సమీక్ష : యాక్షన్ – పర్వాలేదనిపించే యాక్షన్ థ్రిల్లర్ !

సమీక్ష : యాక్షన్ – పర్వాలేదనిపించే యాక్షన్ థ్రిల్లర్ !

Published on Nov 16, 2019 3:03 AM IST
Action review

విడుదల తేదీ : నవంబర్ 15, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు : విశాల్, తమన్నా, ఐశ్వర్య లక్ష్మీ, యోగిబాబు, ఛాయా సింగ్ తదితరులు.

దర్శకత్వం : సుందర్‌ సి

నిర్మాత‌లు : శ్రీనివాస్ ఆడెపు

సంగీతం : హిప్‌హాప్‌ తమీజా

సినిమాటోగ్రఫర్ : డుడ్లీ

ఎడిటర్: : ఎన్ బి శ్రీకాంత్

 

యాక్షన్ హీరో విశాల్‌ హీరోగా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా తెరకెక్కిన పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ ‘యాక్షన్’‌. ప్రముఖ తమిళ దర్శకుడు సుందర్‌ సి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అటు తమిళంతో పాటు, ఇటు తెలుగులోనూ మంచి బజ్ ను క్రియేట్ చేసుకుంది. కాగా ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ :

విశాల్‌ (సుభాష్‌ ) ఆర్మీ కల్నల్ మరియు సీఎం కుమారుడు. తన బంధువు మీరా (ఐశ్వర్య లక్ష్మీ) విశాల్ ని ప్రేమిస్తోంది. విశాల్ కూడా ఆమెతో ప్రేమలో పడతాడు. అయితే ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య విశాల్ తండ్రి నిర్వహించిన పార్టీ మీటింగ్ లో బాంబ్ బ్లాస్ట్ జరిగి జాతీయ నాయకుడు కాబోయే పీఎం చనిపోతాడు. ఆ బ్లాస్ట్ కి విశాల్ ఫ్యామిలీకి సంబంధం ఉందని బలంగా ఆరోపణలు వినిపిస్తాయి. దాంతో సీఎం కాబోయే విశాల్ అన్నయ్య (రాంకీ) ఆ అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటారు. ఈ మధ్యలో ఆ బ్లాస్ట్ జరిగే ప్రాసెస్ లో మీరా కూడా హత్యకి గురవుతుంది. తన వాళ్ల చావుకి కారణమైన వాళ్ళను విశాల్ ఎలా పట్టుకున్నాడు? వాళ్ళకి ఎలాంటి శిక్ష వేశాడు? ఇంతకీ బ్లాస్ట్ కి కారణం అయిన వ్యక్తి ఎవరు?విశాల్ అతన్ని పట్టుకునే క్రమంలో విశాల్ నే ప్రేమిస్తోన్న తోటి ఆఫీసర్ తమన్నా ఎలాంటి సాయం చేసింది?లాంటి విషయాలు తెలియాలంటే ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

సినిమాలో యాక్షన్ వరకూ పరిగణలోకి తీసుకుంటే.. ఆ యాక్షన్ సీక్వెన్స్ స్ చూస్తున్నంతసేపూ ఓ హాలీవుడ్ యాక్షన్ మూవీని చూస్తున్న ఫీల్ కలుగుతుంది. ఇక విశాల్ తన యాక్షన్ తో ఈ చిత్రంలోనే ఉత్తమమైన నటనను కనబర్చారు. ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ యాక్షన్ తో, నటనతో సినిమాకే హైలెట్ గా నిలిచారు.

ఇక కథానాయకగా నటించిన తమన్నా తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటుగా తన నటనతోనూ బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో అలాగే సెకండ్ హాఫ్ లో వచ్చే సాంగ్ లోనూ తమన్నా నటన చాల బాగుంది. అలాగే మరో హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ కూడా కనిపించిన ఆ కొన్ని లవ్ సీన్స్ లో కూడా చాల క్యూట్ గా బాగా నటించింది. ముఖ్యంగా
విశాల్ – ఐశ్వర్య లక్ష్మీ మధ్య లవ్ ట్రాక్, వారి మధ్య కెమిస్ట్రీ కూడా ఆకట్టుకుంటాయి. ఇక సినిమాలో కీలక మైన పాత్రలో నటించిన రాంకీ తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు.

అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. ఇక దర్శకుడు ఎక్కడా యాక్షన్ ట్రీట్ తగ్గకుండా.. భారీ యాక్షన్స్ సీన్స్ తో సినిమాని నడిపాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ లో వచ్చే సీన్స్, అండ్ ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లోని యాక్షన్ సీక్వెన్స్ స్, మరియు కొన్ని ఛేజింగ్ సీన్స్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

మైనస్ పాయింట్స్ :

హై యాక్షన్ ఎంటర్ టైనర్ గా థ్రిల్లింగ్ ప్లేతో సాగే ఈ సినిమా, ట్విస్ట్ లు అండ్ యాక్షన్ లాంటి కీలక అంశాలు పరంగా ఆకట్టుకున్నా.. కథాకథనాల పరంగా మాత్రం నిరాశ పరుస్తోంది. కాబోయే పీఎం హత్యకి గురవ్వడం.. దానికి కారణం కాబోయే సీఎంనే అని ఆరోపణలు రావడం.. దాంతో ఆ అవమానం తట్టుకోలేక కాబోయే సీఎం ఆత్మహత్య చేసుకోవడం… ఇలా పాయింట్ పరంగా చెప్పుకుంటే దర్శకుడు ఇంట్రస్టింగ్ సెటప్ నే రాసుకున్న.. స్క్రీన్ ప్లే మరియు ట్రీట్మెంట్ అలాగే సెకండాఫ్ లలో వచ్చే సాగదీత సీన్స్, ఇంట్రస్ట్ గా సాగని మెయిన్ సీక్వెన్స్ స్ ముఖ్యంగా ప్లేలో చాల చోట్ల లాజిక్ మిస్ అవ్వడం సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలుస్తాయి.

మొత్తంగా దర్శకుడు ఫస్టాఫ్ ను ఆసక్తికరమైన యాక్షన్ తో నడిపినా.. ఆసక్తికరంగా సాగని సీన్స్ తో కొన్నిచోట్ల స్క్రీన్ ప్లే ను బోర్ గా నడిపారు. అలాగే సెకెండ్ హాఫ్ లో కూడా కొన్ని సీన్స్ బోర్ గానే సాగుతాయి. ముఖ్యంగా ఆ సీన్స్ లో ఇంట్రస్ట్ మిస్ అయింది. పైగా స్టోరీ కంటే కూడా సినిమాలో యాక్షన్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. స్క్రీన్ ప్లే చాల చోట్ల లాజిక్ మిస్ కాకుండా సెకెండ్ హాఫ్ ఇంకా ఇంట్రస్టింగ్ గా ఉండి ఉంటే ఈ సినిమా పూర్తి సంతృప్తికరంగా ఉండి ఉండేది.

సాంకేతిక విభాగం :

ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే… డుడ్లీ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని యాక్షన్ సన్నివేశాలతో పాటు మిగిలిన సన్నివేశాలను కూడా ఆయన చాలా అందంగా చిత్రీకరించారు. శ్రీకాంత్ ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. అయితే సినిమాలో ఇంట్రస్టింగ్ సాగని సీన్స్ ను సాధ్యమైనంత వరకు ట్రిమ్ చేసి ఉంటే.. సినిమాకి ప్లస్ అయ్యేది. ఇక సంగీత దర్శకుడు హిప్‌హాప్‌ తమీజా సమకూర్చిన పాటలు వినడానికి కంటే కూడా.. స్క్రీన్ మీద బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. అలాగే నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు చాల బాగున్నాయి.

తీర్పు :

సుందర్‌ సి దర్శకత్వంలో విశాల్‌ హీరోగా తమన్నా హీరోయిన్ గా తెరకెక్కిన ఈ పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్.. ఆకట్టుకునే హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సులతో, థ్రిల్ చేసే కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో మరియు విశాల్, తమన్నా స్క్రీన్ ప్రెజెన్సీ ఆసక్తికరంగా సాగినప్పటికీ.. ఏ మాత్రం లాజిల్ లేని సీక్వెన్సెస్ తో మరియు అక్కడక్కడ బోరింగ్ ట్రీట్మెంట్ తో, అలాగే బలం లేని మెయిన్ సీక్వెన్స్ స్ తో కొన్నిచోట్ల స్క్రీన్ ప్లే ఇంట్రస్ట్ గా సాగకపోగా బోర్ కొడుతోంది. కానీ సినిమాలోని భారీ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ విశాల్ నటన తమన్నా గ్లామర్ బాగా అలరిస్తాయి. మొత్తానికి ఈ ‘యాక్షన్’.. కథనంతో ఆకట్టుకోలేకపోయినా..సాధారణ ప్రేక్షకులకు మాత్రం ఓ మంచి యాక్షన్ ట్రీట్ ను ఇస్తోంది.

123telugu.com Rating : 3/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు