విడుదల తేదీ: 18 అక్టోబర్ 2012 | ||
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5 |
||
దర్శకుడు : పూరి జగన్నాధ్ |
||
నిర్మాత : డివివి దానయ్య | ||
సంగీతం: మణి శర్మ |
||
నటీనటులు : పవన్ కళ్యాణ్, తమన్నా, ప్రకాష్ రాజ్ |
వరుసగా ఎన్ని ఫ్లాపులు పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమా వస్తుంది అంటే అంచనాలు, ఓపెనింగ్స్ తారా స్థాయిలో ఉంటాయి. రీసెంట్ గా గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మంచి ఊపు మీదున్న పవన్ కళ్యాణ్ కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా భారీ అంచనాల ఈ రోజే విడుదలైంది. బద్రి తరువాత పవన్ – పూరి క్రేజీ కాంబినేషన్ కలిసి పనిచేయడంతో పవన్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేసారు. ఇన్ని అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.
కథ :
న్యూస్ పేపర్లో, న్యూస్ చానల్స్ లో సమాజంలో జరుగుతున్న అన్యాయాలని వచ్చే వార్తలు చూసి స్పందించే రాంబాబు (పవన్ కళ్యాణ్) అక్కడికి వెళ్లి అన్యాయం చేసిన వాళ్ళని కొట్టి న్యాయం చేస్తాడు. అతని స్టైల్ చూసి మెచ్చిన న్యూస్ ఛానల్ పని చేసే కెమెరామెన్ గంగ (తమన్నా) జర్నలిస్ట్ గా తమ ఛానల్ జాయిన్ చేయిస్తుంది. మాజీ సి.ఎం జవహర్ నాయుడు (కోట శ్రీనివాస రావు) చేసే అరాచకాలకు అడ్డుపడుతున్నాడని దశరధ రాములు (సూర్య) అనే జర్నలిస్టుని జవహర్ నాయుడు కొడుకు రానా బాబు (ప్రకాష్ రాజ్) చంపుతాడు. దాశరధ రాములుని చంపింది రానా బాబు అని తెలుసుకున్న రానా బాబుని అరెస్ట్ చేయిస్తాడు. రాజకీయంలో పండిపోయిన జవహర్ నాయుడు తన కొడుకు రానా బాబుని సి.ఎం చేయాలనుకుంటాడు.ఈ లోపు ఊహించని మలుపు. రాష్ట రాజకీయాల్లో రాంబాబు మార్పు తీసుకు వస్తాడు. ఆ మార్పు ఏంటి చివరికి ఏమైంది అనేది చిత్ర కథ.
ప్లస్ పాయింట్స్ :
పవన్ కళ్యాణ్ కేవలం తన ఎనర్జీతో సినిమాని తన భుజాల మీద మోసాడు. ఈ సబ్జెక్టుని పవన్ తప్ప ఇంకెవరు చేసిన అంత బాగా పండేది కాదేమో. తెలుగు తల్లి మీద డైలాగులు చెప్పే సన్నివేశాల్లో పవన్ ఎనర్జీ అధ్బుతం. అలాగే ప్రీ క్లైమాక్స్ సన్నివేశాల్లో మీడియా ముందు 4 నిమిషాల పటు డైలాగులు చెప్పే సన్నివేశాలకి కూడా బాగా రెస్పాన్స్ వచ్చింది. మెలికలు తిరుగుతుంటే, పిల్లని చూస్తే పాటల్లో పవన్ డాన్స్ అభిమానులకి పండగ. పవన్ చెప్పిన సెకండ్ హాఫ్ లో పవన్ చెప్పిన డైలాగులు అభిమానుల చేత విజిల్స్ వేయించాయి. తమన్నా స్కిన్ షో బాగానే చేసింది. కోట శ్రీనివాస రావు రాజకీయ నాయకుల పాత్రల్లో ఇప్పుడున్న కొందరు రాజకీయ తలపించాయి. ముఖ్యంగా కోట ఇలాంటి పాత్రలు చేయడంలోపండిపోయారు. ప్రకాష్ రాజ్ కి కూడా ఇలాంటి పాత్రలు కూడా కొట్టిన పిండే. బ్రహ్మానందం, పవన్ మధ్య కామెడీ ఒక కామెడీ బిట్ బాగా పండింది. అలీ కామెడీ జస్ట్ ఓకే. సెకండ్ హాఫ్ లో వచ్చే తెలుగు తల్లి
