“మన్మధుడు 2” చిత్రంతో కింగ్ నాగార్జున మరో మారు మన్మధుడిగా అవతారం ఎత్తాడు. కామెడీ,రొమాన్స్, ఎమోషనల్ అంశాలతో దర్శకుడు రాహుల్ రవీంద్ర ఈ చిత్రాన్ని తెరక్కెక్కించడం జరిగింది. పెళ్లి,పిల్లలు వంటి శాశ్వత బంధాలను ఇష్టపడని పెళ్లికాని ముదురు బ్రహ్మచారిగా నాగ్ ఈ చిత్రంలో కనిపించనున్నారు. కాగా నిన్నఈ మూవీ మ్యూజిక్ జ్యూక్ బాక్స్ ని విడుదల చేయడం జరిగింది. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరద్వాజ్ సంగీతం అందించిన మూడు పాటల జ్యూక్ బాక్స్ ఎలా ఉందో ఇప్పుడు సమీక్షిద్దాం.
Song 1: హే మీనైనా…
సింగర్స్: చైతన్ భరద్వాజ్
లిరిక్స్:శుభమ్ విశ్వనాధ్
Analysis: మొదటి సాంగ్ హే మీనైనా…. సోలోగా నాగార్జున మీదసాగే సాంగ్. రాప్ తో కూడిన వెస్ట్రన్ బీట్ లో స్వరపరచిన మీనైనా సాంగ్, ఈ చిత్రంలో నాగార్జున పాత్ర యొక్క నేచర్ చెప్పేవిధంగా ఉంది. శుభం విశ్వనాధ్ రాసిన లిరిక్స్ కూడా మన్మధుడు 2 లో నాగార్జున ప్లే బాయ్ తత్వాన్ని ఎలివేట్ చేసేలా రాశారు. ఐతే పాట వినడానికి చాలా ఆహ్లాదంగా ఉందని చెప్పాలి. దర్శకుడు చైతన్ భరద్వాజ్ స్వయంగా ఈ పాటని పాడటం జరిగింది. మూవీలో ఇది మొదటిపాటగా రానుంది. మేఘరాజ్ రవీంద్ర ఈ పాటకు రాప్ ని రాసి,పాడటం జరిగింది.కథ రీత్యా ఈ చిత్రం మేజర్ పార్ట్ పోర్చుగల్ లో తెరకెక్కించడం జరిగింది. దానితో ఈ పాటలో లొకేషన్స్ సందర్భానికి తగ్గట్టుగా చాలా రిచ్ గా ఉన్నాయి.
Song 2:మా చక్కని పెళ్ళంటా….
సింగర్స్: అనురాగ్ కులకర్ణి,చిన్మయి,దీప్తి పార్థసారథి
లిరిక్స్:కిట్టు విస్సాప్రగడ
Analysis: ఇక రెండవ సాంగ్ మా చక్కని పెళ్ళంటా… నాగార్జున,రకుల్ పెళ్లి సందర్భంలో నడిచే సాంగ్. ఇరుకుటుంబాల బంధువుల మధ్య సందడిగా సాగే ఈ పాటకి లిరిక్స్ కిట్టు విస్సా ప్రగడ సంధర్బోచితంగా రాయడం జరిగింది. అనురాగ్ కులకర్ణి మేల్ సింగర్ కి తోడుగా చిన్మయి,దీప్తి పార్థ సారథి ఫిమేల్ సింగర్స్ గొంతు కలిపారు. సాధారణంగా తెలుగు పెళ్లిళ్లలో ఉండే సందడి గుర్తుకు తెచ్చేలా పూర్తిగా తెలుగు నేటివిటీతో చైతన్ భరద్వాజ్ ఈ పాటను స్వరపరిచారు. కలర్ఫుల్ సెట్టింగులో బంధువారసమేతంగా సాగే ఈ సాంగ్ ఆహ్లాదం పంచుతుంది అనడంలో సందేహం లేదు.
Song 3: నీలోనా…
సింగర్స్: చిన్మయి శ్రీపాద
లిరిక్స్:శుభమ్ విశ్వనాధ్
Analysis: ఇక మూడవ సాంగ్ నీలోనా… రొమాంటిక్ గా సాగే మెలోడీ సాంగ్. నాగార్జున,రకుల్ మధ్య నడిచే రొమాంటిక్ సన్నివేశాల సందర్భంలో వచ్చే ఈ సాంగ్ మిగతా రెండు పాటలకు మించి ఉంది అనడంలో సందేహం లేదు. అబ్బాయిపై అమ్మాయికి కలిగే ఆకర్షణను ప్రతిబింబించేలా శుభమ్ విశ్వనాధ్ లిరిక్స్ రాశారు. ఇలాంటి రొమాంటిక్ మెలోడీస్ పాడటంలో దిట్టైన చిన్మయి మనసుపెట్టి చక్కగా పాడారు. హీరో,హీరోయిన్ మధ్య చక్కని రిలేషన్ ఏర్పడే సందర్భంలో వచ్చే ఈ సాంగ్ మూవీకి హైలెట్ అవుతుందనిపిస్తుంది. చైతన్ మెలోడియస్ కంపోజిషన్ బాగుంది.
తీర్పు :-
కేవలం మూడు పాటలతో కూడిన “మన్మధుడు 2” జ్యూక్ బాక్స్ ఆహ్లదకరంగా ఉంది. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరద్వాజ్ సినిమా కథకు తగ్గట్లుగా మూడు చక్కని పాటలు స్వరపరచి మరోమారు ప్రేక్షకుల ప్రసంశలు అందుకున్నారు. గతంలో “మన్మధుడు” చిత్రానికి నాగార్జున దేవిశ్రీకి స్వరాలూ సమకూర్చే అవకాశం ఇచ్చి బెస్ట్ ఆల్బమ్ అందుకున్నారు. మరోమారు చైతన్ “మన్మధుడు 2” చిత్రంతో నాగ్ కి మరో మ్యూజికల్ హిట్ ఇస్తాడనిపిస్తుంది. కాగా “మన్మధుడు 2” ఈనెల 9న గ్రాండ్ గా విడుదల కానుంది.