సమీక్ష : లైఫ్ అఫ్ పై – స్లో విజువల్ వండర్

సమీక్ష : లైఫ్ అఫ్ పై – స్లో విజువల్ వండర్

Published on Nov 23, 2012 4:10 AM IST
విడుదల తేదీ: 22 నవంబర్ 2012
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.5/5
దర్శకుడు : ఆంగ్ లీ
నిర్మాత : ఆంగ్ లీ, గిల్ నెట్టార్
సంగీతం : మైకేల్ దన్న
నటీనటులు : ఇర్ఫాన్ ఖాన్ , టబు, సూరజ్ శర్మ

అవార్డ్ గ్రహీత యాన్ మార్టెల్ రచించిన పుస్తకం ఆధారంగా దర్శకుడు ఆంగ్ లీ తెరకెక్కించిన చిత్రం “లైఫ్ అఫ్ పై”. గ్రాఫిక్ మాయాజాలంగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ చిత్రంలో ఇర్ఫాన్ ఖాన్,టబు,సురాజ్ శర్మ, ఆదిల్ హుస్సేన్ మరియు గేరార్డ్ ప్రధాన పాత్రలలో కనిపించారు.

కథ:
పిస్కిన్ మోలిటర్ లేదా పై(సురాజ్ శర్మ) అనే పాత్ర చుట్టూనే కథ మొత్తం తిరుగుతుంది దక్షిణ భారత దేశస్థుడిగా కనిపించే పై చాలా తెలివైన కుర్రాడు, పై తల్లితండ్రులు (ఆదిల్ హుస్సేన్ మరియు టబు) ఒక జూ ని నడుపుతూ సాధారణ జీవితం గడుపుతూ ఉంటారు. మరింత మెరుగయిన జీవితం కోసం పై తండ్రి కుటుంబంతో సహా కెనడా బయలుదేరుతారు. జంతువులతో పాటు వెళ్తున్న పడవ తుఫాను కారణంగా మునిగిపోతుంది. పై మరియు నాలుగు జంతువులు ఈ ఘటన నుండి బయటపడతారు. ఆ నాలుగు జంతువులలో బెంగాల్ టైగర్ రిచర్డ్ పార్కర్ ఒకటి. తన బోటులో ఉన్న జంతువులతోనే కాకుండా పరిస్థితులతో కూడా పోరాడాల్సిన పై ప్రయాణం ఎలా సాగింది అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

చిత్రంలో అబ్బురపరిచే విజువల్స్ ఉన్నాయి జేమ్స్ కెమరూన్ “అవతార్” చిత్రం తరువాత ఆ స్థాయి గ్రాఫిక్స్ ఈ చిత్రంలో ఉన్నాయి. తుఫాను వచ్చే సన్నివేశం అందులో నుండి పై తప్పించుకునే సన్నివేశం మరియు పై కి బెంగాల్ టైగర్ కి మధ్యన వచ్చే సన్నివేశాలు అద్భుతం అని చెప్పుకోవాలి. ఇంకా చెప్పుకోవాలంటే మేజికల్ ఐస్ ల్యాండ్, బ్లూ వేల్ మరియు పులి సన్నివేశాలు చాలా బాగున్నాయి.

నటుడిగా సురాజ్ పై పాత్రకు వంద శాతం న్యాయం చేశాడు పై పాత్రకు జీవం పోసాడు, ఇర్ఫాన్ ఖాన్ కూడా చాలా బాగా నటించారు. టబు మరియు ఆదిల్ హుస్సేన్ వారి పాత్రల మేరకు బాగా నటించారు.

పడవ మునిగిపోయే సన్నివేశాలలో ఆంగ్ లీ దర్శకత్వం అద్భుతం. ఈ చిత్రంలో మంచి డైలాగ్స్ ఉన్నాయి అంతే కాకుండా కావలసినంత కామెడి కూడా పండించారు. ఈ చిత్రాన్ని ఖచ్చితంగా 3Dలో చూడాల్సిన చిత్రం.

మైనస్ పాయింట్స్ :

ఈ చిత్రం పాప్ కార్న్ ఎంటర్ టైనర్ కాదు “3D అడ్వెంచర్ మూవీ” అనగానే ప్రేక్షకుడికి కొన్ని అంచనాలు ఉంటాయి కాని ఈ చిత్రం చాలా నెమ్మదిగా మొదలయ్యి క్లైమాక్స్ లో కూడా నెమ్మదిగానే సాగుతుంది . పుస్తకంలో లానే చిత్రంలో కూడా దేవుడు మరియు నమ్మకం మధ్య ప్రశ్న గురించి పలు మార్లు ప్రస్తావించారు. కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ తప్పితే చిత్రంలో సినీ ప్రేమికులు ఎంజాయ్ చెయ్యడానికి ఏమి లేదు. చిత్రం నెమ్మదిగా సాగడం క్లైమాక్స్ కాస్త సంక్లిష్టంగా(పుస్తకం చదవని వారికి) అనిపించడం కాస్త ఇబ్బంది పెట్టె విషయాలు.

సాంకేతిక అంశాలు:

క్లౌడియో మిరండా అందించిన సినిమాటోగ్రఫీ మరియు రిథమ్ అండ్ హ్యుస్ స్టూడియో అందించిన విజువల్ ఎఫెక్ట్స్ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. వీరు ప్రాణం పెట్టి ఈ చిత్రాన్ని చేశారు. చిత్రం మొదట్లో ఎడిటింగ్ ఇంకాస్త బాగుండాల్సింది. దర్శకుడిగా ఆంగ్ లీ విజయం సాదించారు.

తీర్పు :

“లైఫ్ అఫ్ ఫై” మనిషి భావోద్వేగాల మీద వచ్చిన అద్భుతమయిన చిత్రం. చిత్రంలో 3D ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ మరియు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎంటర్ టైనర్ చిత్రాన్ని ఆశించి వెళ్ళకండి చిత్రం చాలా చోట్ల నెమ్మదిస్తుంది. ఈ చిత్రాన్ని చూడాలనుకుంటే కాస్త ఎక్కువగానే పాప్కార్న్ తీసుకు వెళ్ళండి.

123తెలుగు.కాం రేటింగ్ : 3.5/5

అనువాదం – రv

సంబంధిత సమాచారం

తాజా వార్తలు