మైనస్ పాయింట్స్ :
జనాలకి మెసేజ్ ఇద్దామనే ఉద్దేశంతో మంచి సబ్జెక్ట్ ఎంచుకున్న దర్శకుడు పూరి జగన్నాధ్ స్క్రిప్ట్ రాసుకోవడంలో తడబడ్డాడు. రాసుకున్న సన్నివేశాల్లో కొన్ని ఎపిసోడ్స్ పవన్ కళ్యాణ్ ఎనర్జీతో తెర మీద పండాయి కానీ అందులో పూరి పనితనం మాత్రం మిస్సయింది. ఫస్టాఫ్ అంతా ఫ్లాట్ గ బోర్ కొట్టకుండా తీసిన పూరి ఇంటర్వెల్ తరువాత తమన్నా, గబ్రియేల సీన్స్ తో ఇరిటేట్ చేసాడు. దీనికి తోడు తమన్నా ఓవర్ యాక్షన్ తో భయపెడితే గబ్రియేల అందంతో భయపెట్టింది. సినిమాలో తమన్నాకి ప్రూవ్ చేసుకోడానికి మంచి అవకాశం ఉన్నా టామ్ బాయ్ లాంటి పాత్ర ఆమెకి సూట్ కాలేదు. రానా బాబుకి తన తండ్రి జవహర్ నాయుడుని చంపాల్సిన అవసరం ఎందుకొచ్చింది. తండ్రి తనని సి.ఎం చేయాలనుకున్నప్పుడు తండ్రిని చంపి ప్రజల్లో సానుభూతి సంపాదించాలని చూస్తాడు కాని ఆ సానుభూతి వాడుకోవడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. హీరోకు మొదటి నుండి ఒక లక్ష్యం అంటూ లేకపోవడం ఒక మైనస్ అయితే, క్లైమాక్స్ సన్నివేశాల్లో రాంబాబు పిలవగానే లక్షల మంది జనం వస్తారు అంటూ చూపించిన సన్నివేశాలు మరీ సిల్లీగా ఉన్నాయి. అంత మంది జనం వచ్చినట్లు చూపించదానికి వాడిన గ్రాఫిక్స్ కూడా చీప్ గా ఉన్నాయి.
సాంకేతిక విభాగం :
శ్యాం కే నాయుడు సినిమాటోగ్రఫీ పర్వాలేదు. సినిమాని వేగంగా తీయడం వల్ల క్వాలిటీ మిస్సయింది. ఎడిటింగ్ ఇంకాస్త రేసీగా ఉంటె బావుండేది. మణిశర్మ సంగీతంలో మెలికల్ తిరుగుతుంటే, ఎక్స్ట్రార్డినరీ పాటలు బావున్నాయి. క్లైమాక్స్ లో వచ్చే తలదించుకు పాట బావుంటే క్లైమాక్స్ కి హెల్ప్ అయ్యేది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హీరో ఎలివేషన్ సన్నివేశాలకు బాగా హెల్ప్ అయింది. పూరి పెన్ నుండి గత సినిమాల స్థాయిలో డైలాగులు రాయలేదు. సెకండాఫ్ లో తెలుగు తల్లి, హాస్పిటల్ ముందు సన్నివేశాల్లో మాత్రం డైలాగులు బావున్నాయి.
తీర్పు :
గబ్బర్ సింగ్ భారీ హిట్ తరువాత పవన్ నుండి వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాల మధ్య కెమెరామెన్ గంగతో విడుదలైంది. పవన్ అభిమానులకి కావాల్సిన అంశాలన్ని ఉన్న ఈ సినిమాని పవన్ వన్ మాన్ షో చేసాడు. పూరి స్క్రిప్ట్, డైరెక్షన్ ఇంకాస్త బావుండి ఉంటె ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళేది.
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5
అశోక్ రెడ్డి .ఎమ్
Click Here For ‘Box Office Babu rao Puri Jagannadh interview’