విడుదల తేది : 25 నవంబర్ 2011 | ||
దర్శకుడు : పరశురం | ||
నిర్మాత : వంశి కృష్ణ శ్రీనివాస్ | ||
దర్శకుడు సంగీతం : మణిశర్మ | ||
తారాగణం : నారా రోహిత్, నిషా అగర్వాల్, ప్రకాష్ రాజ్, ఆలీ, జయసుధ , యమ్.ఎస్ నారాయణ |
బాణం వంటి ప్రయోగాత్మక చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నహీరో నారా రోహిత్. ఏమైంది ఈ వేల చిత్రంతో యువకుల మనసులు దోచుకున్న హీరోయిన్ నిషా అగర్వాల్.
యువత, ఆంజనేయులు వంటి మాస్ చిత్రాల దర్శకుడు పరుశురాం. వీరందరి కాంబినేషన్లో వచ్చిన చిత్రం సోలో. ఈ చిత్రం ప్రేక్షకుల తీర్పును కోరుతూ ఈ రోజే విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందొ చూద్దాం.
కథ:
వైజాగ్ లోని ఒక అనాధాశ్రమంలో ఉండే గౌతమ్ (నారా రోహిత్) అనే ఒక అనాధ కథే సోలో. తను చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉన్న పర్వాలేదు కాని ఆ అమ్మాయికి మాత్రం
పెద్ద కుటుంబం ఉండాలని కోరుకుంటాడు గౌతమ్. వైష్ణవి (నిషా అగర్వాల్) ని మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. గౌతమ్ ఉన్నత భావాలు నచ్చి వైష్ణవి కూడా అతనిని ప్రేమిస్తుంది. వైష్ణవి తండ్రి రఘుపతి నాయుడు (ప్రకాష్ రాజ్) వీరి ప్రేమకి అంగీకరించడా లేదా అన్నది చిత్ర మిగతా కథ.
ప్లస్ పాయింట్స్:
రోహిత్, ప్రకాష్ రాజ్, జయసుధల అధ్బుతమైన నటన ప్రతీ ఒక్క ప్రేక్షకుడి మనసును హత్తుకుంటుంది. నారా రోహిత్ తన నటనలో మంచి పరిణతి చూపించాడు. ఫైట్స్, డాన్సులు కూడా బాగా చేసాడు. మొదటి చిత్రంలో పర్వాలేదు అనిపించుకున్న నిషా అగర్వాల్ ఈ చిత్రంలో బాగానే చేసింది. చిత్ర పతాక సన్నివేశాల్లో బాగా నటించింది.
ప్రకాష్ రాజ్ ఇలాంటి పాత్రలు చేయడంలో దిట్ట. అక్కడక్కడ తను నటించిన గత చిత్రాలు గుర్తుకు వచ్చినా అధ్బుతంగా నటించాడు. ప్రకాష్ రాజ్ మరియు జయసుధ నటించిన సన్నివేశాలు అధ్బుతంగా వచ్చాయి. శ్రీనివాస్ రెడ్డి కామెడీ బాగా నవ్విస్తుంది. డాక్టర్ ధర్మగా ఎమ్మెస్ నారాయణ, జేమ్స్ కెమరాన్ గా అలీ నవ్విస్తారు. షాయాజీ షిండే పర్వలేదనిపించాగా మిగతా నటీ నటులు తమ తమ పరిధిలో నటించారు.
మైనస్ పాయింట్స్:
సినిమా ద్వితీయార్ధంలో ఫ్యామిలీ డ్రామా కొద్దిగా ఎక్కువైనట్లు అనిపిస్తుంది. ప్రథమార్థం కొత్తగా అనిపించినా ద్వితీయార్ధం మాత్రం గతంలో వచ్చిన ‘నువ్వు నాకు నచ్చావ్’ మరియు ‘నువ్వే నువ్వే’ చిత్రాలను గుర్తు చేస్తుంది. వైష్ణవి గౌతమ్ ని ప్రేమించడానికి గల కారణాన్ని దర్శకుడు బలంగా చూపించలేకపోయాడు. ద్వితీయార్ధంలో స్క్రీన్ప్లే కొద్దిగా నెమ్మదించింది.
సాంకేతిక విభాగం:
మణిశర్మ అందించిన 3 పాటలు బావున్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. అది చాలా బాగా ఇచ్చారు. దాశరధి శివేంద్ర అందించిన సినిమాటోగ్రఫీ అధ్బుతంగా ఉంది. పరుశురం రాసిన డైలాగులు కూడా చాల బావున్నాయి. పరుశురాం గత చిత్రాలతో పోలిస్తే ఈ చిత్రాన్ని బాగా తీసాడనే చెప్పుకోవాలి. అందరు నటీ నటుల నుండి మంచి నటనను రాబట్టాడు. ఎడిటింగ్ బావుంది.
తీర్పు:
ప్రకాష్ రాజ్ మరియు రోహిత్ అధ్బుతమైన నటన, పరుశురాం డైలాగులు, దాశరధి శివేంద్ర సినిమాటోగ్రఫీ, మణిశర్మ అందించిన పాటలు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, శ్రీనివాస్ రెడ్డి కామెడీ వెరసి సోలో చిత్రాన్ని సాలిడ్ చిత్రంగా వచ్చేలా చేసాయి. ప్రధమార్ధంతో యువతని ఆకర్షించే ప్రయత్నం చేయగా ద్వితీయార్ధంతో ఫ్యామిలీ ఆడియెన్సుకు దగ్గరయ్యాడు. ద్వితీయార్ధంలో స్క్రీన్ప్లే ఇంకా పక్కగా రాసుకుని ఉంటే బావుండేది. అయినా సరే ప్రేక్షకులు మంచి వినోదాన్ని పంచుతుంది.
అశోక్ రెడ్డి.ఎం
123తెలుగు.కాం రేటింగ్ :
సోలో చిత్రానికి మేము అఫీషియల్ మీడియా పార్టనర్ గా ఉన్నాము. మేము ప్రమోట్ చేసిన చిత్రానికి రేటింగ్ ఇవ్వడం సబబు కాదు. అందువల్ల ఈ చిత్రానికి మేము రేటింగ్ ఇవ్వడం లేదు. సోలో చిత్రం బావుంది చూసి ఎంజాయ్ చేయండి.