సమీక్ష : ఆపరేషన్ గోల్డ్ ఫిష్ – యాక్షన్ సీన్స్ వరకు ఓకే !

సమీక్ష : ఆపరేషన్ గోల్డ్ ఫిష్ – యాక్షన్ సీన్స్ వరకు ఓకే !

Published on Oct 19, 2019 3:01 AM IST
Operation Gold Fish movie review

విడుదల తేదీ : అక్టోబర్ 18, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : ఆది, సాషా చెత్రి, అనీష్ కురువిల్లా, మనోజ్ నందం, కార్తీక్ రాజు, పార్వతీశం, నిత్య నరేష్, కృష్ణుడు, రావు రమేష్

దర్శకత్వం : అడివి సాయి కిరణ్

నిర్మాత‌లు : ప్రతిభా అడవి, కట్టా ఆశిష్ రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్, పద్మనాభ రెడ్డి, గ్యారీ బిహెచ్, సత్ష్ డేగల

సంగీతం : శ్రీ చరణ్ పాకాల

సినిమాటోగ్రఫర్ : జైపాల్ రెడ్డి

ఎడిటర్ : గ్యారీ బిహెచ్

ఆది సాయికుమార్ కథానాయకుడిగా, ప్రముఖ రచయిత అబ్బూరి రవి ప్రతినాయకుడిగా సాయికిరణ్ అడివి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ (ఒ.జి.యఫ్). ‘ఎయిర్ టెల్’ మోడ‌ల్ శ‌షా చెట్రి, కార్తీక్ రాజు, పార్వ‌తీశం, నిత్యా న‌రేశ్, కృష్ణుడు, అనీశ్ కురువిల్లా, రావు ర‌మేశ్‌ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

 

కథ :

 

కశ్మీర్ లోని 1990లలో కశ్మీర్ పండిట్లను ఘాజీ బాబా(అబ్బూరి రవి) కశ్మీర్ ని వదిలి వెళ్లిపోవాలని అతి దారుణంగా చంపుతాడు. అలా అతని చేతిలో అర్జున్ పండిట్ (ఆది సాయి కుమార్) తల్లిదండ్రులు కూడా ప్రాణాలు కోల్పోతారు. దాంతో చిన్నప్పటి నుండే అర్జున్ ఘాజీ బాబా మీద కసితోనే ఎన్.ఎస్.జి కమాండోగా అవుతాడు. ఘాజీ బాబాని రిస్క్ చేసి పట్టుకుంటాడు. అయితే ఘాజీని విడిపించుకోవడానికి అతని ప్రధాన అనుచరుడు ఫారూఖ్ (మనోజ్ నందం) సెంట్రల్ మినిష్టర్ శర్మ (రావు రమేష్) కూతురుని టార్గెట్ చేస్తాడు. ఈ క్రమంలో ఫారూఖ్ ని ఆపడానికి అర్జున్ ఏమి చేశాడు? ఘాజీని అతని గ్యాంగ్ ని ఎలా అంతం చేశాడు? లాంటి విషయాలు తెలియాలంటే వెండి తెర పై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

కశ్మీర్ లో 1990లలో కశ్మీర్ పండిట్లకు జరిగిన ఇష్యూను చాల డిటైల్డ్ గా చూపించడానికి దర్శకుడు చేసిన ప్రయత్నం, మరియు సినిమాలో ప్రధానంగా చర్చించిన కశ్మీర్ కి సంబధించిన అంశం..అలాగే ‘దేశం కోసం కొంతమంది నాయకులు, ఎన్.ఎస్.జి ఆఫీసర్స్ తమ కుటుంబాల్ని త్యాగం చేసైనా సరే దేశాన్ని ఎలా కాపాడుతున్నారనే ఇతివృత్తంతో ఈ సినిమా రూపొందించడం బాగుంది. ఇక ఆది సాయికుమార్, ఎన్.ఎస్.జి కమాండో అర్జున్ పండిట్ పాత్రలో బాగా నటించాడు. ఆర్ ఎస్ ఎస్ నేపథ్యం నుంచి వచ్చిన రాజకీయ నాయకుడిగా రావు రమేష్ తన నటనతో ఈ చిత్రంలోనే ఉత్తమమైన నటనను కనబర్చారు. ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని సన్నివేశాల్లో ఆయన నటన ఆకట్టుకుంటుంది.

ఇక అనీశ్ కురువిల్లా కూడా తన పాత్రలో ఎప్పటిలాగే చాల బాగా నటిస్తూ ఉన్నంతసేపు ఆకట్టుకుంటానికి ప్రయత్నించారు. కీలక పాత్రలో నటించిన అబ్బూరి రవి చాల బాగా నటించారు. ‘ఎయిర్ టెల్’ మోడ‌ల్ శ‌షా చెట్రి, కార్తీక్ రాజు, పార్వ‌తీశం, నిత్యా న‌రేశ్, కృష్ణుడు, మిగిలిన నటీనటులు కూడా బాగానే చేశారు. అలాగే ఆర్మీలో జరిగే కొన్ని సంఘటనలను విశ్లేషాత్మకంగా చూపించే ప్రయత్నం చేయడం బాగుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో వచ్చే కీలక సన్నివేశాలు బాగున్నాయి.

