్రి (సుమన్) కు సిద్ధూ అంటే ముందు నుండే నచ్చదు. అయితే తన కూతురు కోసం ఒక కండిషన్ మీద వాళ్లిద్దరి పెళ్ళికి ఒప్పుకుంటాడు. ఇంతకీ ఏంటి ఆ కండిషన్ ? సిద్ధూ , అవని ల కథ చివరి ఏమైంది అనే విషయాలు తెలియాలంటే తెర మీద చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

సిద్ధూ పాత్రలో నటించిన అర్జున్ రెడ్డి మొదటి సినిమా అయినా చాలా కాన్ఫిడెంట్ గా నటించాడు.అలాగే లుక్స్ పరంగా కూడా పర్వాలేదనిపించాడు. ఎక్కడ ఓవర్ గా రియాక్ట్ అవ్వకుండా చాలా కూల్ గా తన పాత్రను చేసుకుంటూ వెళ్లాడు. ఇక హీరోయిన్ పాత్రలో నటించిన నేహా దేశ్ పాండే కూడా చాలా బాగా నటించింది. గ్లామర్ పరంగా వావ్ అనిపించుకోక పోయిన నటనతో ఆకట్టుకుంది.

ఇక రిచ్ బిజినెస్ మెన్ గా నటించిన సుమన్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. అలాగే బిచ్చగాడు పాత్రలో నటించిన ప్రముఖ హాస్య నటుడు బాబు మోహన్ తన పాత్ర తో అక్కడ అక్కడ నవ్వించాడు. ఇక మిగతా పాత్రల్లో నటించిన ధనరాజ్ , రాజు తమ పాత్రలకు న్యాయం చేశారు.

 

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు కెయస్ నాగేశ్వర రావు ఒక మంచి బ్రేక్అప్ లవ్ స్టోరీ ని తెర మీదకు తీసుకువచ్చే ప్రయత్నంలో పూర్తిగా తడబడ్డాడు. సిల్లీ కండీషన్ తో సినిమాని బోరింగ్ గా మార్చేశాడు. ఇక సినిమాలో వచ్చే చాలా సన్నివేశాలు సిల్లీ గా ఉండి విసుగు తెప్పిస్తాయి. హీరో , హీరోయిన్ల మధ్య లవ్ స్టోరీ కూడా కొత్తగా ఏం అనిపించదు.

ఇక సొసైటీ కోసం తన ప్రేమను త్యాగం చేసే పాయింట్ బాగానే వున్నా దాని చుట్టూ అల్లుకున్న కథ మాత్రం బాగాలేదు. దానికి తోడు కథనం కూడా ఎంగేజిగ్ గా అనిపించక పోవడంతో సినిమా చాలా సాదా సీదా గా అనిపిస్తుంది అలాగే పాటలు కూడా సినిమాకి మైనస్ అయ్యాయి.

ఇక వీటికి తోడు సినిమా లో బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం కావడంతో స్క్రీన్ ఫై సాదా సీదాగా కనిపించి సినిమా చూడాలనే ఆసక్తిని తీసుకరాలేదు.

 

సాంకేతిక విభాగం :

దర్శకుడు కెయస్ నాగేశ్వర రావు దర్శకుడిగా ఫెయిల్ అయ్యారు. ఎంచుకున్న పాయింట్ బాగున్నా దాని చుట్టూ అల్లుకున్న కథ , కథనం లో ఏమాత్రం ప్రత్యేకత లేకపోవడం తో సినిమా బోరింగ్ గా తయారైయ్యింది. ఇక శ్రీ వెంకట్ సంగీతం చాలా ఆర్డినరీ గా వుంది. పాటల్లో ఒక్కటి కూడా గుర్తిండిపోదు. ప్రముఖ ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ అందించిన ఎడిటింగ్ బాగుంది. అలాగే సినిమాటోగ్రఫీ కూడా పర్వాలేదు. ఇక నిర్మాత చంద్రశేఖర్ సినిమాని చాలా లో బడ్జెట్లో నిర్మించడం తో సినిమాలో రిచ్ లుక్ కనిపించదు.

 

తీర్పు :

కెయస్ నాగేశ్వర రావు దర్శకత్వంలో బ్రేక్ అప్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన బిచ్చగాడా.. మజాకా లో లీడ్ పెయిర్ నటన సినిమా కి హైలైట్ అవ్వగా కథ , కథనం , సంగీతం సినిమాకి మైనస్ అయ్యాయి. చివరగా ఈ చిత్రం ఏ వర్గాన్ని కూడా మెప్పించే అవకాశం లేదు.

 

123telugu.com Rating : 1.5/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు