విడుదల తేదీ : మార్చి 08, 2019
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
నటీనటులు : శాంతను భాగ్యరాజ్ , శృతి దంగే , రవి ప్రకాష్ ,తంబీ రామయ్య
దర్శకత్వం : అదిరూపాన్
నిర్మాత : భువన్ కుమార్ అల్లం
సంగీతం : జీవి ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రఫర్ : వివేక్ హర్షన్
శాంతను భాగ్యరాజ్ , శృతి దంగే జంటగా నటించిన చిత్రం లవ్ గేమ్. అదిరూపాన్ తెరక్కించిన చిత్రం ఈ రోజు విడుదలైయింది. మరి ఈ రోజు చిత్రం ఎలా వుందో ఇప్పుడు చూద్దాం..
కథ :
చరణ్ (శాంతను భాగ్యరాజ్ ),అనూష ( శృతి దంగే ) చిన్నప్పటి నుండి ఒకరోనొకరు ప్రేమించుకుంటారు. అయితే వీరి ప్రేమ వ్యవహారం అనూష ఇంట్లో వారికి నచ్చదు. దాంతో ఆమెను చదువు కోసమని వేరే చోటికి పంపిస్తారు. కొంత కాలం తరువాత అనూష కు అలాగే స్టార్ హీరో అయినా సంతోష్ కి పెళ్లి పిక్స్ చేస్తారు. సరిగ్గా పెళ్లి జరుగుతున్నప్పుడే అనూష ను కిడ్నాప్ చేస్తాడుచరణ్. ఇంతకీ చరణ్ ఎందుకు కిడ్నాప్ చేస్తాడు ? అనూష కాలేజీ లో వున్నప్పుడు ఏం జరిగింది ? చివరికి చరణ్ , అనూష లు ఒక్కటైయ్యారా ? అనేదే మిగితా కథ.
ప్లస్ పాయింట్స్ :
సినిమాకి ప్లస్ పాయింట్స్ అంటే లీడ్ పెయిరే. సిన్సియర్ ప్రేమికుడిగా చరణ్ పాత్రలో నటించిన తమిళ నటుడు శాంతను భాగ్యరాజ్ బాగా నటించాడు. ఇక ఈసినిమాలో హీరోయిన్ రోల్ హైలైట్ గా చెప్పొచ్చు. మంచి వెయిట్ వున్న పాత్రలో శృతి దంగే చక్కగా నటించింది. ఇక విలన్ పాత్రలో నటించిన రవి ప్రకాష్ నటన బాగుంది.
ఇక సినిమా ను ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ చేసి సినిమాపై ఆసక్తిని పెంచడంలో డైరెక్టర్ విజయం సాధించాడు. అలాగే ఇంటెర్వేల్ ట్విస్ట్ కూడా బాగుంది. హీరోయిన్ బ్యాక్ డ్రాప్ ను రివీల్ చేసిన తీరు బాగుంది.
మైనస్ పాయింట్స్ :
సినిమాకి మైనస్ పాయింట్ అంటే రొటీన్ స్టోరీ నే. కథ పాతదే అయినా కథనం తో ఇంప్రెస్ చేయాలనీ ప్రయత్నించాడు డైరెక్టర్ కానీ ఆ విషయంలో పూర్తిగా సక్సెస్ కాలేకపోయాడు. ముఖ్యంగా క్లైమాక్స్ ఈచిత్రానికి పెద్ద మైనస్. స్టోరీ పరంగా క్లైమాక్స్ ఓకే అనిపించిన అనూష పాత్ర కు జస్టిఫికేషన్ ఇవ్వలేకపోయాడు దర్శకుడు.
ఇలాంటి క్లైమాక్స్ తమిళ ప్రేక్షకులకు నచ్చుతుందేమో కానీ తెలుగు ఆడియెన్స్ కనెక్ట్ అవ్వలేరు. ఇక సినిమా అంతా సీరియస్ గా సాగడం ఎంటర్టైన్మెంట్ లేకపోవడం కూడా మరో మైనస్ గా చెప్పొచ్చు. అలాగే తమిళం తో తీసిన సినిమా కావడం తో ఒక్క రవి ప్రకాష్ తప్ప తెలుగు వారికి తెలిసిన నటీనటులుసినిమాలో ఎక్కడా కనిపించరు.
సాంకేతిక విభాగం :
ట్రయాంగిల్ లవ్ స్టోరీ నేపథ్యంలో కథను రాసుకున్న దర్శకుడు దాన్ని ఇంట్రస్టింగ్ గా తెరమీదకు తీసుకురాలేకపోయాడు. గతంలో ఇలాంటి కాన్సెప్ట్ తో సినిమాలు రావడంతో ఈసినిమా అంత ఎక్సయిటింగ్ గా అనిపించదు. ఇక మిగితా టెక్నిషయన్స్ విషయానికి వస్తే లీడింగ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్ సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది.
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. వివేక్ హర్షన్ సినిమాటోగ్రఫీ సినిమాకు పెద్ద అసెట్. ప్రతి ఫ్రెమ్ చాలా రిచ్ గా అనిపిస్తుంది. ఎడిటింగ్ కూడా బాగుంది. మీడియం బడ్జెట్ లో మంచి క్వాలిటీ తో ఈ చిత్రాన్ని నిర్మించారు చిత్ర నిర్మాతలు.
తీర్పు :
లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ లవ్ గేమ్ లో హీరోహీరోయిన్ల నటన , ఇంటర్వెల్ ట్విస్ట్ , సంగీతం హైలైట్ అవ్వగా రొటీన్ స్టోరీ , క్లైమాక్స్ సినిమాకు మైనస్ అయ్యాయి. చివరగా ఈ చిత్రం అన్నివర్గాల వారికీ కనెక్ట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ.
123telugu.com Rating : 2.25/5
Reviewed by 123telugu Team