విడుదల తేదీ: 23 నవంబర్ 2012 | ||
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5 |
||
దర్శకుడు : ప్రవీణ్ సత్తారు |
||
నిర్మాత : చాణక్య | ||
సంగీతం : మిక్కి జె. మేయర్ |
||
నటీనటులు : సందీప్ కిషన్, రేజీన |
రెండేళ్ళ క్రితం లైఫ్ బిఫోర్ వెడ్డింగ్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా అడుగుపెట్టిన ప్రవీణ్ సత్తారు రెండో సినిమా రొటీన్ లవ్ స్టొరీ. సందీప్ కిషన్, రేజీన ప్రధాన తారాగణంగా తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజే విడుదలైంది. చాణక్య నిర్మించిన ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు. రొటీన్ లవ్ స్టొరీ రొటీన్ గా ఉందా? వెరైటీగా ఉందా? ఇప్పుడు చూద్దాం.
కథ :
సంజు (సందీప్ కిషన్) ఫస్ట్ ఇయర్ ఇంజినీరింగ్ స్టూడెంట్. అదే కాలేజీలో చదివే తన క్లాస్ మెట్ తన్వి (రేజీన) ని మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. పరిచయమైన కొత్తలో ఫ్రెండ్స్ లాగా గడుపుతారు. ఫ్రెండ్ కొన్ని రోజుల తరువాత సంజు, తన్వికి లవ్ ప్రొపోజ్ చేస్తాడు. తన్వి మాత్రం కొంత సమయం కావాలంటుంది. కొన్ని రోజులు కలిసి ఉండి (విదేశాల్లో డేటింగ్) అప్పుడు నిర్ణయించుకుందాం అంటుంది. వారి ప్రేమ పెళ్లి వరకు దారి తీసిందా లేదా అనేది మిగతా సినిమా కథ.
ప్లస్ పాయింట్స్ :
ఈ రోజు యువతీయువకుల మధ్య రిలేషన్ ఎలా ఉంది అనేది నాచురల్ గా చూపించే ప్రయత్నం చేసాడు దర్శకుడు. ఆన్ స్క్రీన్ మీద సందీప్ కిషన్, రేజీన మధ్య కెమిస్ట్రీ చాలా బావుంది. ప్రస్థానం సినిమాలో సైకో పాత్రతో మెప్పించిన సందీప్ ఈ సినిమాలో లవర్ బాయ్ లాగా బావున్నాడు. రేజీన అందం, అభినయం కలగలిసిన నటి అని చెప్పుకోవాలి. ఈ రోజుల్లో అమ్మాయిల మనస్తత్వాన్ని అద్దం పడుతూ ఆమె పాత్ర సాగింది. వీరిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు బాగా తీసాడు. ప్రేమంటే కలిసి సినిమాలకి, రెస్టారెంట్లకి తిరగడం మాత్రమే కాదు, పెళ్ళయ్యాక ఉండే సమస్యలని చూపించే ప్రయత్నం చేసాడు దర్శకుడు.
మైనస్ పాయింట్స్ :
సినిమాలో కామెడీ పార్ట్ వెరీ వీక్. తాగుబోతు రమేష్, ఎం.ఎస్. నారాయణ సెపరేట్ కామెడీ ట్రాక్ బలవంతంగా ఇరికించినట్లుగా ఉంది. ఆ కామెడీ ట్రాక్స్ పెట్టకపోయినా బావుండేది. కమర్షియల్ సినిమా అంటే కొన్ని అంశాలు కచ్చితంగా ఉండాలి అన్నట్లు అనుకున్నాడు దర్శకుడు ప్రవీణ్. ఝాన్సీ, హేమ, రాళ్లపల్లి పాత్రలను కూడా సరిగా వాడుకోలేకపోయాడు. ఇలాంటి సినిమాలు గతంలో చాలానే వచ్చాయి. మొదటి భాగం వరకు సరదాగా బాగానే ఉన్నా రెండవ భాగం మరింత స్లోగా సాగింది. థిన్ స్టొరీ లైన్ ఉండే ఇలాంటి సినిమాల్లో కథనం ఆసక్తికరంగా ఉంటేనే సినిమా నిలబడుతుంది. అనుభవలేమి వల్ల ప్రవీణ్ కొంత తడబడ్డాడు.
సాంకేతిక విభాగం :
మిక్కీ జే మేయర్ సంగీతంలో తెలియదే, నా మనసు పాటలు బావున్నాయి. చిత్రీకరణ కూడా బావుంది. డైలాగ్స్ రొటీన్ గా కాకుండా నేచురల్ గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ కూడా బావుంది. ఎడిటింగ్ పర్వాలేదు.
తీర్పు :
రొటీన్ లవ్ స్టొరీ మరీ రొటీన్ సినిమాల లాగా కాకపోయినా కొంచెం విభిన్నంగా బావుంది. రొటీన్ కామెడీ ట్రాక్స్ తప్పిస్తే రొటీన్ లవ్ స్టొరీ డీసెంట్ యూత్ లవ్ ఎంటర్టనర్.
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
అవాద్