 

మైనస్ పాయింట్స్ :

 

సస్పెన్స్ కోసం డైరెక్టర్ ఎక్కువుగా చీటింగ్ స్క్రీన్ ప్లేనే నమ్ముకోవడం.. ఆ ప్లే కూడా ఏ మాత్రం లాజిక్ లేకుండా సాగడం, అలాగే సెకండ్ హాఫ్ ఇంట్రస్ట్ లేని ట్రీట్మెంట్ తో అనవసరమైన సీన్స్ తో బాగా సాగతీయడం, అన్నిటికి మించి మెయిన్ స్టోరీలోనే బలహీనమైన లోపాలు ఎక్కువుగా ఉండటం వంటి అంశాలు సినిమా రిజల్ట్ ని దెబ్బ తీశాయి. అయితే ఫస్ట్ హాఫ్ లో మంచి సెటప్ కుదిరినా.. ఆ తరివాత కథలో చోటు చేసుకున్న మలుపులు అన్ని అంత బలంగా అనిపించవు.

పాకిస్థాన్ నుండి వచ్చి ఇండియాలోని సెంట్రల్ మినిష్టర్ కూతురుని కిడ్నాప్ చేయడానికి మనోజ్ నందం గ్యాంగ్ ఇండియాకి వచ్చి.. కిడ్నాప్ కి ప్లాన్ చేయడమే సినిమాటిక్ అనుకుంటే.. ఆ తరువాత జరిగే పరిణామాలు అన్ని అసలు నమ్మే విధంగా ఉండవు. పైగా మనోజ్ గ్యాంగ్ తాము అనుకున్నట్లుగానే మినిస్టర్ కూతురుని కిడ్నాప్ చేసి.. మినిస్టర్ ని బ్లాక్ మెయిల్ చేస్తే.. ఆయన దేశం కోసం అప్పుడు తీరిగ్గా రాజీనామా చేసేయడం.. అసలు ఆ రాజీనామా ఏదో తనను తన కూతురుని టార్గెట్ చేసినప్పుడే చేసి ఉంటే ఏ గొడవ లేదుగా అనిపిస్తుంది. పోనీ ఆ రాజీనామా వల్ల వాళ్ళు తన కూతురుని వదిలేస్తారా అంటే అది లేదు.

ఖాజీ బాబాని విడిపించుకునే ప్రయత్నంలో వచ్చే సీన్స్ లో సగం సీన్స్ లేకపోయినా కథకు వచ్చే నష్టం ఏమిలేదు. అన్నట్లు ఈ క్రమంలో దర్శకుడు రెండు ప్రేమ కథలను కూడా చెప్పారు. కానీ వాటిలో ప్రేమతో పాటు కనీసం కామెడీ (కొన్ని చోట్ల తప్ప) కూడా వర్కౌట్ అవ్వలేదు. ఇక క్లైమాక్స్ లో హీరోకి ఫైట్ ఉండాలి కదా అని అనవసరంగా షీప్ లో ఫైట్ పెట్టారు. అసలు ఆ షీప్ లోకి వెళ్లకముందే హీరోకి విలన్ దొరికేశాడు. అక్కడే సినిమాని ముగించి ఉంటే బాగుండేది.

 

సాంకేతిక విభాగం :

 

సాంకేతిక విభాగం విషయానికి వస్తే కెమెరామెన్ అందించిన సినిమాటోగ్రఫీ ఈ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో ఆ ఫీల్ ను తన కెమెరా యాంగిల్స్ తో కళ్ళకు కట్టినట్టు చూపించాడు అలాగే ఎడిటింగ్ కూడా బావుంది.

సంగీతం పర్వాలేదు. అయితే ప్రీ క్లైమాక్స్ లో వచ్చే సాంగ్ చాల బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఇంకా బాగుంటే కథకు ప్లస్ అయ్యేది. ఇక దర్శకుడు మంచి కథాంశం తీసుకున్నా.. ఆ కథాంశానికి తగ్గట్లు ఉత్కంఠభరితమైన కథనాన్ని మాత్రం రాసుకోలేకపోయాడు. ఆయన స్క్రిప్ట్ మీద ఇంకా బాగా శ్రద్ద పెట్టి ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేది.
తీర్పు :

 

కశ్మీర్ లో 1990లలో కశ్మీర్ పండిట్లకు జరిగిన సంఘటనల ఆధారంగా అలాగే కశ్మీర్ అంశం పై వచ్చిన ఈ సినిమా యాక్షన్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో కొన్ని సన్నివేశాల్లో ఆసక్తికరంగా సాగుతుంది. అలాగే సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ మరియు క్లైమాక్స్ లో వచ్చే కొన్ని సీన్స్ అలరిస్తాయి. అయితే కొన్ని కీలక సన్నివేశాలన్నీ సహజత్వానికి దూరంగా సాగడం, కథనం కూడా ఇంట్రెస్ట్ గా సాగకపోవడం, అలాగే సెకండ్ హాఫ్ బోరింగ్ ట్రీట్మెంట్ తో అనవసరమైన సీన్స్ తో బాగా సాగతీయడం, పైగా మెయిన్ స్టోరీలోనే బలహీనమైన లోపాలు ఉండటం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. ఓవరాల్ గా ఈ ‘చిత్రం’ యాక్షన్ మూవీస్ ఇష్టపడేవారికి కొంతమేరకు నచ్చుతుంది. అయితే మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు