సీనియర్ నిర్మాత కే ఎస్ రామారావు నిర్మాతగా తెరకెక్కిస్తున్న చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్. విజయ్ దేవరకొండ హీరోగా రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, క్యాథెరిన్, ఇసబెల్లా హీరోయిన్స్ గా దర్శకుడు క్రాంతి మాధవ్ తెరకెక్కించిన ఈ మూవీ వచ్చే నెల 14న లవర్స్ డే కానుకగా విడుదల కానుంది. ఈ సంధర్భంగా కే ఎస్ రామారావు పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు.
ఒక సీనియర్ నిర్మాతగా అనేక మంది స్టార్స్ తో సినిమాలు తీశారు, మరి ఈ జనరేషన్ వాళ్ళతో చేయడం ఎలా ఉంది?
నేను దాదాపు మూడు,నాలుగు తరాల హీరోలతో పని చేశాను. సాంకేతికత పరంగా, ఆలోచన విధానం వంటి అనేక విషయాలలో మార్పు వచ్చింది. ఈ జనరేషన్ వాళ్ళ అబిప్రాయాలను గౌరవిస్తూ వారితో పాటు ముందుకు వెళతాం. ఓ టి టి ప్లాట్ ఫార్మ్ అయిన నెట్ ఫ్లిక్స్, అమెజాన్ వంటి వాటిలో సెక్స్వల్ కంటెంట్, న్యూడిటీ ఎక్కువైపోయింది.
సెక్స్వల్ కంటెంట్, న్యూడిటీ సినిమాపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
సెక్సువల్ కంటెంట్, న్యూడిటీ సినిమాలో చూడటానికి ఇష్టపడరు. సినిమాలలో ఉన్నప్పటికీ దానిని అందంగా, అసభ్యకరంగా అనిపించకుండా దర్శకుడు, కెమెరా మెన్ చూపిస్తారు. సినిమాలో న్యూడిటీ ని కుటుంబ సభ్యులతో కలిసి చూడటం ఇబ్బంది కలిగించే విషయం.
వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో నలుగురు అమ్మాయిలు ఎందుకని?
కథ అవసరాన్ని బట్టే నలుగురు అమ్మాయిలు తీసుకోవడం జరిగింది. ఈ సినిమాలో హీరో నలుగురు అమ్మాయిలతో వివిధ కాలాల్లో ప్రేమాయణం సాగిస్తాడు. ఆ నలుగురిలో ఎవరికి వారే సపరేటు, పాత్రల మధ్య లింక్, సంఘర్షణ ఉండదు.
విజయ్ దేవరకొండ మిమ్ముల్ని ఎలా ఆకర్షించారు?
పెళ్లి చూపులు సినిమా చూసినప్పుడే విజయ్ ఒక ప్రత్యేకమైన నటుడు అనిపించింది. తెలుగులో అలాంటి మరొక నటుడు రవితేజ, అలాగే కన్నడలో ఉపేంద్ర తమిళంలో కూడా ఒకరిద్దరు ఉన్నారు.
వరల్డ్ ఫేమస్ లవర్ షూటింగ్ టింగ్ డిలే ఎందుకయ్యింది?
పాత్రలకు తగ్గట్లుగా హీరోయిన్స్ ని ఎంపిక చేయడానికి, అలాగే హీరో విజయ్ దేవరకొండ వివిధ గెటప్స్ లో కనిపించాలి. ఒకసారి గడ్డం పెరిగి, ఇంకో పాత్ర కోసం గడ్డం లేకుండా ఇలా అనేక సాంకేతిక మరియు ఇతర కారణాలతో ఈ మూవీ షూటింగ్ డిలే అయ్యింది.
హీరోయిన్స్ గురించి చెప్పండి?
నలుగురు హీరోయిన్స్ చాలా బాగా చేశారు. రాశి ఖన్నా పాత్ర కొంచెం బోల్డ్ గా ఉంటుంది. ఇసాబెల్లా బ్రెజిల్ ఆర్టిస్ట్ తను కూడా పాత్రకు తగ్గట్టుగా చక్కగా నటించింది. ఇక ఐశ్వర్య రాజేష్, క్యాథెరిన్ పాత్రలకు కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది.