విడుదల తేదీ : మే 03, 2019
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
నటీనటులు : సుధాకర్ కొమకుల, నిరోషా, నిత్య శెట్టి
దర్శకత్వం :డి హరినాథ్ బాబు
నిర్మాత : శ్రీకాంత్ దడువై
సంగీతం : సురేష్ బొబ్బిలి
సినిమాటోగ్రఫర్ : వెంకట్ దిలీప్
ఎడిటర్ : ఎస్ బి ఉద్దవ్
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్ సుధాకర్ కొమాకుల హీరోగా నటించిన చిత్రం నువ్వు తోపురా… హరినాథ్ బాబు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకులముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
కథ :
సూరి (సుధాకర్) హైదరాబాద్ లోని సరూర్ నగర్ కుర్రాడు. బీటెక్ మధ్యలోనే ఆపేసి ఏపని చేయకుండా ఖాళీగా తిరుగుతుంటాడు. ఈ క్రమంలో రమ్య (నిత్య శెట్టి ) తో ప్రేమలో పడతాడు. అయితే సూరి ఖాళీగా తిరగడం రమ్య కు నచ్చకపోవడంతో బ్రేక్ అప్ చేసుకొని యూ ఎస్ వెళ్ళిపోతుంది.
ఇక ఆ బాధను మరిచిపోలేకపోతున్న క్రమంలో సూరి కి అనుకోకుండా అమెరికా వెళ్లే ఛాన్స్ వస్తుంది. అమెరికా వెళ్ళాక సూరి కి వాళ్ల అమ్మకు ఆరోగ్యం సరిగా లేదని తెలియడం తో ఎలాగైనా అక్కడే సెటిల్ అయ్యి డబ్బు సంపాదించాలనుకుంటాడు. మరి డబ్బు కోసం సూరి అమెరికా లో ఏం చేశాడు ? చివరికి సూరి నువ్వు తోపురా అని అనిపించుకున్నాడా లేదా అనేదే మిగితా కథ.
ప్లస్ పాయింట్స్ :
సినిమా కు ప్లస్ అంటే సూరి పాత్రే. ఇక ఆ పాత్రలో నటించిన సుధాకర్ మన గల్లీ లో వుండే కుర్రాడి ల బాగానే నటించాడు. తెలంగాణ స్లాంగ్ కూడా సూరికి బాగా సెట్ అయ్యింది. సినిమా ను అంతా తన భుజాలపై వేసుకొని నడిపించాడు.
ఇక మిగితా పాత్రల విషయానికి వస్తే హీరో ఫ్రెండ్ పాత్రలో నటించిన యంగ్ హీరో వరుణ్ సందేశ్ తన పాత్ర పరిధి మేర నటించగా హీరో తల్లి పాత్రలో సీనియర్ హీరోయిన్ నిరోషా మెప్పించింది అలాగే హీరోయిన్ గా నటించిన నిత్యా శెట్టి మొదటి సినిమా అయినా కాన్ఫిడెంట్ గా నటించింది. ఇక ఫస్ట్ హాఫ్ లో లీడ్ పెయిర్ మధ్య వచ్చే సన్నివేశాలు నవ్విస్తాయి.
మైనస్ పాయింట్స్ :
సినిమాకు మెయిన్ మైనస్ అంటే ప్రాపర్ స్టోరీ లేకపోడమే. ఫస్ట్ హాఫ్ లో మొదటి 20 నిమిషాల వరకు ప్రేక్షకులను సినిమాకు బాగానే కనెక్ట్ చేసిన దర్శకుడు ఆతరువాత తేలిపోయాడు. ఒకానొక దశలో స్టోరీ సైడ్ ట్రాక్ అయ్యి సినిమా ఎటుపోతుందనే అయోమయానికి గురి చేశాడు దర్శకుడు.
ముఖ్యంగా సినిమా యూఎస్ కు షిఫ్ట్ అయ్యాక వచ్చే కథనం ఏ మాత్రం ఆసక్తిగా అనిపించలేదు. దానికి తోడు స్లో నరేషన్ సినిమా ను బోరింగ్ గా మార్చేసింది. ఇక చాలా రోజుల తరువాత తెర ఫై కనిపించిన వరుణ్ సందేశ్ అసలు ఈ సినిమా ఎలా ఒప్పుకున్నాడో అర్ధం కాదు. ఏమైనా గుర్తిండిపోయే పాత్రా అంటే అదికాదు అసలు ఏ మాత్రం ఇంపార్టెన్స్ లేని రోల్.
ఇక సినిమా క్లైమాక్స్ కూడా ఏమంత కన్విన్సింగ్ గా అనిపించదు. సినిమాలో హైలెట్ అనే సన్నివేశం ఒక్కటి కూడా లేదంటే సినిమా ఎలా సాగిందో అర్ధం చేసుకోవచ్చు.
సాంకేతిక విభాగం :
డైరెక్టర్ హరిబాబు సినిమా ద్వారా చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పలేదు. నిరసించిన కథనం , స్లో నరేషన్ ,ట్విస్టులు లేకపోవడంతో సినిమా మరి సాదా సీదాగా అనిపించింది. కథ తో పాటు కథనం పై ఇంకాస్త ద్రుష్టి పెట్టి ఉంటే మంచి అవుట్ ఫుట్ వచ్చేదే.
ఇక మిగితా టెక్నిషియన్స్ విషయానికి వస్తే సురేష్ బొబ్బిలి సంగీతం పర్వాలేదనిపించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫి చాలా బాగుంది. ఎడిటింగ్ మీద ఇంకాస్త ద్రుష్టి పెట్టాల్సింది. సినిమా మరి లెంగ్తి గా అనిపించింది. నిర్మాణ విలువలు రిచ్ గా వున్నాయి. 80 శాతం సినిమాను యూఎస్ లో నే చిత్రీకరించారు .
తీర్పు :
రొటీన్ ఎంటర్టైనెర్ గా వచ్చిన ఈ నువ్వు తోపురా లో హీరో పాత్రా తప్పే మిగతా వేవి హైలెట్ కాలేదు. డైరెక్షన్ , కథ , కథనం ,క్లైమాక్స్ సినిమా ఫలితాన్ని దెబ్బతిశాయి. సుధాకర్ సినిమాను కాపాడుదామని చేసిన ప్రయత్నాలు పలించేలేదు. ఇక చివరగా ఈ చిత్రం మాత్రం థియేటర్ లో కూర్చొని హాయిగా ఎంజాయ్ చేసే సినిమా కాదనే చెప్పొచ్చు.
123telugu.com Rating : 2.25/5
Reviewed by 123telugu Team