మెగాస్టార్ చిరంజీవి దగ్గర్నుండి వరుణ్ తేజ్ వరకు అందరు మెగా హీరోలకు గొప్ప అభిమానిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి నూర్ భాయ్. గ్రేటర్ హైదరాబాద్ మెగా ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గా ఉన్న ఆయన అనారోగ్యంతో ఈరోజు కన్నుమూశారు. ఈ సంగతి తెలిసిన మెగా అభిమానులు తీవ్ర మనస్థాపంలో ఉన్నారు. సోషల్ మీడియా మొత్తం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.
నూర్ భాయ్ చిరంజీవి నుండి పవన్, చరణ్, అల్లు అర్జున్, సాయి తేజ్, వరుణ్ తేజ్ ఇలా అందరి మెగా హీరోలకు చాలా సన్నిహితమైన వ్యక్తి. మెగా హీరోల అభిమానుల మధ్య ఎలాంటి చిన్న పొరపచ్చాలు వచ్చినా నూర్ భాయ్ సర్దుబాటు చేసిన సందర్భాలు అనేకం. సిటీలోని మెగా అభిమానుల్ని ఒక్కటిగా నడిపించడంలో, అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో ఆయన కృషి చాలా పెద్దది. అందుకే ఆయనంటే చిరుతో పాటు మెగా హీరోలందరికీ ఎంతో ఇష్టం. ఆయన్ను కేవలం అభిమానిగానే చూడకుండా కుటుంబంలోని వ్యక్తిగా చూసేవారు. అలాంటి గొప్ప వ్యక్తి మరణం మెగా హీరోలకు, అభిమానులకు పెద్ద లోటు అనే అనాలి.