సమీక్ష : సరిలేరు నీకెవ్వరు – కామెడీతో సాగే యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా !

సమీక్ష : సరిలేరు నీకెవ్వరు – కామెడీతో సాగే యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా !

Published on Jan 13, 2020 2:00 PM IST
 Sarileru Neekevvaru review

విడుదల తేదీ : జనవరి 11, 2020

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

నటీనటులు :  మహేష్ బాబు, విజయ శాంతి, రష్మిక మందాన, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, రావు రమేష్, సంగీత తదితరులు

దర్శకత్వం : అనిల్ రావిపూడి

నిర్మాత‌లు : రామ బ్రహ్మం సుంకర

సంగీతం :  దేవిశ్రీ ప్రసాద్

సినిమాటోగ్రఫర్ : రత్నవేలు

ఎడిటర్:  తమ్మిరాజు


సూపర్‌ స్టార్‌ మహేష్‌ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమా రాక కోసం సూపర్ స్టార్ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఆ ఆసక్తిని రెట్టింపు చేస్తూ ఈ చిత్రం ఈ రోజు అత్యధిక థియేటర్లలో విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

 

కథ :

ఆర్మీలో మేజర్ అయిన అజయ్ కృష్ణ (మహేష్ బాబు) పాక్ చేతిలో బంధింపబడిన పిల్లలను కాపాడటానికి తన టీమ్ తో శత్రువుల పై దాడికి వెళ్తాడు. అక్కడ తన టీమ్ లోని అజేయ్ (సత్యదేవ్) అనే సోల్జర్ తీవ్రంగా గాయపడి చనిపోయే పరిస్థితిలో వెళ్లిపోవడంతో.. అతని కుటుంబానికి అతని తల్లి విజయశాంతి (భారతి)కి ఈ విషయం చెప్పి.. భరోసా ఇవ్వడానికి అజేయ్ కృష్ణ కర్నూల్ కు వస్తాడు. ఈ మధ్యలో అజేయ్ కృష్ణకి సంస్కృతి (రష్మికా మందన్నా) పరిచయమై… ప్రేమ అంటూ వెంటపడుతుంది. ఆ తరువాత కొన్ని సంఘటనల అనంతరం కర్నూల్ లో విజయశాంతి (భారతి)ని ఆమె పిల్లలను చంపడానికి విలన్ గ్యాంగ్ ట్రై చేస్తుండగా.. మహేష్ వచ్చి వాళ్ళను సేవ్ చేస్తాడు. అసలు విజయశాంతి (భారతి) మరియు ప్రకాష్ రాజ్ ల మధ్య ఏం జరిగింది? ప్రకాష్ రాజ్ గ్యాంగ్ విజయశాంతి కుటుంబాన్ని ఎందుకు చంపాలనుకున్నారు? విజయశాంతి కుటుంబాన్ని వాళ్ళ నుండి మహేష్ బాబు ఎలా సేవ్ చేసాడు? చివరికి విలన్ ప్రకాష్ రాజ్ కి ఎలా బుద్ధి చెప్పాడు? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రాన్ని వెండి తెర పై చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

ఈ సంక్రాంతికి ఫేవరేట్ మూవీగా వచ్చిన ఈ సినిమా ఇటు నవ్విస్తూనే అటు యాక్షన్ తో పాటు ఎమోషనల్ గానూ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా మహేష్ బాబు నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఈ సినిమా అలాగే అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ తో సాగుతుంది. మహేష్ బాబు ఫైట్స్ అండ్ యాక్షన్ తో పాటు ఆయన కామెడీ టైమింగ్‌ కూడా ఈ సినిమాకి హైలెట్ గా నిలిచింది. తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ ఎప్పటిలాగే మహేశ్ తన స్టైలిష్ పెర్పార్మెన్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ఇక ప్రధానంగా సినిమాలో ట్రైన్ ఎపిసోడ్, మహేష్ – రష్మిక మధ్య వచ్చే లవ్ సీన్స్, మరియు విజయశాంతి ట్రాక్, సూపర్ స్టార్ కృష్ణ ఎంట్రీ సీన్ అలాగే కొన్ని కామెడీ సన్నివేశాలు, అనిల్ మార్క్ కామెడీ పంచ్‌ లు అండ్ మ్యానరిజమ్స్ చాల బాగున్నాయి.

 

ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మిక నటన పరంగా తన గ్లామరస్ పెర్ఫార్మెన్స్‌తో బాగానే నటించింది. అలాగే కీలకమైన విజ‌య‌శాంతి రోల్‌.. ఆ పాత్రలో ఆమె నటించిన విధానం ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో ఆమె నటన చాలా బాగుంది. మ రో ప్రధాన పాత్రలో నటించిన కూడా మాజీ హీరోయిన్ ఆ పాత్రకు తగ్గట్లు చాలా బాగా చేసింది. ఒకప్పటి కామెడీ కింగ్ రాజేంద్ర ప్రసాద్ కూడా తన కామిక్ హావభావాలతో కొన్ని చోట్ల నవ్విస్తారు.

ప్రకాష్ రాజ్, రావు రమేష్, హరితేజ తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. అదేవిధంగా మిగిలిన నటీనటులు కూడా అయా పాత్రల్లో తమ నటనతో ఆకట్టుకున్నారు. ఇక కామెడీని హ్యాండిల్ చేయడంలో ‘పటాస్’ నుంచే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని తనదైన మార్క్ కామెడీతో, తన మార్క్ డైలాగ్ లతో, వరుస విజయాలను అందుకుంటున్న అనిల్ రావిపూడి ఈ సినిమాతో కామెడీతో పాటు బలమైన యాక్షన్ అండ్ ఎమోషన్ తో కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.

 

మైనస్ పాయింట్స్ :

అనిల్ రావిపూడి కామెడీతో పాటు యాక్షన్ తో ఆకట్టుకున్నప్పటికీ.. కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో మంచి పనితీరుని కనబర్చినప్పటికీ.. కథ విషయంలో మాత్రం అనిల్ రావిపూడి పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. అనిల్ రావిపూడి అంటే ఫుల్ కామెడీ ఉంటుందనుకుంటే.. ఆ విషయంలో కూడా తడబడ్డాడు. కామెడీ బాగానే వున్నా.. ఆయన గత సినిమాల రేంజ్ లో లేదు, ఇక కొన్ని సీన్స్ లో ర‌ష్మిక చిన్న పిల్ల‌లా అనిపించింది. డ్యాన్సుల వ‌ర‌కు ఓకే అనిపించినా.. సినిమాలో ఆమె పాత్ర‌కు హుందాత‌నం మిస్ అవ్వడంతో పాటు కొన్ని సీన్స్ లో ఆమె ఓవర్ యాక్టింగ్ చేస్తోన్న భావన కలుగుతుంది.

పైగా సినిమా మొదటి భాగంలో ఉన్నంత కామెడీని.. సెకెండ్ హాఫ్ లో దర్శకుడికి కంటిన్యూ చేసే స్కోప్ లేకపోవడం, కొన్ని సన్నివేశాలు సినిమాటిక్ గా సాగడం, దీనికి తోడు సెకెండ్ హాఫ్ లో కొన్ని సీక్వెన్స్ కూడా సరిగ్గా వర్కౌట్ అవ్వకపోవడం, ర‌ష్మిక‌ను స‌రిగ్గా వాడుకోలేక‌పోవ‌డం, విజ‌య‌శాంతి పాత్రకు ఇంకా ప్రాధాన్యం ఉండాలని ఫీలింగ్ రావడం వంటి అంశాలు సినిమా రేంజ్ ని తగ్గిస్తాయి.

 

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. అనిల్ రావిపూడి దర్శకుడిగా ఆకట్టుకున్నా.. రచయితగా మాత్రం పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయారు. అయితే కథలో బలం లేకపోయినా, కామెడీతో సాగే వైవిధ్యమైన పాత్రలతో చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. కానీ ఆయన కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా మలిచి ఉంటే బాగుండేది. సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సమకూర్చిన పాటలు ఆడియో పరంగా కంటే కూడా.. సినిమాలో విజువల్ గా పరంగా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. ఇక దేవి శ్రీ ప్రసాద్ అందించిన నేపధ్య సంగీతం కూడా బాగుంది. అలాగే సినిమాటోగ్రఫీ వర్క్ కూడా బాగుంది. సినిమాలోని సన్నివేశాలన్నీ కథకి అనుగుణంగా చాలా అందంగా చిత్రీకరించారు. ఇక తమ్మిరాజు ఎడిటింగ్ బాగున్నప్పటికీ.. సెకండ్ హాఫ్ కథనాన్ని ఇంకా సాధ్యమైనంత వరకు ట్రీమ్ చేసి ఉంటే.. సినిమాకి ప్లస్ అయ్యేది. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు బాగున్నాయి.

 

తీర్పు :

పైన చెప్పుకున్నట్లుగానే దర్శకుడు కామెడీతో పాటు ఎమోషన్ అండ్ యాక్షన్ తో ఆకట్టుకున్నాడు, ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ అండ్ పొలిటీషియన్స్ కి ఇచ్చే వార్నింగ్ సీన్, మరియు క్లైమాక్స్ కు ముందు వచ్చే కొన్ని సన్నివేశాల్లో మంచి పనితీరుని కనబర్చినప్పటికీ.. కథ మరియు సెకెండ్ హాఫ్ విషయంలో మాత్రం అనిల్ రావిపూడి తడబడ్డాడు. పైగా ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత కామెడీని.. సెకెండ్ హాఫ్ లో కంటిన్యూ చేయలేకపోవడం, కొన్ని సీక్వెన్సెస్ సినిమాటిక్ గా సాగడం వంటి అంశాలు సినిమాని బలహీనపరుస్తాయి. అయితే మహేష్ బాబు తన నటనతో తన డైలాగ్ మాడ్యులేషన్ తో ఈ సినిమాని మరో లెవల్ కి తీసుకు వెళ్లారు. అలాగే విజయశాంతి కూడా తన నటనతో ఆకట్టుకున్నారు. ఓవరాల్ గా ఈ చిత్రం మహేష్ బాబు ఫాన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది. అయితే మిగిలిన అన్నివర్గాల ప్రేక్షకులని ఎంత వరకు అలరిస్తుందో చూడాలి.

 

123telugu.com Rating : 3.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు